నా ఆస్తిని బావ కాజేశాడు.. | victim gouramma take a hunger strike for property | Sakshi
Sakshi News home page

నా ఆస్తిని బావ కాజేశాడు..

Published Thu, Aug 6 2015 4:17 PM | Last Updated on Sat, Apr 6 2019 8:51 PM

victim gouramma take a hunger strike for property

హోలగొంద(కర్నూలు జిల్లా): బావ తన ఆస్తిని దౌర్జన్యంగా లాక్కున్నాడని తిరిగి తనకూ ఇప్పించాలని కోరుతూ ఒక మహిళ తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహర దీక్షకు దిగింది. ఈ సంఘటన గురువారం కర్నూలు జిల్లా హోలగొంద మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదట జరిగింది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన గౌరమ్మ అనే మహిళ భర్త చనిపోయాడు.

కాగా, ఆమె బావ తన ఐదు ఎకరాల పొలాన్ని, మండల కేంద్రంలోని ఇళ్ల స్థలాలను ఆక్రమించుకున్నాడని తెలిపింది. తన ఆస్తిని తనకూ ఇప్పించాలనీ కోరుతూ మండల తహశీల్దార్ కార్యాలయం ఎదట బుధవారం ధర్నాకు దిగింది. ఆమెతో పాటు కుమార్తె, మనవరాలు ఇద్దరూ దీక్షలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement