భూ సేకరణ చట్టాన్ని అతిక్రమిస్తోంది | Violates the law of the Land Acquisition | Sakshi
Sakshi News home page

భూ సేకరణ చట్టాన్ని అతిక్రమిస్తోంది

Published Wed, Sep 21 2016 12:54 AM | Last Updated on Mon, Mar 25 2019 3:03 PM

Violates the law of the Land Acquisition

  • అఖిలభారత కిసాన్‌ సంఘ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి 
  • గీసుకొండ : టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు పేరుతో తెలంగాణ ప్రభుత్వం భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా రైతుల భూములను లాక్కుంటుందని అఖిల భారత కిసాన్‌ సంఘ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపెల్లి మల్లారెడ్డి మండిపడ్డారు. 2013 భూ సేకరణ చట్టంలోని అంశాలను కాలదన్ని ప్రభుత్వమే పెద్ద బ్రోకర్‌గా మారిందని ఆరోపించారు. మండలంలోని ఊకల్‌ క్రాస్‌రోడ్డు వద్ద మంగళవారం టెక్స్‌టైల్‌ పార్కు, పరిశ్రమల కోసం భూములను ఇవ్వబోమంటూ భూ సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భూ సేకరణ చట్ట ప్రకారం రైతుల పంట భూములను తీసుకోవాల్సి వస్తే 70 శాతం మంది అంగీకరించాలన్నారు.
    ఈ విషయమై రైతులతో సమావేశాలు పెట్టకుండానే భూ సర్వేలు, సేకరణ చేయడం చట్ట వ్యతిరేకమైందన్నారు. ప్రభుత్వం భూ సేకరణ విషయంలో చట్టాన్ని అతిక్రమిస్తే కోర్టులకు వెళ్తామని చెప్పారు. భూములను తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబుల్‌ బెడ్‌రూంలు, ఇంటి స్థలాలు ఇస్తామని పరకాల ఎమ్మెల్యే రైతులను నమ్మబలికి మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
     
    ప్రభుత్వం రైతులకు న్యాయం చేయకుంటే ఉద్యమిస్తామని చెప్పారు. కాగా, సభకు సంగెం, గీసుకొండ మండలాలకు చెందిన బాధిత గ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సభ జరుగుతున్నంత సేపు పలుమార్లు ఎమ్మెల్యే ధర్మారెడ్డి వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. సభలో కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి, రైతు, భూ నిర్వాసితుల సంఘాల నాయకులు మోర్తాల చందర్‌రావు, కూసం రాజమౌళి, పెద్దారపు రమేశ్, సోమిడి శ్రీనివాస్, ఓదెల రాజయ్య, చింతమల్ల రంగయ్య, కొమురారెడ్డి, చిన్ని, సారంపెల్లి వాసుదేవరెడ్డి, నర్సింహరావు, రవీందగౌడ్‌ పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement