విజయవాడలో కార్పొరేటర్ల జీతాలు పెరగనున్నాయి.
విజయవాడ: విజయవాడలో కార్పొరేటర్ల జీతాలు పెరగనున్నాయి. కార్పొరేటర్ల జీతాలు పెంచుతున్నట్టు నగర కార్పొరేషన్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజాగా పెంచుతున్న కార్పొరేటర్ల వేతనం రూ. 4 వేల నుంచి రూ. 10 వేలకు పెరగనుంది. అయితే కార్పొరేటర్ల జీతాల పెంపు విషయంలో సీపీఎం వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.