శిలాఫలకంలో పేరు వేయకపోవడంపై ప్రశ్నిస్తున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి
ప్రొటోకాల్ పాటించకపోవడంతో ఎంపీ మేకపాటి ఆగ్రహం
నెల్లూరు(రెవెన్యూ): ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించి ప్రొటోకాల్ పాటించకుండా అవమానపరిచారంటూ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను కృష్ణపట్నంపోర్టు సీఎస్‌ఆర్ నిధులతో ఆధునికీకరించారు. ఈ అతిథి గృహాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ శనివారం ప్రారంభించారు.
ప్రారంభోత్సవానికి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఇతర నేతలను ఆహ్వానించారు. ప్రారంభోత్సవ శిలాఫలకంలో ఎంపీ పేరు వేయలేదు. గుర్తించిన మేకపాటి ప్రశ్నించారు. దీనిపై విచారణ చేపట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జేసీని కోరారు. అలాగే నెల్లూరు పెన్నా నది ఒడ్డున ఉన్న మహాకవి తిక్కన పార్క్ అభివృద్ధి కార్యక్రమ శిలాఫలకంలో కూడా ఎంపీ పేరులేదు. దీనిపై మేకపాటి విలేకరులతో మాట్లాడుతూ తనను ఆహ్వానించి అవమానపరిచారన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై పార్లమెంట్‌లో ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు.