Hung
-
‘హంగ్’ రావొద్దనే... కాంగ్రెస్‌తో పొత్తుపై ఒమర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల అనంతరం హంగ్ పరిస్థితి రాకుండా ప్రజలకు ఒక అవకాశం కల్పించేందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దులా వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు కాదేమోనన్న అనుమానాలు అక్కర్లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. దాల్ సరస్సులో ఆదివారం షికారా(పడవ)లతో చేపట్టిన ర్యాలీలో అబ్దుల్లా మాట్లాడారు. ఎన్నికల తర్వాత జమ్మూకశ్మీర్‌లో హంగ్ ఏర్పడాలని బీజేపీ కోరుకుంటోందని, తద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ పాలనను పొడిగించాలని చూస్తోందని ఆరోపించారు. అయితే, ప్రజలు బీజేపీకి ఆ అవకాశం ఇవ్వబోరని చెప్పారు. కశ్మీర్ లోయలో ప్రచారంతో ఫలితం ఉండదని ముందుగానే గ్రహించిన బీజేపీ నేతలు జమ్మూలో మాత్రమే పర్యటిస్తున్నారని ఒమర్ వ్యాఖ్యానించారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జమ్మూకశ్మీర్‌లో మూడు కుటుంబాల పాలన అంటూ విమర్శలు చేస్తోందన్నారు. -
వచ్చేది హంగ్.. మనదే పవర్!
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో హంగ్ తప్పదు.. అయినా అధికారం మనదే’అని బీజేపీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అన్నారు. ‘బీజేపీ నిర్వహించిన సర్వేలు, అధ్యయనాలను పరిశీలిస్తే ఏ పార్టీకి 60 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని విశ్వసించొద్దు. వాటి ఉచ్చులో పడొద్దు..’అని చెప్పారు. శుక్రవారం ఘట్కేసర్ సమీపంలోని ఓ కాలేజీలో జరిగిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల దిశానిర్దేశం చేశారు. మొత్తం 43 మంది అగ్రనేతల సభలు ‘వచ్చే 60 రోజులు టార్గెట్‌గా పెట్టుకొని గట్టిగా కృషి చేయాలి. రాత్రి, పగలు కష్టపడాలి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం 43 మంది అగ్రనేతలు, ముఖ్య నాయకుల సభలు నిర్వహిస్తాం. ఎప్పటినుంచో పని చేస్తున్నాం.. టికెట్ ఇవ్వాలి అంటే కుదరదు. 119 స్థానాల కోసం 2 వేల మంది అడుగుతున్నారు. స్థానిక బలం ఆధారంగానే టికెట్ ఇస్తాం. టికెట్లు ఢిల్లీలోనో, హైదరాబాద్‌లోనో డిసైడ్ కావు. నియోజకవర్గాల్లో చేసే పని ఆధారంగా స్థానికంగానే నిర్ణయిస్తాం. ముఖ్యమంత్రి ఎవరు అనేది జాతీయ నాయకత్వం చూసుకుంటుంది. ఎవరూ నేను ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకోవద్దు. అధికారంలోకి వస్తే అందరికీ పదవులు వస్తాయి..’అని సంతోష్ చెప్పినట్టు తెలిసింది. మనం ఓడిపోలేదు.. బలపడ్డాం ‘మనం సరిగ్గా పనిచేయాలి. మనలో మనం గొడవలు పడొద్దు. ఎవరూ లూజ్ టాక్ చేయవద్దు. అందరూ కలిసి పని చేయండి. మునుగోడులో ఓడిపోయాం అని మీరు అనుకుంటున్నారు. కానీ మనం బలపడ్డాం. 12 వేల ఓట్ల నుండి 90 వేల ఓట్లకు పెరిగాం. జీహెచ్ఎంసీలో నాలుగు సీట్ల నుండి 48 సీట్లు గెలిచాం. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచాం. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఎంఐఎం అవసరం. అందుకోసమే ఆ పార్టీతో అవి అంటకాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, తెలంగాణ సీఎంలు ఒకేలా వ్యవహరిస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అక్రమ కేసులు పెడుతున్నారు. వీటికి భయపడాల్సిన అవసరం లేదు..’అని సంతోష్ పేర్కొన్నారు. కాగా పార్లమెంట్ ఉభయ సభలు ‘నారీశక్తి వందన్ బిల్లు’కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాష్ట్ర కౌన్సిల్ ఆమోదించింది. దీనితో పాటు రాజకీయ తీర్మానాన్ని, జీ–20 సమావేశాల విజయవంతం, చంద్రయాన్–2 విజయవంతంపై తీర్మానాలు కూడా ఆమోదించారు. బీజేపీకి మద్దతివ్వండి అన్నివర్గాల ప్రజలను దగా చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించి, ప్రజాస్వామ్యయుత పాలన నెలకొల్పేందుకు బీజేపీకి తెలంగాణ ప్రజలు మద్దతునివ్వాలని కోరుతూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. ‘మహమూద్ అలీ హోంమంత్రిగా ఉండటానికి అనర్హుడు. పోలీస్ చెంప పగలగొడతాడా?’అంటూ తీర్మానంలో ప్రశ్నించారు. సమావేశం ప్రారంభానికి ముందు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాలేజీ ప్రాంగణంలో మొక్క నాటారు. జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ ఛుగ్, సునీల్‌బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, రాష్ట్ర పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్, నేతలు అరి్వంద్ మీనన్, నల్లు ఇంద్రసేనారెడ్డి, సోయం బాపూరావు, పి.మురళీధర్‌రావు, వివేక్ వెంకటస్వామి, ఏపీ జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, పొంగులేటి సుధాకరరెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, రవీంద్రనాయక్, ఎవీఎన్ రెడ్డి, చిత్తరంజన్‌దాస్, డా.కాసం వెంకటేశ్వర్లు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్ అసెంబ్లీ: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
హంగ్ ఏర్పడితే..
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు పూర్తికాకముందే ప్రభుత్వ ఏర్పాటు విషయమై రాజకీయ పార్టీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయా? కేంద్రంలో ఏ కూటమికి పూర్తిస్థాయి మెజారిటీ రానిపక్షంలో తటస్థ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే జవాబు చెబుతున్నారు. మిత్రపక్షాలతో కాంగ్రెస్ భేటీ లోక్‌సభకు మరో రెండువిడతల పోలింగ్ మిగిలిఉండగానే కాంగ్రెస్, వామపక్షాలు అనధికారంగా సంప్రదింపులు ప్రారంభించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, నేత డి.రాజా సోమవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సోనియాగాంధీ సన్నిహితుడు అహ్మద్ పటేల్‌తో సమాలోచనలు జరిపినట్లు వెల్లడించాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష పార్టీలన్నీ మే 21 లేదా 22న ఢిల్లీలో సమావేశమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ భేటీలోనే కనీస ఉమ్మడి ప్రణాళిక(సీఎంపీ)పై పార్టీలన్నీ చర్చించవచ్చని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌ను రాజకీయ పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలను అయోమయంలోకి నెట్టేసి మోదీకి లబ్ధి చేకూర్చేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేశారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై కాంగ్రెస్ కోర్ కమిటీ ఈ నెల 10న(శుక్రవారం) సమావేశమై చర్చిస్తుందని పేర్కొన్నారు. నవీన్ పట్నాయక్‌పై మోదీ ప్రశంసలు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలకు చెక్ పెట్టేందుకు కమలనాథులు తటస్థులుగా ఉన్న నేతల మద్దతుపై ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ సాధించలేకపోతే ఈ తటస్థ పార్టీల మద్దతుతోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలన్న కృతనిశ్చయంతో బీజేపీ నేతలు ఉన్నారు. ఒడిశాను ఫొని తుపాను అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఒడిశాలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘ సీఎం నవీన్ పట్నాయక్ ఫొని తుపానును సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పనిచేశాయి’ అని ప్రశంసించారు. మే 23 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ తక్కువైతే బీజేడీ లాంటి తటస్థ పార్టీల మద్దతు పొందాలన్న వ్యూహంతోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కోవింద్వైపే అందరి దృష్టి ఒకవేళ కేంద్రంలో హంగ్ ఏర్పడితే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాత్ర కూడా కీలకంగా మారనుంది. ఎందుకంటే 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలవడంతో అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ ప్రధాని పదవి చేపట్టాల్సిందిగా వాజ్‌పేయిని ఆహ్వానించారు. కానీ 1998లో అప్పటి రాష్ట్రపతి నారాయణన్ వాజ్‌పేయిని ఆహ్వానించడంతో పాటు 272 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు లేఖలు సమర్పించాలని సూచించారు. 2004 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అప్పటి రాష్ట్రపతిæకలాం ఇదే సంప్రదాయాన్ని పాటించారు. ఈ నేపథ్యంలో 17వ లోక్‌సభ ఎన్నికల్లో ఒకవేళ హంగ్ ఏర్పడితే కోవింద్ ఏ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారన్న విషయమై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో తటస్థులు, ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశముందని అంచనా. -
హంగ్ వస్తే!
-
కన్నడనాట హంగ్ తప్పదు : ఎగ్జిట్ పోల్స్
-
కర్ణాటకలో హంగ్!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ తరుణంలో కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని ఓ సర్వేలో వెల్లడైంది. తాజాగా కర్ణాటక ఎన్నికలపై వెలువడిన ఇండియా టుడే-కార్వీ ఒపీనియన్ పోల్ ఫలితాల్ని పరిశీలిస్తే... కాంగ్రెస్ పార్టీనే మరోసారి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది కాంగ్రెస్‌కు 90-101 సీట్లు వచ్చే అవకాశం బీజేపీకి 78-86 సీట్లు వచ్చే అవకాశం జేడీఎస్‌కు 34-43 సీట్లకు ఛాన్స్ ఇతరులు 4-7 సీట్లు దక్కించుకోవచ్చు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనున్న జేడీఎస్ 33 శాతం ప్రజలు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు -
మేఘాలయలో హంగ్ ?
-
బేరసారాల కోసం కొత్త ఆట
ఓటమి తప్పదని ఎస్పీ, బీఎస్పీకి అర్థమైంది ► అందుకే హంగ్ రావాలని కోరుకుంటున్నాయి ► హంగ్ వస్తే అధికారం కోసం బేరసారాలు ఆడాలనేది వారి ఆలోచన ► ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మావు(యూపీ): ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ముందుగానే ఊహించిన ఎస్పీ, బీఎస్పీ కొత్త ఆటకు తెర తీశాయని, యూపీలో హంగ్ రావాలని కోరుకుంటున్నాయని, తద్వారా అధికారంకోసం బేరసారాలు ఆడొచ్చనేది వారి ఆలోచన అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరోపించారు. ‘‘యూపీలో మూడో దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎస్పీ, బీఎస్పీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అవకాశాలు లేవని అర్థమైపోయింది. దీంతో వారు కొత్త ఆట, సరికొత్త ఎత్తుగడను ప్రారంభించారు. ఒకవేళ తాము ఓడిపోయినా.. లేదా సీట్ల సంఖ్య తగ్గినా.. ఎవరికీ మెజారిటీ రాకూడదని కోరుకుంటున్నాయి’’ అని చెప్పారు. సోమవారం యూపీలోని మావు పట్టణంలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సదర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఎస్పీ, బీఎస్పీ నాయకులకు నేను చెప్పేదొకటే. బీజేపీని ఓడించడానికి మీరు ఏమైనా చెయ్యండి. దానితో ఎటువంటి సమస్యా లేదు. కానీ యూపీ భవిష్యత్తుతో మాత్రం ఆటలాడొద్దు. యూపీ ఇప్పటికే చాలా కష్టాలను ఎదుర్కొంది. హంగ్ అసెంబ్లీ వస్తే బేరసారాలు ఆడేందుకు అవకాశం వస్తుందని మీరు ఆలోచిస్తున్నారేమో.. కానీ యూపీ ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఇచ్చిన విషయాన్ని మరిచిపోవద్దు. ఈ ఎన్నికల్లో కూడా యూపీ ప్రజలు బీజేపీకి ఘన విజయాన్ని కట్టబెడతారు’’ అని చెప్పారు. ఎన్నికల ప్రకటన వెలువడగానే ఎస్పీ అధికారం పోతుందనే ఆందోళనతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుందని, అయితే కాంగ్రెస్ మునిగిపోయే పడవ అని, దానితో పాటు ఎస్పీ కూడా మునిగిపోతుం దని, కాంగ్రెస్, ఎస్పీ కలసి మీడియా కవరేజీతో ప్రజలను ఏమార్చాలనుకుంటే కుదరదని చెప్పారు. ప్రజలకు పాలను.. నీటినీ ఎలా వేరు చేయాలో తెలుసన్నారు. ఎన్నికలు ప్రారంభమైన తర్వాత తమకు మూడింట రెండొంతుల మెజారిటీ వస్తుందని కాంగ్రెస్–ఎస్పీ నేతలు చెప్పారని, కానీ మూడో దశ పూర్తయ్యేసరికి వారికి వాస్తవం అర్థమైందని, మెజారిటీ మాట పక్కన పెట్టి తమకు మరో అవకాశం ఇస్తే.. తప్పులను సరిచేసుకుంటామని చెపుతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు పూర్తి మెజారిటీ వచ్చినా సరే మిత్రపక్షాలను కలుపుకునే యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కావడం వల్లే ప్రపంచం మొత్తం భారతదేశాన్ని కీర్తిస్తోందని, ఇదే విధంగా యూపీలోనూ బీజేపీకి పూర్తి మెజారిటీ ఇస్తే దేశం మొత్తం యూపీని కీర్తించేలా చేస్తామని హామీ ఇచ్చారు. -
యూపీ, పంజాబ్‌లో హంగ్!
గోవాలోనూ అంతే... ► ఉత్తరాఖండ్ బీజేపీదే ► ఒపీనియన్ పోల్స్ వెల్లడి న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. దేశంలో ఎక్కువ అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్తోపాటుగా పంజాబ్, గోవాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాదని, ఉత్తరాఖండ్‌లో మాత్రం కమలదళానిదే అధికారమని ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ద వీక్–హంస రీసెర్చ్ సంస్థ చేపట్టిన సర్వే ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ‘మొత్తం 403 స్థానాల్లో బీజేపీకి 192–196 సీట్లు రావొచ్చు. సమాజ్‌వాదీ– కాంగ్రెస్ కూటమికి 178–182 సీట్లు, బీఎస్పీ అతి దారుణంగా 20–24 స్థానాలకు పరిమితం అవుతుందని తేలింది. ఇతరులు 5–9 సీట్లు గెలుచుకుంటారు’ అని సర్వే అంచనా వేసింది. అటు పంజాబ్‌లోనూ హంగ్ తప్పేట్లు కనిపించటం లేదంది. ‘పంజాబ్‌లోని 117 సీట్లలో కాంగ్రెస్ 49–51 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 33–35 స్థానాలతో రెండో స్థానంలో, అకాలీదళ్–బీజేపీ కూటమి 28–30 సీట్లతో మూడో స్థానంలో నిలవనుంది. ఇతరులకు 3–5 సీట్లు వస్తాయి’ అని సర్వే పేర్కొంది. 70సీట్లున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ 37–39 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకుం టుందని.. కాంగ్రెస్ 27–29 స్థానాల్లో, బీఎస్పీ 1–3 స్థానాల్లో గెలవొచ్చని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. గోవాలో 40 సీట్లకు గానూ అధికార బీజేపీ 17–19, కాంగ్రెస్ 11–13 స్థానా ల్లో గెలుపొందే అవకాశం ఉంది. ఆప్ 2–4 సీట్ల కు, మహారాష్ట్ర గోమంతక్ పార్టీ ఆధ్వర్యంలోని కూటమి 3–5 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. యూపీలో కాంగ్రెస్– ఎస్పీ జట్టుకట్టాక (వారం క్రితం) ఈ పోల్ నిర్వహించారు. యూపీలో అంచనా ఇలా.. బీజేపీ కూటమి 192–196 ఎస్పీ–కాంగ్రెస్ 178–182 బీఎస్పీ 20–24 ఇతరులు 5–9 మొత్తం స్థానాలు 403 -
ఉరివేసుకొని వివాహిత బలవన్మరణం
గూడూరు(బీబీనగర్): కుటుంబంలో తలెత్తిన కలహాలతో మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీస్‌లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అన్నంపట్ల గ్రామానికి చెందిన సాదినేని శ్రీనివాస్ కూతురు కావ్య(22), గూడూరు గ్రామానికి చెందిన కొలను చంద్రారెడ్డి కుమారుడు కొలను మహిపాల్‌రెడ్డి 3 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహాం చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించకపోవడంతో దంపతులిద్దరూ గూడూరులోనే చంద్రారెడ్డి ఇంటి సమీంలోనే మరో ఇంట్లో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పాప పుట్టిన అనంతరం ఇరు కుటుంబాల మధ్యన మాటలు కలవగా రాకపోకలు సాగుతున్నాయి. కాగా గత కొద్ది రోజలుగా కావ్య తన భర్త, తల్లిదండ్రులు చెప్పినా వినకుండా పుట్టింటికి పండుగలకు వెళ్లకపోవడం, తరుచూ ఇంట్లో వాగ్వాదం చేస్తూ మొండిగా ప్రవర్తిస్తూ వస్తుంది. దీంతో భర్త మహిపాల్‌రెడ్డి, తల్లిదండ్రులు మందలించడంతో కావ్య మనస్థాపానికి గురైంది. మంగళవారం ఉదయం మహిపాల్‌రెడ్డి తన కూతరును తీసుకొని కిరాణం తీసురావడానికి రోడ్డు పైకి వెళ్లాడు. ఇంతలో కావ్య ఇంట్లోని చున్నితో దూలానికి ఉరి వేసుకొని మతి చెందింది. జరిగిన సంఘటనను స్థానికులు గమనించి పోలీస్‌లకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రణీత్‌కుమార్ స్థానికులు, కుటంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
