కుటుంబంలో తలెత్తిన కలహాలతో మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది.
గూడూరు(బీబీనగర్): కుటుంబంలో తలెత్తిన కలహాలతో మనస్థాపానికి గురైన ఓ వివాహిత ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీస్‌లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అన్నంపట్ల గ్రామానికి చెందిన సాదినేని శ్రీనివాస్ కూతురు కావ్య(22), గూడూరు గ్రామానికి చెందిన కొలను చంద్రారెడ్డి కుమారుడు కొలను మహిపాల్‌రెడ్డి 3 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహాం చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించకపోవడంతో దంపతులిద్దరూ గూడూరులోనే చంద్రారెడ్డి ఇంటి సమీంలోనే మరో ఇంట్లో నివాసముంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పాప పుట్టిన అనంతరం ఇరు కుటుంబాల మధ్యన మాటలు కలవగా రాకపోకలు సాగుతున్నాయి. కాగా గత కొద్ది రోజలుగా కావ్య తన భర్త, తల్లిదండ్రులు చెప్పినా వినకుండా పుట్టింటికి పండుగలకు వెళ్లకపోవడం, తరుచూ ఇంట్లో వాగ్వాదం చేస్తూ మొండిగా ప్రవర్తిస్తూ వస్తుంది. దీంతో భర్త మహిపాల్‌రెడ్డి, తల్లిదండ్రులు మందలించడంతో కావ్య మనస్థాపానికి గురైంది. మంగళవారం ఉదయం మహిపాల్‌రెడ్డి తన కూతరును తీసుకొని కిరాణం తీసురావడానికి రోడ్డు పైకి వెళ్లాడు. ఇంతలో కావ్య ఇంట్లోని చున్నితో దూలానికి ఉరి వేసుకొని మతి చెందింది. జరిగిన సంఘటనను స్థానికులు గమనించి పోలీస్‌లకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ ప్రణీత్‌కుమార్ స్థానికులు, కుటంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.