protocol violation
-
ప్రొటోకాల్ ఉల్లంఘన.. స్పీకర్‌కు కూకట్పల్లి ఎమ్మెల్యే ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫిర్యాదు చేశారు. మూడు సార్లు ప్రజల మద్దతుతో భారీ మెజారీతో గెలుపొందిన తాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంటే కొందరు అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ పనులు చేయకుండా పబ్బం గడుపుతున్నారని ఫిర్యాదు చేశారు.ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి శాసనసభ్యుడి హక్కులకు భంగం కలిగించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించినట్లు కృష్ణారావు తెలిపారు. -
పాత వీడియోలతో ట్రోల్ చేశారు: గవర్నర్ తమిళి సై
సాక్షి, హైదరాబాద్: తనపై తెలంగాణ ప్రభుత్వం, మంత్రులు చేస్తున్న విమర్శలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి స్పందించారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తానని తాను ఏనాడూ అనలేదని, రాజకీయం చేస్తున్నానని అనవసరంగా తనను విమర్శిస్తున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తమిళిసై.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా భేటీ తరుణంలో సోమవారం మరోసారి ఈ విషయమై స్పందించారు. ‘తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా నన్ను విమర్శించారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ప్రజలను కలిస్తే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏ పదవిలో ఉన్నా.. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం’ అని తమిళిసై పేర్కొన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వంతో నడుస్తున్న ప్రోటోకాల్ వివాదంపైనా ఆమె స్పందించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు.. రాజకీయం చేయాల్సిన అవసరం తనకు లేదని, అలాంటి ఆలోచన కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. -
2 రోజుల కోవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘన జరిమానాలు అక్షరాలా రూ. 1.5 కోట్లు!
Omicron Scare న్యూఢిల్లీ: గడచిన 24 గంటల్లో దేశ రాజధానిలో 180 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ హెల్త్ బులెటన్ శుక్రవారం తెలియజేసింది. జూన్ 16 తర్వాత నిన్న ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ దృష్ట్యా కోవిడ్ ప్రోటోకాల్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఐతే గడచిన రెండు రోజుల వ్యవధిలో ప్రొటోకాల్ ఉల్లంఘనల వల్ల సుమారు 1.5 కోట్ల రూపాయల జరిమానాను వసూలు చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వం శనివారం తెలిపింది. ఉల్లంఘనలకు సంబంధించి 163 ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయని పేర్కొంది. మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం, గుమిగూడినందుకు గాను ఈ జరిమానాలు విధించినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. కాగా గత 24 గంటల్లో దేశంలో 7,189 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం 415 ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో, 115 మంది కోలుకున్నట్టు వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 108 ఒమిక్రాన్ కేసులు నమోదవగా, ఢిల్లీలో 79, గుజరాత్లో 43, తెలంగాణాలో 38, కేరళలో 37, తమిళనాడులో 34, కర్ణాటకలో 31 కేసులు నమోదయ్యాయి. చదవండి: మద్యం తాగే వయసు 21 ఏళ్లకు కుదింపు! ఆ రాష్ట్రాల్లో పూర్తిగా నిషేధం.. -
ప్రగతి భవన్‌ను మించిన భవనాన్ని కట్టుకున్నాడు