అనంతపురం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామంలో వనజ (22) అనే యువతి ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మరణించింది. వనజ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వనజ మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వనజ మృతదేహన్ని స్వాధీనం చేసుకుని.... పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా వనజ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. -
హంగ్.. కింగ్
పాగా వేసేందుకు దృష్టి సారించిన టీఆర్ ఎస్ - ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలపై కన్ను - అధికార పార్టీ అని ఇండిపెండెంట్ల మొగ్గు - 10 మండలాలపై కన్నేసిన గులాబీ నేతలు సాక్షిప్రతినిధి, నల్లగొండ, ప్రాదేశిక ఎన్నికలు ముగిశాక, వెలువడిన ఫలితాలతో టీఆర్ఎస్ శ్రేణులు ఒకింత నిరాశకే గురయ్యాయి. అటు జెడ్పీ, ఇటు ఎంపీపీల విషయంలో కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యం కనబరిచింది. 59 జెడ్పీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఏకంగా 43చోట్ల గెలిచింది. టీఆర్ఎస్ 13 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అవసరమైన సీట్లు 30 కాగా, కాంగ్రెస్‌కు అదనంగా మరో 13 సీట్లు చేతిలో ఉన్నాయి. దీంతో జెడ్పీ పీఠాన్ని తారుమారు చేసే అవకాశం ఎవరికీ కనిపించడం లేదు. కానీ, మండలాల్లో అధ్యక్ష పదవులను కైవసం చేసుకోవడానికి ఇప్పుడు టీఆర్ఎస్కు అవకాశం కలిసొచ్చింది. వాస్తవానికి 59 మండలాలకు గాను కాంగ్రెస్ 25 చోట పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి ఆయా మండలాల్లో అవసరమైన మెజారిటీ సాధిచింది. కాగా, టీఆర్ఎస్ కేవలం 3 మండలాల్లోనే పాలకవర్గాలను ఏర్పాటు చేసేంత మెజారిటీ పొందింది. కానీ, 28 మండలాల్లో ఏ పార్టీకి అవసరమైన మెజారిటీ రాక హంగ్ ఏర్పడింది. ఇపుడదేఁహంగ్ మండలాలను తన ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన తుంగతుర్తి, ఆలేరు, మునుగోడు మండలాల్లోని అత్యధిక మండలాలను ఎలాగైనా కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇండిపెండెంట్ల సాయంతో మండల పాలక వర్గాలను ఏర్పాటు చేసేందుకు పక్కా వ్యూహంతో ఉంది. అధికార పార్టీ కావడం, స్థానికంగా ఎమ్మెల్యే కూడా ఉండడం వంటి కారణాలతో ఇండిపెండెంట్లుగా గెలిచిన ఎంపీటీసీ సభ్యులు టీఆర్ఎస్కే జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని చోట్ల ఒకరూ, ఇద్దరు చొప్పున ఉన్న ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు సైతం టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. పెద్దగా కష్టపడకుండానే హంగ్ ఏర్పడిన మండలాల్లో మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే పరిస్థితే కనిపిస్తోంది. ఇదీ.. లెక్క మునుగోడు నియోజకవర్గం పరిధిలోని సంస్థాన్ నారాయణపురం మండలంలో పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు 7. కాగా, టీఆర్ఎస్కు ఇక్కడ 4 సీట్లు చేతిలో ఉన్నాయి. మరో ఆరుగురు ఇండిపెండెంట్లు ఉండడంతో వీరిలో ముగ్గురిని తమవైపు లాగేసుకుంటే ఈ మండలం టీఆర్ఎస్ సొంతం అవుతుంది. నాంపల్లి మండలం అధ్యక్ష పదవిని దక్కించుకోవాలంటే 7 సీట్లు కావాలి. కాగా, టీఆర్ఎస్కు 4 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ చేతిలో 5 సీట్లున్నా, ఇండిపెండెంట్లు 3 స్థానాల్లో గెలిచారు. వీరిని టీఆర్ఎస్ తమలో కలిపేసుకునే అవకాశం ఉంది. వీరు మొగ్గితే ఈ మండలమూ టీఆర్ఎస్ ఖాతాలో చేరిపోతుంది. ఆలేరు నియోజకవర్గం పరిధిలోని యాదగిరిగుట్ట మండలంలో పాలకవర్గం ఏర్పాటు చేయడానికి 9 సీట్లు కావాలి. కాగా, ఇక్కడ టీఆర్ఎస్ చేతిలో 8 సీట్లు ఉన్నాయి. మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. దీంతో ఒక్కరి మద్దతు పొందితే చాలు, ఈ మండలమూ టీఆర్ఎస్ చేతిలోకి వెళ్లిపోతుంది. రాజాపేట మండలంలోనూ ఇదే రకమైన పరిస్థితి. పాలకవర్గం ఏర్పాటు చేయడానికి 6 సీట్లు అవసరం కాగా, టీఆర్ఎస్కు 5 సీట్లున్నాయి. మరో ఇండిపెండెంటు కూడా ఉన్నారు. ఈయన మద్దతుతో మండల అధ్యక్ష పదవి టీఆర్ఎస్దే. ఇక్కడ కాంగ్రెస్‌కు 4 సీట్లే వచ్చాయి. తుర్కపల్లి మండలంలో టీఆర్ఎస్ 5 సీట్లు గెలుచుకున్నా, పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడానికి ఒక సీటు తక్కువగా ఉండడంతో ఇతరుల వైపు చూస్తోంది. ఒక సీటు చేతిలో ఉన్న టీడీపీ మద్దతు కూడగ ట్టడం కానీ, లేదంటే 4 సీట్లున్న కాంగ్రెస్ నుంచి ఒకరిని లాగేసుకోవడం కానీ ఇప్పుడు టీఆర్ఎస్ చేయాల్సి ఉంది. ఎమ్మెల్యే ఉండడం కలిసొచ్చే అంశం గుండాలలో ఆరు సీట్లున్న వారే పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాగా, టీఆర్ఎస్ చేతిలో 4 సీట్లున్నాయి. కాంగ్రెస్, సీపీఐలకు చెరో రెండు సీట్లున్నా, మరో ఇద్దరు ఇండిపెండెంట్లు ఉండడంతో వారికి టీఆర్ఎస్ గాలం వేస్తోంది. ఇదే జరిగితే, ఈ మండలమూ టీఆర్ఎస్ ఖాతాలో చేరినట్లే. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని అర్వపల్లిలో 7 సీట్లుంటే పాలకవర్గాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ, టీఆర్ఎస్ చేతిలో 5 సీట్లే ఉండడంతో, 3 సీట్లున్న ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకొనే పనిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కు కేవలం 2 సీట్లే ఉండడంతో ఆ పార్టీ కనీస ప్రయత్నం చేసే పరిస్థితి కూడా లేదు. ఈ మండలాలే కాకుండా మర్రిగూడ, తిరుమలగిరి, శాలీగౌరారం మండలాల్లోనూ ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుని ఉండడం, ఈ మండల్లాల్లోనూ హంగ్ ఏర్పడినందున మెజారిటీ తక్కువగా ఉన్నా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నందున పాలక వర్గాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని కూడగట్టే పనిలో ఉన్నారు. -
కారు.. ఫుల్జోరు
సాక్షి, సంగారెడ్డి: సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఊపుతో జోరు మీద ఉన్న టీఆర్ఎస్ ఎన్నికలు ముగిశాకా కూడా సీట్ల వేటను కొనసాగిస్తోంది. ప్రత్యర్థి పార్టీల సభ్యులు, స్వంతంత్రులను బుట్టలో వేసుకుని హంగ్‌గా మారిన స్థానిక సంస్థలను కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. అధికారంలోకి రానున్న టీఆర్ఎస్తో జత కట్టి అధికారపక్షంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఇతర పార్టీల సభ్యులూ ఉత్సాహాన్ని చూపుతున్నారు. ముగ్గురు కాంగ్రెస్ జెడ్పీటీసీలకు గాలం వేసిన టీఆర్ఎస్ నేతలు జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాను ఎగుర వేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఏ పార్టీ పూర్తి మెజారిటీ సాధించక ఊగిసలాడుతున్న మండలాలు, మున్సిపాలిటీలపై సైతం ఆకర్ష్ మంత్రం ద్వారా గులాబీ జెండాను ఎగుర వేసేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియని ప్రత్యర్థి పార్టీలు సతమతమవుతున్నాయి. జెడ్పీ పీఠం టీఆర్ఎస్ వశం జిల్లాలో 46 జెడ్పీటీసీ స్థానాలకు గత నెలలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 21, కాంగ్రెస్ 21, టీడీపీ 4 జెడ్పీటీసీలను గెలుచుకున్నాయి. ఏ పార్టీ 24 సభ్యుల పూర్తి మెజారిటీ సాధించకపోవడంతో జిల్లా పరిషత్ హంగ్‌గా ఏర్పడడం అనివార్యమైంది. అయితే, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరడంతో జెడ్పీలో బలబలాలు మారిపోయాయి. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు జెడ్పీటీసీలు టీఆర్ఎస్లోకి చేరడంతో టీఆర్ఎస్ మేజిక్ ఫిగర్‌ను సాధించింది. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన మరికొంత మంది జెడ్పీటీసీలు సైతం టీఆర్ఎస్ అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కొండాపూర్ జెడ్పీటీసీ పి.నాగరాణి జెడ్పీ చైర్పర్సన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణకు సమీప బంధువు కావడంతో ఆమెకే జెడ్పీ పీఠం కట్టబెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. ఎంపీపీలు టీఆర్‘ఎస్’ జిల్లాలోని 685 ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ 296 స్థానాలు, టీఆర్ఎస్ 215 స్థానాలను గెలుచుకున్నాయి. జిల్లాలోని 46 మండలాల్లో 20 మండలాల అధ్యక్ష స్థానాలను కాంగ్రెస్, 13 మండలాల అధ్యక్ష స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోడానికి సరిపడ ఎంపీటీసీ స్థానాలను ఆయా పార్టీలు గెలుచుకున్నాయి. మిగిలిన 11 మండలాల్లో ఏ పార్టీ పూర్తి మెజారిటీ సాధించలేదు. దీంతో ఈ 11 మండలాల్లో గెలుపొందిన కాంగ్రెస్, టీడీపీ, స్వతంత్ర ఎంపీటీసీలకు టీఆర్ఎస్ ముఖ్యనేతలు గాలం వేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని గజ్వేల్, ములుగు మండలాల ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోడానికి ఏ పార్టీ పూర్తి మెజారిటీ సాధించలేదు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో ఆ రెండు మండలాలూ టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక స్వతంత్రులు అయితే మూకుమ్మడిగా టీఆర్ఎస్కే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని మిరుదొడ్డి, అందోల్ నియోజకవర్గం పరిధిలోని టేక్మాల్ ఎంపీపీ స్థానాలను స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో టీఆర్ఎస్ సునాయాసంగా కైవసం చేసుకోబోతోంది. మున్సిపాలిటీలూ గులాబీమయమే! సంగారెడ్డి మున్సిపాలిటీలోని 31 వార్డుల్లో 11 వార్డులను కాంగ్రెస్, 8 వార్డులును ఎంఐఎం గెలుచుకుంది. ఇక్కడ ఏ పార్టీ మేజిక్ ఫిగర్‌ను సాధించకపోవడంతో చైర్మన్ సీటును కైవసం చేసుకోడానికి ఇరు పార్టీలు హోరాహోరీగా ప్రయత్నిస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి ఇద్దరు సభ్యుల మద్దతు టీఆర్ఎస్కే లభించనుండడంతో ఆ పార్టీ బలం 10కు పెరిగింది. ఇక ఇక్కడి నుంచి గెలిచిన 5 మంది స్వంతంత్ర సభ్యుల్లో ఇద్దరితో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు సైతం ఎంఐఎం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీంతో 16 మంది సభ్యుల మద్దతుతో ఎంఐఎం చెర్మైన్ సీటును కైవసం చేసుకోబోతోందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సంగారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్‌కు దక్కకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్న టీఆర్ఎస్ ఈ దిశగా ఎంఐఎంకు పూర్తి సహకారాన్ని అందిస్తుండడం గమనార్హం. సదాశివపేట మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో కాంగ్రెస్ 13 వార్డులు గెలిచి పూర్తి మెజారిటీ సాధించినా, చైర్పర్సన్ ఎంపిక విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఆ పార్టీ నుంచి గెలిచిన పట్నం విజయలక్ష్మికి చైర్పర్సన్ పదవిని కట్టబెట్టేందుకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మొగ్గు చూపగా..లింగాయత్ సామాజికవర్గానికి చెందిన శీల, పిల్లోడి జయమ్మ, ఆకుల మంజు తదితరులు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఈ తిరుగుబాటును తెర వెనక నుంచి ప్రోత్సహించడం ద్వారా టీఆర్ఎస్ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ 5 వార్డులను గెలుచుకోగా మరో 6 మంది సభ్యుల మద్దతును కూడగట్టుకుంటే ఆ పార్టీ చైర్పర్సన్ పదవిని కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీలో 20 వార్డుల్లో 10 వార్డులు టీడీపీ, 9 టీఆర్ఎస్, ఓ వార్డును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నర్సారెడ్డి చేరికతో టీఆర్ఎస్ బలం 10కి పెరిగింది. టీడీపీ నుంచి ఒకరిద్దరు టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మెదక్ మున్సిపాలిటీలోని 27 వార్డుల్లో టీఆర్ఎస్ 11 వార్డులను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా మేజిక్ ఫిగర్‌కు చేరుకోలేకపోయింది. అయితే, ఇక్కడి నుంచి గెలిచిన ముగ్గురు స్వంతంత్రులు, ఒక ఎంఐఎం సభ్యుడి మద్దతుతో టీఆర్ఎస్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోనుంది. కాంగ్రెస్ 6, టీడీపీ 5 వార్డులను గెలుచుకోగా.. ఈ రెండు పార్టీలకు చెందిన నలుగురు సభ్యులు కూడా టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. -
కాంగ్రెస్, టీడీపీ దోస్తీ
