- గిరిజన సలహా మండలి ఏర్పాటులో నిర్లక్ష్యం
- వైద్యం అందించని దుస్థితి
- ఏజెన్సీ జిల్లా ఏర్పాటుకు డిమాండ్
- మారేడుమిల్లి ప్లీనరీలో కన్నబాబు ధ్వజం
గిరిజన మంత్రే లేని బాబు సర్కార్
Published Mon, Jun 19 2017 11:38 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
మారేడుమిల్లి (రంపచోడవరం) :
రాష్ట్ర చరిత్రలో టీడీపీ చంద్రబాబు ప్రభుత్వంలోనే గిరిజన మంత్రి లేని పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ నేటికీ గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయకపోవడం చూస్తే గిరిజనులపై వారికి ఉన్న ప్రేమ తేటతెల్లమవుతుందన్నారు. మారేడుమిల్లిలో సోమవారం నిర్వహఙంచిన పార్టీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో ఆయన ప్రభుత్వం తీరును ఎండగట్టారు. పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఏజెన్సీలో పర్యటించినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలవరం ప్రాజెక్టు విషయంలో తక్కువ నష్టపరిహారం పొందిన ప్రతి ఎకరానికి మెరుగైన పరిహారం చెల్లిస్తామని చెప్పిన విషయాన్ గుర్తు చేశారు. సరైన వైద్యం అందక గిరిజన చిన్నారులు మృత్యువాత పడుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేయలేదన్నారు. జన్మభూమి కమిటీల పెత్తనం మితిమిరిపోతుందన్నారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకపోవడం గిరిజనులను అవమాన పరచడమేనన్నారు. టీఎస్‌పీ నిధులు దారి మళ్ళించి ఇతర ప్రయోజనాలు కోసం వాడుతున్నారన్నారు. శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరిలోని ఏజెన్సీ ప్రాంతాలను కలిపి ఏజెన్సీ జిల్లా ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం నిర్వాసితులు గ్రామాన్ని ఖాళీ చేసే తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించాలన్నారు. పాడేరు ఎమ్మెల్యే, పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకురాలు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ మాయలేడి కొత్తపల్లి గీతా నలికి కుల ధ్రువీకరణ పత్రం చూపి జగనన్న దగ్గర టికెట్ పొంది నేడు ఢీల్లికి పరిమితమైయ్యారని ఆరోపించారు. రాష్ట్ర ప్లీనరీలో గిరిజన సలహా మండలి ఏర్పాటు, ఉద్యోగులకు సీఎస్‌పీ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని తీర్మానించాలన్నారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేశారన్నారు. ప్లీనరికి అధ్యక్షత వహించిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మాట్లాడుతూ పార్టీ విజయనికి కలిసికట్టుగా పనిచేయాలన్నారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ పార్టీ అధినేతను సీఎం చేసేందుకు పనిచేయలన్నారు. నియోజకవర్గ పరిశీలకురాలు మేడపాటి షర్మిలరెడ్డి, నాయకులు కొల్లి నిర్మలకుమారి, మిండగుదిటి మోహన్, కర్రి పాపారాయుడు, రావూరి వెంకటేశ్వరరావు, కొమ్మిశెట్టి బాలకృష్ణ, పార్టీ కోఆర్టినేటర్లు పెండెం దొరబాబు, తోట సుబ్బారావు నాయుడు, కొండేటి చిట్టిబాబు, ముత్యాల శ్రీనివాస్, పర్యత పూర్ణచంద్రపసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శులు అత్తిలి సీతారామస్వామి, శెట్టిబత్తుల రాజబాబు ప్రసంగించారు.
Advertisement
Advertisement