చిన్నారిని ఒక సంచిలో తరలించుకుపోతున్న క్రమంలో రోడ్డుపై ప్రయాణికులు గుర్తించి ఎవరది అని గద్దించడంతో సంచిని అక్కడే వదిలేసి పరారైన ఘటన గురువారం రాత్రి ఎ.కొత్తపల్లి రైల్వే గేటు రహదారిలో చోటుచేసుకుంది. అన్నవరం గ్రామానికి చెందిన గంపల అప్పన్న
-
సంచిలో తరలిస్తూ వదలివెళ్లిన దుండగులు
-
అక్కున చేర్చుకున్న ప్రయాణికులు
-
కేసు నమోదు చేసిన పోలీసులు
తొండంగి :
చిన్నారిని ఒక సంచిలో తరలించుకుపోతున్న క్రమంలో రోడ్డుపై ప్రయాణికులు గుర్తించి ఎవరది అని గద్దించడంతో సంచిని అక్కడే వదిలేసి పరారైన ఘటన గురువారం రాత్రి ఎ.కొత్తపల్లి రైల్వే గేటు రహదారిలో చోటుచేసుకుంది. అన్నవరం గ్రామానికి చెందిన గంపల అప్పన్న తన బావమరిది రాజు గురువారం పెరుమాళ్లపురం వెళ్లారు. రాత్రి పదిన్నర గంటలకు బైక్‌పై తిరిగి వస్తుండగా గోపాలపట్నం రైల్వేగేటు వేసి ఉంది. దీంతో అక్కడ ఆగిన అతనికి ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ పొలాల్లో నక్కి ఉండడాన్ని గమనించిన అప్పన్న ఎవరది అని ప్రశ్నించగా చేతిలో ఉన్న ప్లాస్టిక్ గోనె సంచిని వదిలేసి వెళ్లారు. వారు వదిలేసిన సంచిలో నుంచి చిన్నారి బయటకు రావడంతో అవాక్కైన అప్పన్న వెంటనే పిల్లను ఎత్తుకున్నాడు. మూడేళ్ల వయసున్న చిన్నారి అమ్మ పొయింది, నాన్నపోయింది అన్నమాటలు తప్ప ఇతర వివరాలు చెప్పలేక పోతున్నదని అప్పన్న తెలిపాడు. తన బావమరిది రాజుకు ఆమె చాలా చేరువైందని తెలిపాడు. ఈ విషయమె శుక్రవారం అన్నవరం పోలీసులకు సమాచారం ఇచ్చామని అప్పన్న వివరించాడు. చిన్నారి బంధువులు ఎవరైనా వస్తే పోలీసుల ద్వారా అప్పగిస్తామని వివరాలకు తన సెల్: 81870 77795 గానీ, అన్నవరం పోలీసులను సంప్రదించాలన్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.