
‘ఆరోగ్యలక్ష్మి’ని సద్వినియోగం చేసుకోవాలి
కోదాడఅర్బన్: రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలు, బాలింతల ఆరోగ్యం కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని 5వ వార్డు కౌన్సిలర్ ఎస్‌కె.షఫీ కోరారు. శనివారం పట్టణంలోని 5వ వార్డు పరిధిలోని 1వ అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహార వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కోటేశ్వరి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం కోసం పాలు, గుడ్లు వంటి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా పౌష్టికాహార వస్తువులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్ ఇందిర, పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.