అనుమానాస్పద స్థితిలో యువతి మృతి | Vanaja hung herself in anantapur district | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

Published Sun, Aug 9 2015 9:45 AM | Last Updated on Thu, Apr 4 2019 12:50 PM

Vanaja hung herself in anantapur district

అనంతపురం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో వనజ (22) అనే యువతి ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మరణించింది. వనజ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వనజ మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వనజ మృతదేహన్ని స్వాధీనం చేసుకుని.... పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా వనజ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement