ఏపీడీ పీపీగా విద్యావతి | vidyavathi to apdpp | Sakshi
Sakshi News home page

ఏపీడీ పీపీగా విద్యావతి

Published Thu, Apr 20 2017 11:33 PM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM

vidyavathi to apdpp

అనంతపురం అగ్రికల్చర్‌ : వ్యవసాయశాఖ సస్యరక్షణా విభాగం సహాయ సంచాలకులు (ఏడీఏ–పీపీ)గా విద్యావతి గురువారం బాధ్యతలు తీసుకున్నారు. స్థానిక వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో కీలకమైన ఈ పోస్టులో ప్రస్తుతం ఇన్‌చార్జ్‌గా పద్మలత పని చేస్తుండగా ఆ స్థానంలో విద్యావతి బాధ్యతలు స్వీకరించారు. తర్వాత జేడీఏ పీవీ శ్రీరామమూర్తిని కలిశారు. విద్యావతి ప్రస్తుతం డిప్యూటేషన్‌ మీద డ్వామాలో కళ్యాణదుర్గం ఏపీడీగా పని చేస్తుండగా మాతృశాఖకు బదిలీ చేస్తూ ఏడీఏ–పీపీగా బుధవారం కమిషనరేట్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అలాగే కమిషనరేట్‌ నుంచి బదిలీపై వచ్చిన రమణరావు కూడా గురువారం ఇన్‌చార్జ్‌ ఏడీఏ పి.రామేశ్వరరెడ్డి నుంచి అనంతపురం డివిజన్‌ ఏడీఏగా బాధ్యతలు తీసుకోగా, మడకశిర, హిందూపురం ఏడీఏలుగా నియమితలైన కె.మల్లికార్జున, ఎం.రవి కూడా జేడీఏ కార్యాలయంలో జాయినింగ్‌ రిపోర్టు ఇచ్చారు. కొత్త ఏడీఏలకు వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. తమకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి రైతులకు సేవలందిస్తామని కొత్త ఏడీఏలు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement