7న హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
7న హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్
Published Tue, Aug 2 2016 9:31 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
హజ్ పిలిగ్రిమ్స్ సర్వీస్ సొసైటీ అధ్యక్షుడు
హజి మహమ్మద్ రఫీ
ఆనందపేట : జిల్లా నుంచి ఈ ఏడాది హజ్ యాత్రకు ఎంపికైన 400 మంది యాత్రికులకు రాష్ట్ర హజ్ కమిటీ, హజ్ పిలిగ్రిమ్స్ సర్వీస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సొసైటీ అధ్యక్షుడు హజి మహమ్మద్ రఫి తెలిపారు. మంగళవారం పొన్నూరు రోడ్డులోని సొసైటీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ ఉదయం 9 గంటల నుంచిlపొన్నూరు రోడ్డులోని అంజుమన్ ఇస్లామియా హైస్కూల్‌లో కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. హజీలందరూ తప్పని సరిగా పాల్గొని వైద్యాధికారుల పర్యవేక్షణలో వ్యాక్సిన్లను తప్పని సరిగా వేయించుకొని, ధ్రువీకరణ పత్రం పొందాలని కోరారు. ఈ సందర్భంగా హజ్ యాత్రికులకు తమ సొసైటీ ద్యారా లగేజి బ్యాగ్, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు.
Advertisement
Advertisement