సాక్షి, ఆత్మకూరు(నల్లగొండ): తెలంగాణ రాష్ట్ర సాధనకు మంత్రి పదవినే త్యాగం చేశా.. ప్రొటోకాల్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేశానని.. దీనిపై కోట్లాడే మనస్తత్వం తనది కాదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన ఆత్మకూర్(ఎం)లో విలేకరులతో మాట్లాడారు. వాసాలమర్రిలో ముఖ్యమంత్రి పాల్గొన్న సభా వేదికపైకి ఆహ్వానించలేదని.. అయినా గొడవకు దిగలేదని.. గ్రామం అభివృద్ధి చెందుతుందనే మిన్నకుండిపోయినట్లు వివరించారు. మునుగోడులో ప్రొటోకాల్‌పై ప్రశ్నించినందుకే ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని అరెస్ట్ చేశారని.. తెలంగాణ ప్రభుత్వంలో ఒక పద్ధతి అంటూ లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, పార్టీలు మారడం, అక్రమ వ్యాపారాలను కాపాడుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ మారిన దాఖలాలు లేవని, అక్రమ వ్యాపారాలు చేస్తున్న చరిత్ర లేదని చెప్పారు. మూడు దశాబ్దాలుగా నల్లగొండలో అద్దె ఇంట్లోనే ఉంటున్నానని గుర్తు చేశారు. 2014లో మంత్రి జగదీశ్‌రెడ్డికి స్కూటర్ కూడా లేదని, అటువంటి వ్యక్తి నాగారంలో ప్రగతి భవన్‌ను మించిన భవనాన్ని నిర్మించుకున్నాడని ఆరోపించారు. అధికార పార్టీ ఎంపీలు సమస్యలపై స్పందించక పోవడంతో రాష్ట్రానికి ఎటువంటి నిధులు విడుదల కావడం లేదని తెలిపారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని సమస్యలు కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అవుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా బీబీనగర్‌లోని ఏయిమ్స్‌కు రూ. 796 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. ఆయన వెంట పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బీర్ల అయిలయ్య, ఎంపీపీ తండ మంగమ్మశ్రీశైలం, జెడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా, సర్పంచ్ జెన్నాయికోడె నగేష్ ఉన్నారు. -
షాపింగ్ తంటా : ప్రముఖ షోరూం మూత
సాక్షి, చెన్నై: పండుగ సీజన్ రావడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో షాపింగ్ సందడి నెలకొంది. ముఖ్యంగా కరోనా వైరస్, లాక్ డౌన్ ఆంక్షలతో గత ఏడు నెలలుగా ఇంటికి పరిమితమైన ప్రజలు షాపింగ్ కోసం భారీ సంఖ్యలో షోరూంలకు క్యూ కడుతున్నారు. ఇదే చెన్నైలోని ఒక దిగ్గజ బట్టల దుకాణానికి షాక్ ఇచ్చింది. కోవిడ్-19 నిబంధనలను భారీగా ఉల్లంఘించారని ఆరోపిస్తూ చెన్నైలోని ప్రసిద్ధ కుమరన్ సిల్క్స్ను మంగళవారం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జిసిసి) మూసివేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. (ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్) షోరూమ్ లోపల, వెలుపల ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా, ఫేస్ మాస్క్‌లు ధరించకుండా వందలాది మంది జనం గుమిగూడిన నేపథ్యంలో దానికి సీల్ వేశామని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ప్రకటించింది. ప్రజలు భద్రతా ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలని జీసీసీ ఒక ట్వీట్లో పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించడం చాలా ప్రమాదకరం, బాధాకరమని జీసీసీ కమిషనర్ జీ ప్రకాష్ వ్యాఖ్యానించారు. ఒకేసారి 500 లేదా వెయ్యి మంది కస్టమర్లను అనుమతించమని, వీరిని దుకాణాదారులే నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది ఇలా ఉంటే ఈ ఉల్లంఘనలు ప్రతి దుకాణంలో జరుగుతున్నాయి... ఈ ఒక్కదాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇది పండుగ కాలం కనుక షాపింగ్ చేయాలనుకుంటున్నారని గీతా పద్మనాభన్ ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. Kumaran Silks in Chennai sealed after video of crowding and lack of physical distancing emerges. @chennaicorp @thenewsminute pic.twitter.com/qIM9HyUxSv — priyankathirumurthy (@priyankathiru) October 20, 2020 A shop in Tnagar has been #locked and #sealed today, since they allowed overcrowding & didn’t follow the COVID-19 safety protocols. Other such shops, which don’t follow the protocols shall be sealed too. Shop owners & public are requested to strictly follow safety protocols.#GCC pic.twitter.com/MncKIWxfIG — Greater Chennai Corporation (@chennaicorp) October 20, 2020 -
సోమిరెడ్డికి కమీషన్లు దండుకోవడమే తెలుసు
పొదలకూరు: వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనం ప్రారంభంలో ప్రొటోకాల్ ఉల్లంఘనపై ప్రివిలైజ్ కమిటీ చైర్మన్‌గా చర్యలు తీసుకుంటానని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పొదలకూరు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవన సముదాయాన్ని గురువారం ఎమ్మెల్యే పరిశీలించారు. కళాశాలలోని విద్యార్థుల సంఖ్య, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ దామోదరనాయుడు ఎలా ప్రారంభించేందుకు ప్రయత్నించారో అధికారులు వివరణ ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుతున్న విషయాన్ని గుర్తుచేశారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా వీసీ తన ఇష్టానుసారంగా భవన సముదాయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించడం ముమ్మాటికి ప్రొటోకాల్ ఉల్లంఘనేనన్నారు. ప్రొటోకాల్‌పై కొత్త జీఓను అధికారులకు చదివి వినిపించి వీసీకు ప్రొటోకాల్ ఉందాని ప్రశ్నించారు. ప్రివిలైజ్ కమిటీ చైర్మన్‌గా సంబంధిత శాఖ అధికారులకు నోటీసులను జారీ చేస్తామన్నారు. భవన నిర్మాణం నాణ్యతపై విజిలెన్స్ తనిఖీలను చేయిస్తామన్నారు. భవనం అంచనా విలువల్లో 2.75 శాతం అదనంగా కాంట్రాక్టర్‌కు నిధులు మంజూరు చేశారని తెలిపారు. భవన నిర్మాణానికి రూ.1.70కోట్లు మంజూరు చేశారని, భవనాన్ని ప్రారంభించేందుకు శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి తర్వాత తొలగించారన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో అప్పటి రాపూరు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, మాజీ సమితి అధ్యక్షుడు కాకాణి రమణారెడ్డి, తాను ఎంతో వ్యయప్రయాసలకోర్చి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయించామన్నారు. వైఎస్సార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సోమిరెడ్డికి కమీషన్లు దండుకోవడమే తెలుసు పనులు మంజూరు చేయించికాంట్రాక్టర్లను పిలిపించుకుని సెటిల్మెంట్లు చేసి కమీషన్లు దండుకోవడమే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి తెలుసునని, అభివృద్ధి అంటే అసలు తెలియదని ఎమ్మెల్యే కాకాణి దుయ్యబట్టారు. అందులో భాగంగానే పాలిటెక్నిక్ కళాశాల భవనాన్ని మంజూరు చేశారన్నారు. కండలేరు ఎడమగట్టు కాలువ లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్‌కు రెండు మోటార్లు ఏర్పాటు చేస్తే అందులో ఒకటి అసెంబుల్డ్ మోటారని ఆనాడే చెప్పానని, అదే మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. 28 రోజులుగా గ్రావిటీ తగ్గిన కాలువకు 130 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నది ఒక్క మోటారుతోనేనన్నారు. మోటార్ల ఏర్పాటులో సోమిరెడ్డి కమీషన్ల భాగోతానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలన్నారు. సమగ్ర విచారణ జరిపిస్తే అధికారులు ఇబ్బందులు పడక తప్పదన్నారు. సోమిరెడ్డి ఎంత గింజుకున్నా ఆక్రమణల తొలగింపును అడ్డుకోలేడన్నారు. చెరువు సప్లయి ఛానల్‌ను అడ్డగించి ఇళ్లు నిర్మిస్తుండగా అధికారులు తొలగించేందుకు వెళ్లారన్నారు. ఆక్రమణల తొలగింపునకు రాజకీయ రంగు పులిమి వైఎస్సార్సీపీపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. కాలువ గట్టున ఉన్న ఆక్రమణలను తొలగించి తీరుతామని, దమ్ముంటే అడ్డుకోవాలన్నారు. తాను తెలిసి ఎవరికీ అన్యాయం చేయనని, ప్రజాప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తానని వెల్లడించారు. సోమిరెడ్డి తాటాకు చప్పళ్లకు »ñ బెదిరేది లేదని, సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధిని ఐదు పర్యాయాలు ఓడిన ఘనాపాటి సోమిరెడ్డి అడ్డుకోలేడన్నారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య, రావుల దశరధరామయ్యగౌడ్, బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, తెనాలి నిర్మలమ్మ, వాకాటి శ్రీనివాసులురెడ్డి, వూకోటి లక్ష్మీనారాయణ, తదితరులు ఉన్నారు. -
అధికారం ఉందనా.. అడిగేవారు లేరనా?
గూడూరు: అధికారం ఉందనో.. అడిగేవారు లేరనో తెలీదు గానీ సాక్షాత్ ఎంపీపీ స్థానంలో కూర్చున్న ఆ వ్యక్తి అధికారులందరి సాక్షిగా ప్రోటోకాల్ ఉల్లంఘించి మండల సర్వసభ్య సమావేశం జరిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీపీ పిట్టి రావమ్మకు బదులుగా, ఆమె తనయుడు నాగరాజు కూర్చుని సమావేశాన్ని నిర్వహిస్తుంటే అందుకు అధికారులే సాక్షులుగా మిగిలారు. అలాగే ఇదేమిటబ్బా అని అన్ని శాఖల అధికారులు ముక్కున వేలేసుకున్నారు. అంతేకాకుండా రుణాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను అధికారుల వద్ద నుంచి తెప్పించుకుని, తాము నిర్ణయించిన పేర్లే అందులో ఉన్నాయా..లేక మార్చారా అని ఆరా తీశారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం మెరుగుపై సమావేశంలో చర్చ జరగగా, ఎంపీపీ స్థానంలో కూర్చున్న నాగరాజు పారిశుద్ధ్ద్యం మెరుగుకు అందరూ కృషి చేయాలని, అందుకు తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పడం గమనార్హం. -
ప్రొటోకాల్ ఉల్లంఘన
వెంకటాచలం: సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘన నిత్యకృత్యమైంది. తాజాగా వెంకటాచలం మండలంలో ఈ తంతు జరిగింది. అనికేపల్లి పంచాయతీలో రెండు రజక సంఘాలకు మంజూరైన సబ్సిడీ రుణాల విషయంలో ప్రతిపక్ష పార్టీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా పంపిణీ చేయడం వివాదా స్పదమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన రజక సంఘంలోని 15 మంది ఎమ్మెల్సీ సోమిరెడ్డి చేతుల మీదుగా చెక్కులను తీసుకునేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో చెక్కుల పంపిణీ మంగళవారం పోటాపోటీగా జరిగింది. వివరాలు.. అనికేపల్లి పంచాయతీలో రెండు రజక సంఘాలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.15 లక్షల రుణాలను మంజూరు చేశారు. ఒక్కో గ్రూపులో 15 మంది సభ్యులు ఉండగా ప్రభుత్వ రాయితీ రూ.25 వేలు, గొలగమూడి సిండికేట్ బ్యాంక్ నుంచి రుణం రూ.25 వేలు మొత్తం కలిపి రూ.50 వేల చొప్పున మంజూరయ్యాయి. ఈ రుణాలు దుర్వినియోగమవుతుండటంతో గ్రూపు సభ్యులు వ్యతిరేకించడంతో తిరిగి బ్యాంక్‌లో జమ చేశారు. తాజాగా రుణాలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసిన ఎంపీడీఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మాత్రమే సమాచారమిచ్చారు. దీంతో ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సర్పంచ్ రాజాయాదవ్, ఎంపీటీసీ పద్మాగౌడ్, పలువురు అధికారులు అక్కడికి వచ్చిన 15 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకపోవడంతో గొలగమూడిలో నిర్వహించిన కార్యక్రమానికి మిగిలిన 15 మంది లబ్ధిదారులు రాలేదు. ఎమ్మెల్సీ చేతుల మీదుగా తీసుకునేందుకు ఇష్టంలేక సాయంత్రం ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి ఎంపీడీఓ సుగుణమ్మతో వాగ్వాదానికి దిగారు. తాము ఎప్పడు పంపిణీ చేస్తారని ప్రశ్నిస్తే కలెక్టర్ విచారణలో ఉందని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. లబ్ధిదారులకు జెడ్పీటీసీ సర్దిచెప్పారు. దీంతో మిగిలిన 15 మందికి బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటస్వామి, ఎంపీడీఓ సుగుణమ్మ, ఈఓపీఆర్డీ సమక్షంలో జెడ్పీటీసీ చెక్కులను పంపిణీ చేశారు. -
ఉల్లంఘనపై ఉద్యమం
♦ జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ ♦ పాల్గొన్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు ♦ జేసీ-2, డీఆర్‌ఓలకు వినతిపత్రం కడప కార్పొరేషన్: ప్రొటోకాల్ ఉల్లంఘనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ప్రజాప్రతినిధులమనే గౌరవం లేకుండా అధికారులు ప్రవర్తిస్తున్నారని, తమ చేతిలో ఓటమిపాలైన వారితో ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పలు సమావేశాల్లో నిలదీసినా స్పందన లేకపోవడం, తాజాగా ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని పిలిచి అవమానించడంపై ఆ పార్టీ ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. బుధవారం వైఎస్ఆర్సీపీ శ్రేణులు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కోటిరె డ్డి సర్కిల్, సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లె, విద్యుత్‌భవన్ మీదుగా కొత్త కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించాయి. ర్యాలీలో పార్టీ జిల్లా అధ్యక్షు డు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎస్బీ అంజద్‌బాషా, మేయర్ సురేష్‌బాబు, జెడ్పీ వైస్‌చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, జమ్మలమడుగు ఇన్చార్జి సుధీర్‌రెడ్డిలు ర్యాలీకి అగ్రభాగాన నడిచా రు. జేసీ-2 శేషయ్య, డీఆర్ ఓ సులోచనకు వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ రెండేళ్లుగా చూస్తున్నాం, ప్రజలచేత ఎన్నికైనా తమకు అధికారులు గౌరవం ఇవ్వకపోతే శాంతిభద్రతల సమస్యలు వస్తాయని హెచ్చరించా రు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమాల్లా నిర్వహించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఈవీ మహేశ్వరరెడ్డి, నాయకులు బి. నిత్యానందరెడ్డి, ఇరగంరెడ్డి శంకర్‌రెడ్డి, ధనపాల్ జగన్, పత్తి రాజేశ్వరి, పి.ప్రసాద్‌రెడ్డి, పులి సునీల్, బోలా పద్మావతి, ఉమామహేశ్వరి, టీపీ వెంకటసుబ్బమ్మ, ఖాజా రహమతుల్లా, కార్పొరేటర్లు పాకా సురేష్, చల్లా రాజశేఖర్, సానపురెడ్డి శివకోటిరెడ్డి పాల్గొన్నారు. మంత్రి లేకుంటే ఎమ్మెల్యేనే ముఖ్యఅతిథి: ఎంపీ జీవో520 ప్రకారం ప్రభుత్వ నిధులతో నిర్వహించే ఏ కార్యక్రమమైనా ఇన్చార్జి మంత్రిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించి నిర్వహించాలని, ఆయన రానప్పుడు స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా ఉంటారని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో అనేక కార్యక్రమాల్లో అధికారులు ప్రొటోకాల్‌ను విస్మరించారన్నారు. జన్మభూమి-మాఊరుకు సీఎం వస్తే స్థానిక సర్పంచ్, ఎంపీపీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు ఆహ్వానం పంపలేదన్నారు. రెండురోజుల క్రితం మైదుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని పిలిచి అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనను తాను పార్లమెంటులో ప్రస్తావిస్తే పాత తేదీలు వేసి గత కలెక్టర్ కేవీ రమణ పార్లమెంట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని గుర్తుచేశారు. అవినీతి అధికారులను వదలను: ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అవినీతి అధికారులను వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి స్పష్టం చేశారు. మైదుకూరులో వ్యవసాయశాఖ అధికారులు అవినీతిలో మునిగిపోయారన్నారు. ఏరువాకకు తనను పిలిచి టీడీపీ ఇన్చార్జితో ప్రారంభించారని, వారు వెళ్లిపోయాక తనను రమ్మన్నారని తెలిపారు. తనను అవమానించిందిగాక తిట్టానని కేసు పెట్టడం అత్యంత దారుణమన్నారు. -
వైఎస్ తరహాలో పథకాలను అందించాలి
జన్మభూమిలో ప్రొటోకాల్ ఉల్లంఘన తగదు మంత్రి, కలెక్టర్లను ప్రశ్నించిన ఎంపీపీ పచ్చల రత్నకుమారి కాజ (మంగళగిరి రూరల్) : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మాదిరి సంక్షేమ పథకాలను పేదలకు అందించేందుకు కృషి చేయాలని ఎంపీపీ పచ్చల రత్నకుమారి సూచించారు. మండలంలోని కాజ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆదివారం నిర్వహించిన జన్మభూమి - మా ఊరు గ్రామ సభలో పాల్గొన్న ఆమె పాలకులు, అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీలకు అతీతంగా మహానేత వైఎస్ సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల మన్ననలను పొందారని ఆమె చెప్పారు. నేటి పాలకులు మాత్రం జన్మభూమి కమిటీల పేరుతో వారి అనుయాయులకే పథకాలు అందించేలా వ్యవహరించడం మంచిది కాదని అన్నారు. అధికారులు, మంత్రులు ప్రభుత్వ పథకాలను పేదలందరికీ అందించడంతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అనంతరం