ఎంపీటీసీ ఎన్నికల్లో పలుచోట్ల హంగ్ - ఎంపీపీ స్థానాల కోసం ఎత్తుకు పైఎత్తులు - చిరకాల ప్రత్యర్థులతోనూ చెలిమి - డోన్, బండిఆత్మకూరులో బొమ్మాబొరుసుతో నిర్ణయం - ఓర్వకల్లులో అధ్యక్ష ఎంపిక వాయిదా - మరో ఏడు స్థానాల కోసం పోటాపోటీ సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శత్రువులు ఉండరని మరోసారి నిరూపితమైంది. మండల పరిషత్ ఎన్నికల ఫలితాలతో రాజకీయం రసవత్తరంగా మారింది. పలు మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో కొత్త సమీకరణాలకు తెరలేస్తోంది. ఎంపీపీ స్థానాలను దక్కించుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటవుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారిపోతున్నారు. దోస్త్ మేరా దోస్త్ అంటూ ఆలింగనం చేసుకుని పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. జిల్లాలో ఇటీవల వెలువడిన ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంది. అయితే తొమ్మిది స్థానాల్లో ఏ పార్టీకి మెజారిటీ దక్కకపోవడంతో హంగ్ నెలకొంది. వీటిని ఎలాగైనా తమ ఖాతాలో జమ చేసుకోవాలనే తలంపుతో ఆ రెండు పార్టీలు రకరకాల ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి. కొందరు స్వతంత్రులతో మంతనాలు నెరుపుతుండగా.. మరికొందరు శుత్రువులతో సైతం చేతులు కలుపుతున్నారు. గతంలో ఫలితాలు వెలువడిన నాలుగైదు రోజుల్లోనే ఎంపీపీ ఎంపిక పూర్తయ్యేది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎంపీపీల ఎంపికకు సమయం ఉండటంతో.. రాజకీయ పార్టీలు శిబిరాల ఏర్పాటు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే కొందరిని రహస్య ప్రాంతాలకు తరలించారు. ఎంపీటీసీ అభ్యర్థులకు ఏమి కావాలో అడిగి తెలుసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో 53 ఎంపీపీ స్థానాలు ఉండగా.. 23 స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ 21 స్థానాలను దక్కించుకుంది. మిగిలిన 9 స్థానాల్లో అధిక్యత కోసం పోటాపోటీ నెలకొంది. వెల్దుర్తిలోని 17 ఎంపీటీసీ స్థానాల్లో 6 వైఎస్సార్సీపీ, 5 టీడీపీ, మరో 6 కాంగ్రెస్ దక్కించుకున్నాయి. ఎంపీపీ పదవి కోసం వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పోటీ పడుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ మద్దతు కోరుతున్నట్లు సమాచారం. కల్లూరులో 3 వైఎస్ఆర్సీపీ, 8 టీడీపీ, 6 స్వతంత్రులు, సీపీఎం ఒకటి గెలుచుకున్నాయి. ఎంపీపీ కోసం టీడీపీ పట్టుబడుతోంది. మద్దతు కోసం సంప్రదింపులు జరుపుతోంది. కోడుమూరులో వైఎస్సార్సీపీ 8, కాంగ్రెస్ 7, టీడీపీ 2, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ ఏ పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ఎంపీపీ పదవిని ఇతరులకు కట్టబెట్టేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. - డోన్లోవైఎస్సార్సీపీ 9, టీడీపీ 9 స్థానాలను దక్కించుకోగా.. రెండు పార్టీల నేతల్లో సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం ఎంపీపీ పదవి ‘అదృష్టం’పై ఆధారపడి ఉంది. - పాణ్యం మండల పరిషత్‌లో టీడీపీ బొక్క బోర్లా పడింది. ఎంపీపీ స్థానం ఎస్టీకి రిజర్వు అయ్యింది. అయితే టీడీపీ తరఫున ఎస్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎస్టీ అభ్యర్థి విజయం సాధించారు. దీంతో టీడీపీకి 8 ఎంపీటీసీ స్థానాలు వచ్చినా ప్రయోజనం లేకపోతోంది. ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకోనుంది. - బండిఆత్మకూరులో వైఎస్సార్సీపీ, టీడీపీకి చెరి ఏడు స్థానాలు దక్కాయి. ఇక్కడ ఎంపీపీ పదవి ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి. - గూడూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, కాంగ్రెస్ 3, టీడీపీ 3 స్థానాల్లో గెలుపొందాయి. ఇక్కడ టీడీపీకి కాంగ్రెస్ మద్దతిచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. - ఓర్వకల్లులో వైఎస్సార్సీపీ 8, టీడీపీ 3, స్వతంత్రులు 6 స్థానాల్లో గెలుపొందారు. కన్నమడకల స్థానం నుంచి బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి తిక్కలి వెంకటస్వామి ఆత్మహత్య చేసుకోవడంతో అధ్యక్ష ఎంపిక వాయిదా పడనుంది. - సి.బెళగల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 6, టీడీపీకి 7, కాంగ్రెస్‌కు 3 ఎంపీటీసీ స్థానాలు లభించాయి. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ అభ్యర్థులు టీడీపీకి మద్దతిచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకే ఎంపీపీ పదవి దక్కనున్నట్లు సమాచారం. -
క్యాంపు రాజకీయాలు..
గంగాధర మండలంలో హంగ్ ఏర్పడింది. మొత్తం 14 స్థానాలకు కాంగ్రెస్ 5 గెలిచింది. బీజేపీ నాలుగు గెలిచింది. టీఆర్ఎస్ మూడు స్థానాలు గెలిచింది. ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. బీజేపీకి ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఉంది. ప్రస్తుతం రెండు పార్టీలు క్యాంపు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి బూర్గుపల్లి ఎంపీటీసీ బాలాగౌడ్, కురిక్యాల ఎంపీటీసీ నందయ్య ఎంపీపీకోసం ఒకే క్యాంపులో ఉన్నారు. బీజేపీ నుంచి గంగాధర ఎంపీటీసీ పెరుక మల్లారెడ్డి ఇద్దరు స్వతంత్రులతో కలిసి క్యాంపు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ మద్దతు కీలకంగా మారింది. ఎల్కతుర్తి మండలంలో టీఆర్ఎస్కు 5, కాంగ్రెస్‌కు 5, స్వతంత్ర, టీడీపీ అభ్యర్థులు చెరో స్థానంలో గెలిచారు. స్వతంత్ర, టీడీపీ అభ్యర్థులు టీఆర్ఎస్కు మద్దతివ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మరోపక్క ఎమ్మెల్యే ఎన్నిక తర్వాత ఏ పార్టీ గెలిస్తే వారికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. చందుర్తి మండలంలో హంగ్ ఏర్పడింది. మొత్తం 12 స్థానాలకు కాంగ్రెస్ 5, ఇండిపెండెంట్లు ముగ్గురు, బీజేపీ, టీఆర్ఎస్లు రెండు సీట్ల చొప్పున గెలిచాయి. స్వతంత్రులు ముగ్గురు బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు టీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఒకరిని బీజేపీ మద్దతు కోరుతోంది. మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇల్లంతకుంట మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు ఏడు టీఆర్ఎస్, ఆరు కాంగ్రెస్, రెండు ఇతరులు గెలుచుకోగా అక్కడ హంగ్ ఏర్పడింది. ఇక్కడ టీఆర్ఎస్కు ఒక సీటు అవసరముండగా ఇతరుల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. అనంతగిరి ఇండిపెండెంట్ అభ్యర్థిని టీఆర్ఎస్ మద్దతు అడుగుతుండగా, రహీంఖాన్‌పేట, అనంతగిరి స్వతంత్రులిద్దరి మద్దతును కాంగ్రెస్ కోరుతున్నాయి. ఎంపీపీకి అవసరమైన మెజార్టీ కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ పావులు కదుపుతూ క్యాంపు రాజకీయాలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చిగురుమామిడి మండలంలో 12 స్థానాలున్నాయి. సీపీఐకి4, కాంగ్రెస్‌కు 4, బీజేపీకి 1, టీఆర్ఎస్కు 2, స్వతంత్రుడొకరు గెలుపొందారు. కాంగ్రెస్, సీపీఐ కలిసి ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు యత్నాలు చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ను కలుపుకునేందుకు సీపీఐ యత్నిస్తున్నది. మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డితో సీపీఐ ఎంపీటీసీ అభ్యర్థులు చర్చలు జరిపారు. ముస్తాబాద్ మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలుండగా.. టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 4, బీజేపీ 3, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్కరు గెలుపొందారు. ఇందులో టీఆర్ఎస్, ముగ్గురు బీజేపీ అభ్యర్థుల మద్దతు తీసుకుని ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ అభ్యర్థులతో తిరుపతిలో క్యాంపుకెళ్లింది. కోహెడలో 13 స్థానాలున్నాయి. టీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 5, టీడీపీ 1, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిని తీసుకుని టీఆర్ఎస్ సింగపూర్‌కు క్యాంపు కెళ్లింది. ఎమ్మెల్యేగా అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి గెలిస్తే.. టీడీపీ అభ్యర్థితోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్‌కు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. మల్హర్‌లో హంగ్ ఏర్పడింది. మొత్తం ఏడు స్థానాలకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చెరో మూడుస్థానాలు కైవసం చేసుకున్నాయి. టీడీపీ ఒక చోట గెలిచింది. ఎమ్మెల్యేగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారోనని వేచి చూసి ఆ పార్టీకి మద్దతిచ్చేందుకు టీడీపీ అభ్యర్థి ఉన్నాడు. ఇబ్రహీంపట్నం మండలంలో ఎంపీటీసీ స్థానాలు మొత్తం 15 ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్‌కు 6, టీఆర్ఎస్కు 5, బీజేపీకి 1, ఇండిపెండెంట్లు 3 వచ్చాయి. దీంతో ఎంపీపీ పీఠం విషయంలో హంగ్ పరిస్థితి నెలకొంది. ఇండిపెండెంట్లు, బీజేపీ ఎంపీటీసీల మద్దతు కోసం కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు మంతనాలు చేస్తున్నారు. కథలాపూర్‌లో 13 స్థానాలుండగా.. టీఆర్ఎస్, బీజేపీలు చెరో 5 స్థానాలను సమానంగా దక్కించుకున్నాయి. ఇరుపార్టీలూ ఓ ఒప్పందానికి వచ్చాయి. ఎంపీపీ స్థానం కాంగ్రెస్ పార్టీ, ఉపాధ్యక్ష పదవి బీజేపీకి ఖరారైంది. సైదాపూర్ మండలంలో కాంగ్రెస్4, టీఆర్ఎస్ 4, బీజేపీ 3, స్వతంత్రుడు 1 స్థానంలో గెలుపొందగా.. ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ పీఠం బీజేపీకి లేదా కాంగ్రెస్ దక్కించుకునే అవకాశముంది. ఇక్కడ ఎంపీపీ పీఠం ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. ఇక్కడ బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యులు ఎవరికి మద్దతునిస్తే వారే ఎంపీపీ పీఠం అధిరోహిస్తారు. రామగుండం మండలంలో.. 14 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. టీఆర్ఎస్కు 4, కాంగ్రెస్-3, వైఎస్సార్సీపీ, బీజేపీకి చెరో ఒకటి, స్వతంత్రులు ఐదు చోట్ల గెలిచారు. ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థులతో క్యాంపు నిర్వహిస్తోంది. వారికి వైఎస్సార్సీపీ, బీజేపీ అభ్యర్థులు, ఇండిపెండెంట్ ఇద్దరు మద్దతు తెలిపి క్యాంపులో చేరారు. కోరుట్ల మండలంలో 12 స్థానాలకు టీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 5, ఇండిపెండెంట్ ఒకరు గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థులు క్యాంపులో ఉన్నారు. ఎమ్మెల్యే ఎన్నిక తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు తేలనుంది. మెట్పల్లి మండలంలో ఎంపీటీసీ స్థానాలు 10 ఉండగా, కాంగ్రెస్‌కు 5, టీఆర్ఎస్ 3, బీజేపీ1, ఇండిపెండెంట్ 1 గెలుపొందారు. మేజిక్ ఫిగర్ 6 కాగా కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఈ మేజిక్ ఫిగర్ కోసం యత్నిస్తున్నాయి. క్యాంపులు లేవు. -
స్వతంత్రులకు ‘హంగ్’ పండగ
* చాలా మండలాల్లో తేలని ఫలితం * స్వతంత్ర సభ్యుల మద్దతు కోసం ఎంపీపీ ఆశావహుల యత్నాలు సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలోని ఎంపీటీసీ ఎన్నికల్లో చాలా మండలాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రానందున ‘హంగ్’ పరిస్థితి ఏర్పడింది. పలు చోట్ల మండలాధ్యక్ష పీఠం ఏ పార్టీకి దక్కుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి మండలాల్లో స్వతంత్ర సభ్యులు, ఒకటీ అరా స్థానాలు సాధించిన పార్టీల పాత్ర కీలకంగా మారింది. దీంతో ఇలాంటి చోట్ల ఎంపీపీ పదవి ఆశిస్తున్న నాయకులు స్వతంత్ర ఎంపీటీసీల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల్లోకి చేజారిపోకుండా కాపాడుకునేందుకు అప్పుడే ఇండిపెండెంటు ఎంపీటీసీలను తమ శిబిరాల్లో చేర్చుకుని కుటుంబ సభ్యులతో కలిపి విహార యాత్రలకు తీసుకెళుతున్నారు. దీంతో పోటాపోటీగా క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో మొత్తం 56 మండలాలు ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు 27 చోట్ల, టీడీపీకి 19 చోట్ల స్పష్టమైన మెజారిటీ ఉంది. మిగిలిన 10 స్థానాల్లో నాలుగు చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలకు సమాన స్థాయిలో ఎంపీటీసీ స్థానాలు లభించాయి. దీంతో ఈ నాలుగు చోట్ల మండల పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికో లాటరీలోనే తేలనుంది. ఈ జిల్లాల్లోని కనిగిరి, చీరాల, ఉలవపాడు, కంభం, వేటపాలం మండలాల్లో హంగ్ నెలకొంది. వేటపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 4, టీడీపీకి 5 స్థానాలు దక్కగా 12 చోట్ల ఇండిపెండెంట్లు ఎంపీటీసీ సభ్యులుగా విజయం సాధించారు. దీంతో ఇక్కడ వీరిదే కీలక పాత్ర కానుంది. వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరులో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 11, కాంగ్రెస్‌కు 9, టీడీపీకి నాలుగు ఎంపీటీసీ స్థానాలు లభించాయి. దీంతో ఇక్కడ టీడీపీ మద్దతు ఉన్న వారికే మండలాధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉంది. ‘లక్కీ’ చైర్మన్లు.. పలు మండలాల్లో ఇరు పక్షాలకు సమానమైన స్థాయిలో ఎంపీటీసీ స్థానాలు లభించాయి. దీంతో ఈ స్థానాల్లో మండలాధ్యక్ష పదవి ఎన్నికకు లక్కీ డిప్ (లాటరీ) శరణ్యంగా మారింది. ఇలా లాటరీ ద్వారా మండల పరిషత్ చైర్మన్లుగా ఎంపికయ్యేవారిని ‘లక్కీ’ చైర్మన్లు అనే పరిస్థితి ఏర్పడింది. చాలా మండలాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకు వైఎస్సార్ జిల్లా కమలాపురంలో మొత్తం 12 ఎంపీటీసీలు ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు చెరి ఆరు స్థానాల్లో విజయం సాధించాయి. ఇదే జిల్లాలోని వల్లూరు మండలంలో పది ఎంపీటీసీలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ టీడీపీలు చెరో ఐదు స్థానాలను కైవసం చేసుకున్నాయి. కర్నూలు జిల్లా డోన్ మండలం కూడా టై అయింది. ఇక్కడ మొత్తం 18 ఎంపీటీసీలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు చెరి తొమ్మిది స్థానాలను కైవసం చేసుకున్నాయి. దీంతో ఈ స్థానాల్లో ఎంపీపీ ఏ పార్టీకి అనే విషయాన్ని అధికారులు లాటరీ ద్వారా నిర్ణయించనున్నారు. -
సైకిల్ టైరు పంక్చర్!
* టీడీపీకి ఖమ్మం ఒక్కటే ఊరట.. *మిగతాచోట్ల అంతంతే * మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్‌లో కీలకంగా సైకిల్ * ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి నిరాశే * నిజామాబాద్ జెడ్పీలో ప్రాతినిధ్యమే కరువు సాక్షి, హైదరాబాద్: పురపాలక ఎన్నికల్లో తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీకి ప్రాదేశిక ఎన్నికలు సైతం నిరాశనే మిగిల్చాయి. ఒక జిల్లాలో ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిందంటే టీడీపీ ఎంతగా చతికిలపడిందో అర్థమవుతోంది. ఒక్క ఖమ్మం జెడ్పీ స్థానాన్ని మాత్రం బొటాబొటీ మెజారిటీతో దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. అంతే తప్ప మిగతా అన్నిచోట్లా సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. చివరకు ఎంపీటీసీ స్థానాల విషయంలోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలకు ఏ దశలోనూ, ఏ ప్రాంతంలోనూ సరైన పోటీని ఇవ్వలేకపోయింది. ఖమ్మంలో మాత్రం మంగళవారం అర్ధరాత్రి కడపటి సమాచారం అందేసరికి 20 జెడ్పీటీసీ స్థానాలతో జిల్లాలో ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. మరో మూడు స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. అవసరమైతే ఇతర పార్టీల మద్దతుతో ఇక్కడ జెడ్పీని టీడీపీ కైవసం చేసుకోవచ్చు. కాగా, మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్ జెడ్పీల్లో టీడీపీ గెలుచుకున్న సీట్లు జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలో కీలకమయ్యేలా ఉన్నాయి. ఇది టీడీపీకి మరికొంత ఊరట. అంతే తప్ప నేరుగా జెడ్పీ అధ్యక్ష స్థానాన్ని సాధించే స్థాయిలో ప్రభావాన్ని ఇతర ఏ జిల్లాలోనూ టీడీపీ చూపలేదు. ఉత్తర తెలంగాణలో మరోసారి బొక్కబోర్లా పడింది. దక్షిణ తెలంగాణలో ఓ మోస్తరుగా ఎంపీటీసీ సీట్లు సాధించినా అవి మండల పరిషత్తుల్లో పెద్దగా ప్రభావం చూపే స్థాయిలో లేవు. ఖమ్మం, మహబూబ్‌నగర్‌తో పాటు నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ ఎంపీటీసీల్లో టీడీపీ 100 చొప్పున మార్కు దాటింది. కడపటి వార్తలందేసరికి తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో 1,000 పైగా ఎంపీటీసీ, 45 పైగా జెడ్పీటీసీ స్థానాల్లో గెలిచింది. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల్లో మాదిరిగానే టీడీపీ కుదేలైంది. జెడ్పీటీసీల్లో ఒకటి నుంచి మూడు స్థానాలకే పరిమితమైంది. ఎంపీటీసీ కాస్త పర్వాలేదనిపించింది. ఒకప్పుడు కరీంనగర్ జిల్లా పరిషత్ పీఠంపై జెండా ఎగరేసిన టీడీపీ, ఈసారి జిల్లాలో కేవలం ఒక్క జడ్పీ స్థానానికే పరిమితమైంది. 36 ఎంపీటీసీలు గెలిచింది. ఆదిలాబాద్‌లోనూ రెండు జడ్పీటీసీలే గెలిచింది. ఎంపీటీసీలు 63 సాధించింది. నిజామాబాద్ జిల్లా పరిషత్లోనైతే టీడీపీ ఖాతాయే తెరవలేదు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఘోరంగా దెబ్బతింది. 583 ఎంపీటీసీల్లో కేవలం 31 స్థానాల్లోనే గెలవగలిగింది. ఒకప్పటి కంచుకోటైన రంగారెడ్డి జిల్లాలో కేవలం 6 జడ్పీటీసీలే గెలిచింది. అయితే 129 ఎంపీటీసీలు గెలవడం టీడీపీకి కాస్త ఊరట. మహబూబ్‌నగర్ జిల్లాలో 8 జడ్పీపీటీసీల్లో గెలిచింది. -
హంగ్ వస్తే ఎలా..?
న్యాయ, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలు తెలుసుకున్న రాష్ట్రపతి న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఏ కూటమికి పూర్తి మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడితే అనుసరించాల్సిన విధివిధానాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యాయ, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలను సేకరించారు. ఈ మేరకు కిందటివారమే ప్రముఖ న్యాయ నిపుణులు ఫాలీ నారీమన్, సోలీ సొరాబ్జీ, సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. లోక్‌సభలోని మొత్తం 543 ఎంపీ స్థానాల్లో ఏ పార్టీ/కూటమి అయినా 272 సీట్లు నెగ్గితే రాష్ట్రపతి పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. మెజారిటీ సాధించిన పక్షాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు స్వాగతిస్తారు. అయితే హంగ్ ఏర్పడితే రాష్ట్రపతి పాత్ర కీలకం. శుక్రవారమే ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. మరోవైపు ఫలితాల తర్వాత రాష్ట్రపతి భవన్‌కు రాజకీయ నేతలు, పాత్రికేయుల తాకిడి పెరగనుండడంతో సిబ్బంది ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్లో శనివారం యూపీఏ-2 సర్కారుకు వీడ్కోలు ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. -
శిబిరాలకు వేళాయే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రాదేశిక ఫలితాలు వెలువడిందే తరువాయి క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. పలు మండలాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కకపోవడంతో చైర్మన్ అభ్యర్థులు శిబిరాలకు సన్నాహాలు చేస్తున్నారు. పోలింగ్ సరళిని విశ్లేషించుకొని హంగ్ తీర్పు వస్తుందని అంచనాకొచ్చిన ఆశావహులు మంగళవారం ఫలితాలు వెల్లడికాగానే విజేతలతో సంప్రదింపుల పర్వానికి తెరలేపారు. బహుముఖ పోటీ నెలకొనడంతో చాలా మండలాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దీంతో మండల పీఠం దక్కించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకునేందుకు బేరసారాలకు దిగారు. ఈ క్రమంలో ఇతరులు, స్వతంత్రులకు ప్రధాన పార్టీలు గాలం వేస్తున్నాయి. మరోవైపు ప్రత్యర్థులకు గాలానికి చిక్కకుండా సొంత పార్టీ సభ్యులను కూడా విహారయాత్రలకు పంపే పనిలో బిజీగా మారారు. మండల, జెడ్పీ చైర్మన్ ఎన్నికలు వచ్చే నెలలో ఉండడంతో అప్పటివరకు వీరిని కాపాడేందుకు క్యాంపుల్లో ఉంచడం శ్రేయస్కరమని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో అవసరమైన సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. గెలిచిన అభ్యర్థులను కౌంటింగ్ కేంద్రాల నుంచే నేరుగా తమ శిబిరాలకు తరలించి విందు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారు. వారి కోరికలను తీర్చేందుకు ఎంత ఖర్చయినా వెనుకాడడం లేదు. ఇప్పటికే పూడూరులో ఎంపీపీ హంగ్ అవడంతో అక్కడ కీలకంగా మారిన ఇండిపెండెంట్ సభ్యుడిని మచ్చిక చేసుకునే పనిలో టీఆర్ఎస్ నిమగ్నమైంది. ఏకంగా కౌంటింగ్ హాల్ నుంచే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి సదరు సభ్యుడిని కారెక్కించుకొని తీసుకెళ్లడం చూస్తే ఇక్కడ ఫలితం తారుమారయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆశావహులకే క్యాంపుల భారం క్యాంపుల నిర్వహణ బాధ్యతను చైర్మన్ పదవి ఆశిస్తున్నవారికే అప్పగించారు. చైర్మన్ ఎన్నిక ముగిసేవరకు పార్టీ సభ్యులను కాపాడుకోవడమేకాకుండా.. వారిని సంతృప్తి పరిచే బాధ్యత కూడా వీరికే కట్టబెట్టారు. అధిష్టానం కూడా ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ అభ్యర్థులే శిబిరాల నిర్వహణ వ్యయాన్ని భరించాలని ఆదేశించిన నేపథ్యంలో ఆ మేరకు నిధులను సమకూర్చుకున్నారు. మరోవైపు హంగ్ రావడంతో తమ పంట పండిందని భావిస్తున్న విజేతలైన స్వతంత్ర ఎంపీటీసీ, జెడ్పీటీసీలు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ‘అవన్నీ మేం చూసుకుంటాం. ముందైతే కారెక్కండి’ అంటూ ప్రధాన పార్టీల నేతలు స్వంతంత్రులను బుజ్జగిస్తున్న దృశ్యాలు అనేకం కౌంటింగ్ కేంద్రాల వద్ద దర్శనమిస్తున్నాయి. టీఆర్ఎస్ జోరు రాజకీయ శిబిరాల నిర్వహణలో మిగిలిన పార్టీల కంటే టీఆర్ఎస్ ఓ అడుగు ముందుంది. తెలంగాణ తదుపరి ప్రభుత్వం మాదేనంటూ స్వతంత్రుల డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధమంటూ హామీలిస్తూ అందిన వారిని ఎగరేసుకుపోతున్నారు. పార్టీలోకి వచ్చే వారందరికీ ప్రత్యేక స్థానం కల్పిస్తామని నచ్చజెప్తున్నారు. కీలకమైన పదవులు, ప్రయోజనాలు ఆశచూపుతున్నారు. జిల్లాలో తక్కువ స్థానాల్లోనే టీఆర్ఎస్ గెలుపొందినా హంగ్ ఏర్పడిన స్థానాలనైనా కైవసం చేసుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఎంపీటీసీలు గెలుపొందిన టీడీపీ, బీజేపీ అభ్యర్థులపై గులాబీ శిబిరం వల విసురుతోంది. ఏ పార్టీ అయితే బెటర్ అని ముందుగానే అంచనా వేసుకుంటున్న స్వతంత్రుల కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ జోష్ మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తమైంది. అధిష్టానం ఆదేశాల మేరకు ఆ పార్టీ నేతలు కూడా క్యాంపుల నిర్వహణలో చురుగ్గా ఉన్నారు. కొందరు అభ్యర్థుల మద్దతిస్తే తమ పార్టీ జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులను సొంతం చేసుకోవచ్చనుకున్న స్థానాల్లో స్వంతంత్రులను కాకా పట్టేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కారు పార్టీకి దీటుగా నజరానాలు ప్రకటిస్తున్నారు. మున్సిపల్, స్థానిక సంస్థల్లో తెలంగాణ వ్యాప్తంగా తమ పార్టీకే ఎక్కువ స్థానాలొచ్చాయని, దీన్ని బట్టి సార్వత్రిక ఎన్నికల్లో కూడా మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు భరోసా ఇస్తున్నారు. కొత్త ప్రభుత్వంలో భారీ ప్రయోజనాలు కల్పిస్తామంటూ విజేతలకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. -
‘ప్రాదేశికం’లో త్రిశంకు ఫలితాలే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మండల ప్రాదేశిక ఎన్నికల్లో పల్లె ఓటర్లు విలక్షణమైన తీర్పు ఇచ్చారు. ఏ పార్టీకి స్పష్టమైన పూర్తి మద్దతు ప్రకటించకపోవడంతో అనేక మండలాల్లో హంగ్ పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 33 మండల పరిషత్‌లకు 15 చోట్ల త్రిశంకు ఫలితాలే వెలువడ్డాయి. దీంతో జిల్లా రాజకీయాలు మునుపెన్నడూలేనంత రసకందాయంలో పడ్డాయి. పరిషత్‌లలో పాగా వేసేందుకు తీవ్ర స్థాయిలో క్యాంపులు, బేరసారాలు ప్రారంభమయ్యాయి. గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్యే నువ్వా-నేనా అన్నట్లు పోటీ సాగగా.. ఈ సారి అనూహ్యంగా టీఆర్ఎస్ పుంజుకోవడంతో ప్రాదేశిక సమీకరణలు మారిపోయాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా దెబ్బతినగా, కాంగ్రెస్, టీఆర్ఎస్లు గణనీయమైన ఫలితాలను నమోదు చేశాయి. తాండూరు, పరిగి, చేవెళ్ల, వికారాబాద్ సెగ్మెంట్లలో గులాబీ గుబాళించగా, జిల్లా తూర్పు మండలాల ను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. అదే సమయంలో శివారు మండలాలపై మరోసారి టీడీపీ పట్టు నిలుపుకుంది. బీజేపీ ఓట్ల చీలిక టీడీపీ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసింది. మండల ప్రాదేశిక ఎన్నికల్లో పలు పార్టీల అగ్రనేతలకు చుక్కెదురైంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పుట్టినూరు, మెట్టినూరులో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ రెండు చోట్లా టీఆర్ఎస్ విజయం సాధించింది. అలాగే మరో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ స్వగ్రామమైన కోట్మర్పల్లిలో స్వతంత్ర అభ్యర్థి చేతిలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇదిలాఉంటే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్ మండలాల్లో టీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. కౌంటింగ్ ప్రతి రౌండ్లోనూ నువ్వా-నేనా అన్నట్లు పోటీ నెలకొంది. ప్రధాన పార్టీల మధ్య ఆధిక్యం దోబూచులాడడంతో అభ్యర్థులు నరాలుతెగే ఉత్కంఠకు గురయ్యారు. పలు చోట్ల అనూహ్య ఫలితాలు నమోదు కావడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది. రాష్ట్రంలోనే వెలువడ్డ తొలి ఫలితం జిల్లా నుంచే రాగా.. అది మజ్లిస్ బోణీ కొట్టడం అబ్బురపరిచింది. మంచాల మండలంలో మరోసారి సీపీఎం తన సత్తాను చాటడం ద్వారా ఉనికిని చాటుకోగా, బీజేపీ కూడా మెరుగైన ఫలితాలను నమోదు చేసి మండలాధీశుల ఎన్నికల్లో కీలక భూమిక నిర్వహించేందుకు సిద్ధమైంది. మండల ప్రాదేశిక స్థానాల ఓట్ల లెక్కింపు మందకొడిగా సాగడంతో జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. అగ్రనేతలకు తలనొప్పి హంగ్ తీర్పు పార్టీ అగ్రనేతలకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఊహించని ఫలితాలతో కంగుతిన్న నేతలు ఎన్నికలనంతరం సర్దుబాటులో తీరికలేకుండా గడుపుతున్నారు. ఫలితాలను తమకు అనుకూలంగా మార్చే బాధ్యతను అగ్రనేతలే తమ నెత్తికెత్తుకోవడంతో జిల్లా పరిస్థితి వారికి కష్టాలు తెచ్చిపెట్టింది. దాదాపు సగం మండల ప్రాదేశికాల్లో త్రిశంకు పరిస్థితి నెలకొనడం చిక్కులు తెచ్చిపెట్టింది. కొన్ని చోట్ల ఒకరిద్దరు సభ్యులే కీలకం కావడంతో వారిని మచ్చిక చేసుకునేందుక పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగారు. మరికొన్ని చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు గెలుపొందడంతో బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. -
అధికారం మాదే!
తెలంగాణ ఉద్యోగ సంఘాలతో టీ కాంగ్రెస్ నేతల వ్యాఖ్య ఆప్షన్లు, భవనాల కేటాయింపుపై చర్చ.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హంగ్ ఫలితాలొచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో ఉన్న టీ కాంగ్రెస్ నేతలు మంగళవారమిక్కడ తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసంలో జరిగిన ఈ భేటీలో పార్టీ నేతలు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, ఉద్యోగ సంఘాల నేతలు విఠల్, మధుసూదన్‌రెడ్డి, రఘు, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. విభజన నేపథ్యంలో ఉద్యోగుల ఆప్షన్లు, ప్రభుత్వ కార్యాలయాల కేటాయింపుపై ప్రధానంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే. ఇప్పటివరకు మీరు బాగానే సహకరించారు. ఇకపైనా సహకరించండి. మీ సమస్యలేంటో చెప్పండి..’ అని కాంగ్రెస్ నేతలు అడిగారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగులను కేటాయించాలని, ఆప్షన్లు వద్దని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలన్నీ వేర్వేరు భవనాల్లోనే కొనసాగించాలని, సీమాంధ్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో తాత్కాలికంగానే కొనసాగనున్నందున దానికి అద్దె భవనాలు కేటాయించాలన్నారు. ఉద్యోగుల కేటాయింపులో ఐదు వేల మంది విషయంలోనే సమస్యలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు. రైతులను ఆదుకోండి: గవర్నర్‌కు పొన్నాల వినతి పొన్నాల లక్ష్మయ్య మంగళవారం రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. -
ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ సంబరాలు
-
ఢిల్లీలో హంగ్