ఉయ్యాలోత్సవంలో లక్ష్మీనారసింహుడు
ఉయ్యాలోత్సవంలో లక్ష్మీనారసింహుడు
Published Wed, Mar 29 2017 10:29 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
కదిరి : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు రంగ మండపంలో ఉయ్యాలోత్సవంలో తన భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం అర్చకులు హేవిళంబి నామ నూతన సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది ఎండలు మండిపోతాయని, రైతులు నకిలీ విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోతారని తెలియజేశారు. పిడుగుపాటు వలన జన నష్టం, అకాల వర్షంతో పంట నష్టం సంభవిస్తుందని తెలిపారు. బియ్యం, చక్కెర, గోధుమల ధరలు మండిపోతాయన్నారు. విద్యాలయాల్లో గురువులే పిల్లలపై కాటేసే ప్రమాదముందన్నారు. విద్యాలయాలన్నీ వ్యాపార కేంద్రాలుగా దర్శనమిస్తాయని పేర్కొన్నారు. తెలుగు చలనచిత్ర సీమలో చిన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. సెల్‌ఫోన్‌ల పిచ్చి పెరిగి పోయి సెల్ఫీలే కొంప ముంచుతాయన్నారు. ప్రేమ పెళ్లిళ్లు, ఆత్మహత్యలు, అనుమానాస్పద మృతుల సంఖ్య బాగా పెరుగుతుందని తెలిపారు. సాఫ్ట్‌వేర్ రంగానికి గడ్డుకాలమేనని తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మెన్ పచ్చిపులుసు నరేంద్రబాబు, ఆలయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్, రఘునాథరెడ్డి, నాగరాజు, బీజేపీ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, ఇంకా పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
Advertisement