కార్యక్రమం ముగింపు సమయంలో ప్రొటోకాల్ ఉల్లంఘనపై కలెక్టర్ కాంతిలాల్ దండేను నిలదీశారు. జన్మభూమి కార్యక్రమంలో అధికారులు ప్రొటోకాల్ పాటించకుండా స్థానిక ఎంపీటీసీ సభ్యులు, ప్రజా ప్రతినిధులను కనీసం సభా వేదికపై కూర్చోవడానికి కూడా అవకాశం కల్పించడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగకుండా అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను గౌరవించాలని ఆమె సూచించారు. అయితే కలెక్టర్ కాంతిలాల్ దండే మాత్రం ఇక నుంచి జరిగే సమావేశాల్లో తామంతా వెనుకకు వెళ్లి కూర్చుంటామని హేళనగా మాట్లాడటం వేదికపై వున్న ప్రజా ప్రతినిధులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో కలెక్టర్ తీరుపై వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు అధికార పార్టీ నేతలు కూడా రుసరుసలాడారు. ఇదే సందర్భంగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివశిస్తున్న పేదలకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయడం లేదని ఎంపీపీ రత్నకుమారి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్, మండల ఉపాధ్యక్షులు మొసలి పకీరయ్య, ఎంపీటీసీలు చిలకలపూడి భాస్కర్, ఈదా ప్రతాపరెడ్డి, అప్పికట్ల శేషమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు పచ్చల శ్యామ్‌బాబు, దొంతా వెంకటరావు, గుర్రం అజయ్‌కుమార్, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఆహ్వానించి అవమానించారు
ప్రొటోకాల్ పాటించకపోవడంతో ఎంపీ మేకపాటి ఆగ్రహం నెల్లూరు(రెవెన్యూ): ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించి ప్రొటోకాల్ పాటించకుండా అవమానపరిచారంటూ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌ను కృష్ణపట్నంపోర్టు సీఎస్ఆర్ నిధులతో ఆధునికీకరించారు. ఈ అతిథి గృహాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఇతర నేతలను ఆహ్వానించారు. ప్రారంభోత్సవ శిలాఫలకంలో ఎంపీ పేరు వేయలేదు. గుర్తించిన మేకపాటి ప్రశ్నించారు. దీనిపై విచారణ చేపట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జేసీని కోరారు. అలాగే నెల్లూరు పెన్నా నది ఒడ్డున ఉన్న మహాకవి తిక్కన పార్క్ అభివృద్ధి కార్యక్రమ శిలాఫలకంలో కూడా ఎంపీ పేరులేదు. దీనిపై మేకపాటి విలేకరులతో మాట్లాడుతూ తనను ఆహ్వానించి అవమానపరిచారన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై పార్లమెంట్లో ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. -
ప్రొటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్‌కు ఎమ్మెల్యే జంకె లేఖ
మార్కాపురం : నియోజకవర్గంలో వివిధ శాఖల అధికారుల ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యుడిని తప్పకుండా ఆహ్వానించాలన్న నిబంధనకు అధికారులు నీళ్లొదలడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు మార్కాపురం మున్సిపల్ కమిషనర్ ప్రొటోకాల్ ఉల్లంఘించారని శాసనసభ స్పీకర్‌కు ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై అసెంబ్లీ కార్యదర్శి స్పందించారు. ఈ నెల 13వ తేదీలోపు విచారణ చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ విజయకుమార్‌ను ఆయన ఆదేశించారు. అక్కడ ఏం జరిగిందో విచారించి నివేదిక ఇవ్వాలని మార్కాపురం ఆర్డీఓతో కలెక్టర్ చెప్పారు. ఎం జరిగిందంటే.. మార్కాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో చైర్మన్ పక్కనే ఎమ్మెల్యేకు కుర్చీ ఏర్పాటు చేయాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2012, జూన్ 26వ తేదీన జీఓ నంబర్ 348 విడుదల చేసింది. అనివార్య కారణాలతో ఎమ్మెల్యే, ఎంపీ సమావేశానికి హాజరు కాలేకపోయినా సీట్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్‌పై ఉంది. ఇప్పటికీ మూడు మున్సిపల్ సమావేశాలు జరగ్గా ఎమ్మెల్యేకు తగిన సీటు కేటాయించకపోవటంతో జంకె వెంకటరెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. దీనితో పాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో కూడా మున్సిపల్ అధికారులు ప్రొటోకాల్ పాటించటం లేదు. గత నెల 25వ తేదీని పొదిలిలో ఎన్ఆర్డీడబ్ల్యూబీ పథకం ద్వారా రూ.30 లక్షలతో ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కూడా స్థానిక ఎమ్మెల్యే జంకెకు సమాచారం ఇవ్వలేదు. దీంతో పొదిలి ఆర్డబ్ల్యూఎస్ డీఈపై స్పీకర్, ఆ విభాగం ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌కు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్న అధికారుల తీరుపై పట్టణానికి చెందిన పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రొటోకాల్ ఉల్లంఘనపై విచారణ చేయనున్నట్లు ఇన్చార్జి ఆర్డీఓ భక్తవత్సాలరెడ్డి తెలిపారు. -
ఐటీడీఏలో ప్రొటోకాల్ ఉల్లంఘన
పార్వతీపురం టౌన్ : ‘‘మేమంటే అంతచులకనా...ప్రొటోకాల్ పాటించ రా, ఎమ్మెల్యే అంటే గౌరవంలేదా’’ అంటూ కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, అరకు ఎంపీ కొత్తపల్లి గీత శనివారం ఐటీడీఏ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా సమావేశం హాల్ నుంచి బయటకు వచ్చేశారు. పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో సబ్-ప్లాన్ పరిధిలోని అన్ని శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించేందుకు ఎంపీ, ఎమ్మెల్యే ఐటీడీఏ కార్యాలయూనికి వచ్చారు. అయితే ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణికి కుర్చీని వేదిక కిందన, అధికారుల పక్కన వేశారు. దీంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ...ఎస్టీ ప్రజాప్రతినిధులను ఇలా అవమానిస్తారంటూ సమీక్ష సమావేశం హాల్ నుంచి బయటకు వచ్చేశారు. ఆమెతో పాటు చినమేరంగి సర్పంచ్ శత్రుచర్ల పరీక్షిత్ రాజు నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఐటీడీఏ ఏపీఓ వసంతరావు ఎమ్మెల్యేను ప్రాధేయపడేందుకు వచ్చా రు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా ఎమ్మెల్యేతో పాటు సమావేశపు హాల్ నుంచి బయటికి వచ్చి, ఎమ్మెల్యేకు మద్ద తు తెలుపుతూ ఐటీడీఏ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. మిగతా ఐటీడీఏల కంటే ఇక్కడ పాలన భిన్నంగా సాగుతోందని, అధికారులు తమకు నచ్చినట్టు వ్యవహరిస్తున్నార ని ఆరోపించారు. ఏపీఓ ఎంపీ, ఎమ్మెల్యేలకు సర్ధి చెప్పేందు కు యత్నించగా, గిరిజన ఎంపీ, ఎమ్మెల్యేలంటే అంత చులకనా...?, ప్రజా సమస్యల పట్ల సమీక్ష నిర్వహించేందుకొస్తే ఖాతరు లేదా...? అన్నారు. ఎంపీ తన ల్యాప్‌టాప్ నుంచిప్రొటోకాల్ జీఓను తీసి చూపించారు. ఇది కేవలం ప్రజాప్రతినిధులను అవమానపర్చడమే అన్నారు. పీఓ బయటికొచ్చి క్షమాపణ చెప్తేనే సమీక్ష సమావేశానికి వస్తామ ని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శుక్రవారం కురుపాంలో జరిగిన సర్పంచ్ల సమావేశానికి కూడా తన ను ఆహ్వానించలేదన్నారు. ఐటీడీఏ తమ సొంత జాగీరులా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఒకానొక సమయంలో నేలపై బైఠాయించి ఆందోళన చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇంతలో పీఓ రజిత్ కుమార్ సైనీ తన చాంబర్ నుంచిబయటికొచ్చి ఎమ్మెల్యే, ఎంపీలకు సర్ధి చెప్పారు. ఎంపీ మాట్లాడుతూ సమీక్ష ఉంటుందని ముందుగానే సమాచారమిస్తే, అసలు అధికారులు రాలేదన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలంటే వైఎస్సార్ సీపీ నాయకులుగా చూస్తున్నారా...? సబ్-కలెక్టర్, తహశీల్దార్లు, ఎంపీడీఓలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆమె అడిగిన ప్రశ్నలకు పీఓ సామరస్యంగా సమాధానం చెప్పడంతో వారు శాంతించా రు. కాగా గతంలో కూడా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర కూడా అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో జరిగిన ఐటీడీఏ పాలకవర్గం సమావేశంలో కూడా అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా రాజన్నదొరను అవమానించారు.