ఉల్లంఘనపై ఉద్యమం | Violation on movement :ysrcp | Sakshi
Sakshi News home page

ఉల్లంఘనపై ఉద్యమం

Published Thu, Jun 23 2016 3:36 AM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

ఉల్లంఘనపై ఉద్యమం - Sakshi

ఉల్లంఘనపై ఉద్యమం

జిల్లా కేంద్రంలో వైఎస్‌ఆర్‌సీపీ భారీ ర్యాలీ
పాల్గొన్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు
జేసీ-2, డీఆర్‌ఓలకు వినతిపత్రం

కడప కార్పొరేషన్:  ప్రొటోకాల్ ఉల్లంఘనపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ప్రజాప్రతినిధులమనే గౌరవం లేకుండా అధికారులు ప్రవర్తిస్తున్నారని, తమ చేతిలో ఓటమిపాలైన వారితో ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పలు సమావేశాల్లో నిలదీసినా స్పందన లేకపోవడం, తాజాగా ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని పిలిచి అవమానించడంపై ఆ పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. బుధవారం వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కోటిరె డ్డి సర్కిల్, సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లె, విద్యుత్‌భవన్ మీదుగా కొత్త కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించాయి.

ర్యాలీలో పార్టీ జిల్లా అధ్యక్షు డు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్‌బీ అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు, జెడ్పీ వైస్‌చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, జమ్మలమడుగు ఇన్‌చార్జి సుధీర్‌రెడ్డిలు ర్యాలీకి అగ్రభాగాన నడిచా రు. జేసీ-2 శేషయ్య, డీఆర్ ఓ సులోచనకు వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ రెండేళ్లుగా చూస్తున్నాం, ప్రజలచేత ఎన్నికైనా తమకు అధికారులు గౌరవం ఇవ్వకపోతే శాంతిభద్రతల సమస్యలు వస్తాయని హెచ్చరించా రు. 

ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాల్లా నిర్వహించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఈవీ మహేశ్వరరెడ్డి, నాయకులు బి. నిత్యానందరెడ్డి, ఇరగంరెడ్డి శంకర్‌రెడ్డి, ధనపాల్ జగన్, పత్తి రాజేశ్వరి, పి.ప్రసాద్‌రెడ్డి, పులి సునీల్, బోలా పద్మావతి, ఉమామహేశ్వరి, టీపీ వెంకటసుబ్బమ్మ, ఖాజా రహమతుల్లా, కార్పొరేటర్లు పాకా సురేష్, చల్లా రాజశేఖర్, సానపురెడ్డి శివకోటిరెడ్డి పాల్గొన్నారు.

 మంత్రి లేకుంటే ఎమ్మెల్యేనే ముఖ్యఅతిథి: ఎంపీ
జీవో520 ప్రకారం ప్రభుత్వ నిధులతో నిర్వహించే ఏ కార్యక్రమమైనా ఇన్‌చార్జి మంత్రిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించి నిర్వహించాలని, ఆయన రానప్పుడు స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా ఉంటారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో అనేక కార్యక్రమాల్లో అధికారులు ప్రొటోకాల్‌ను విస్మరించారన్నారు. జన్మభూమి-మాఊరుకు సీఎం వస్తే స్థానిక సర్పంచ్, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఆహ్వానం పంపలేదన్నారు. రెండురోజుల క్రితం మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని పిలిచి అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనను తాను పార్లమెంటులో ప్రస్తావిస్తే పాత తేదీలు వేసి గత కలెక్టర్ కేవీ రమణ పార్లమెంట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని గుర్తుచేశారు.

 అవినీతి అధికారులను వదలను: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
అవినీతి అధికారులను వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి స్పష్టం చేశారు. మైదుకూరులో వ్యవసాయశాఖ అధికారులు అవినీతిలో మునిగిపోయారన్నారు. ఏరువాకకు తనను పిలిచి టీడీపీ ఇన్‌చార్జితో ప్రారంభించారని, వారు వెళ్లిపోయాక తనను రమ్మన్నారని తెలిపారు.  తనను అవమానించిందిగాక తిట్టానని కేసు పెట్టడం అత్యంత దారుణమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement