Opisthograph
-
జాడలేని ‘ట్రామా’
తాండూరు : రాష్ట్రంలోనే అత్యధికంగా వికారాబాద్జిల్లాలోనే రొడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నాయని ఇటీవల ఉన్నతాధికారుల కమిటీ ప్రకటించింది. ఒక్కసారిగా పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదం జరిగితే జిల్లాలోనే క్షతగాత్రులకు వైద్యం అందించి ట్రామాకేర్ సెంటర్ ద్వారా చికిత్సలను అందించాలి. కానీ జిల్లాలో ప్రమాదాల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్నా అధికారులు ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శంలు వస్తున్నాయి. గత శనివారం రాజీవ్ జాతీయ రహదారిపై 11 మందికి పైగా ప్రయాణికులు రొడ్డు ప్రమాదంలో మృతి చెందడం. పదుల సంఖ్యలో క్షతగాత్రులు కావడం జిల్లా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ట్రామాకేర్ సెంటర్ అందుబాటులోకి తీసుకురాక పోవడంతో అధికారులు, ప్రజాప్రతినిదుల నిర్లక్ష్యంపై సర్వాత్ర చర్చనీయాంశమైంది. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలను చేపట్టేందుకు గతంలో వికారాబాద్ జిల్లాలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల బృందం, రాష్ట్ర ఆర్అండ్బీ అధికారుల బృందం జిల్లాలో పర్యటించింది. ప్రమాదాలు జరిగితే మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలని సూచించింది. తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేసి క్షతగాత్రులకు వైద్యం అందించాలని నిర్ణయించారు. అందుకోసం మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర రావాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకోసం మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు రూ.30 కోట్ల వరకు కేటాయించారు. అందుకు సంభందించి తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలోని ఇందుకు దాదాపు రెండేళ్ల క్రితమే సుమారు రూ.5.92కోట్ల నిధులు మంజూరు చేసి ట్రామా కేర్ సెంటర్ నిర్వహణ కోసం అభివృద్ధి పర్చారు..వికారాబాద్ జిల్లాలో ప్రతి ఏటా సూమారు 350 నుంచి 400 వరకు రోడ్డు, రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని తాండూరులోని జిల్లా ఆస్పత్రిలోని ట్రామాకేర్ సెంటర్లోని వైద్యం అందించి అవసరమైన శస్త్ర చికిత్సలను వెంటనే చేయాలి. జాతీయ రహదారిపై పర్యవేక్షణేది.. కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు జాతీయ రహదారిగా మార్చారు. వికారాబాద్ జిల్లా మీదుగా రహదారిని ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లాలోని మన్యగుడ నుంచి కొడంగల్ నియోజకవర్గంలోని కర్ణాటక సరిహద్దు వరకు ఈ హైవే ఉంది. సూమారు 90 కిలో మీటర్ల వరకు ఈ రహదారి జిల్లా నుంచి వెలుతుంది. జాతీయ రహదారి భద్రత కోసం రవాణ, ఆర్అండ్బీ, పోలీసు శాఖ, వైద్య శాఖలు హైవేపై పనిచేసేలా ఏర్పాటు చేస్తారు. అందులోకి పోలీసు శాఖ హైవే పోలీస్ స్టేషన్లను, అవుట్ పొస్ట్లను అందుబాటులో ఉంచింది. జాతీయ రహదారి సమీపంలో ప్రభుత్వం క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించేందుకు రూ.కోట్ల నిధులు ఖర్చు పెట్టి ట్రామాకేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో కూడా వాటిని ఏర్పాటు చేసేందుకు పనులు మొదలు పెట్టి అసంపూర్తిగా వదిలేసారు. కేవలం ప్రాథమిక చికిత్సలకే పరిమితం... రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు జిల్లా ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సలు మినహా పూర్తి స్థాయి వైద్య సేవలు అందని పరిస్థితి. క్షతగాత్రులను 120 కి.మీ దూరంలో ఉన్న హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు.. ఈ క్రమంలో హైదరాబాద్‌కు వెళ్లేలోపు ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు సకాలంలో వైద్య సేవలు అందక మరణిస్తున్నారని వైద్యులు అంటున్నారు. ప్రత్యేక వైద్య సదుపాయాలు ఇలా... జాతీయ రహదారుల పరిధిలోకి వచ్చే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రుల్లోనే కేంద్రం నిధులతో ఈ సెంటర్ నెలకొల్పనున్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే వైద్యం అందించేందుకు తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలపమెంట్ కార్ఫొరేషన్(టీఎస్ఎంఐడీసీ) ట్రామ సెంటర్‌ను ఏర్పాటుకు పనులను ప్రారంభించారు. ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్లతోపాటు స్టాఫ్ నర్సులు, ప్రత్యేక అత్యవసర వైద్య సదుపాయాలు కలిగిన అంబులెన్స్, ఆధునాతన సౌకర్యాలతో కూడిన ఆపరేషన్ థియేటర్లు తదితర ప్రత్యేక వైద్య సిబ్బందిని నియామకం చేయనున్నారు. ప్రత్యేకంగా ఐసీయూ ఏర్పాటు, ఈ ట్రామా సెంటర్ కోసం మొత్తం రూ.5.92 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో రూ.5కోట్లతో పరికరాలు, వసతులు, రూ.80లక్షలతో బిల్డింగ్ తదితర సివిల్ పనులు, మరో రూ.12లక్షలతో అంబులెన్స్‌ను ఏర్పాటుకు నిధులను కేటాయించారు. ట్రామా కేర్ కోసం చేసిన పనులు ఎక్కడికక్కడే తుప్పుపట్టి పోయాయి. వైద్యం కోసం వచ్చిన పరికరాలను గదిలో వేసి తాళం వేయడంతో తుప్పు పట్టాయి. -
ఆహ్వానించి అవమానించారు
ప్రొటోకాల్ పాటించకపోవడంతో ఎంపీ మేకపాటి ఆగ్రహం నెల్లూరు(రెవెన్యూ): ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించి ప్రొటోకాల్ పాటించకుండా అవమానపరిచారంటూ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌ను కృష్ణపట్నంపోర్టు సీఎస్ఆర్ నిధులతో ఆధునికీకరించారు. ఈ అతిథి గృహాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఇతర నేతలను ఆహ్వానించారు. ప్రారంభోత్సవ శిలాఫలకంలో ఎంపీ పేరు వేయలేదు. గుర్తించిన మేకపాటి ప్రశ్నించారు. దీనిపై విచారణ చేపట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జేసీని కోరారు. అలాగే నెల్లూరు పెన్నా నది ఒడ్డున ఉన్న మహాకవి తిక్కన పార్క్ అభివృద్ధి కార్యక్రమ శిలాఫలకంలో కూడా ఎంపీ పేరులేదు. దీనిపై మేకపాటి విలేకరులతో మాట్లాడుతూ తనను ఆహ్వానించి అవమానపరిచారన్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై పార్లమెంట్లో ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. -
ప్రొటోకాల్ రగడ
శిలాఫలకంపై జిల్లా మంత్రుల పేర్లు లేవని నిరసన కమిషనర్ దిష్టిబొమ్మ దహనం కరీంనగర్ : జిల్లాలో మంత్రి హరీశ్‌రావు పర్యటన పూర్తయ్యాక ప్రొటోకాల్ రగడ మొదలైంది. శిలాఫలకంలో మంత్రుల పేర్లు లేకపోవడంతో ప్రొటోకాల్ వివాదం అధికారుల మెడకు చుట్టుకుంది. నగరంలోని 10వ డివిజన్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.33.22 లక్షలతో చేపట్టిన సీసీ డ్రెయిన్ శంకుస్థాపనకు ఏర్పాటు చేసిన శిలాఫలకంలో కేవలం మంత్రి హరీశ్‌రావు పేరు పెట్టి జిల్లాకు చెందిన మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్ పేర్లు చేర్చకపోవడాన్ని వివిధ సంఘాలు తప్పు పడుతున్నాయి. బీసీలను అణగదొక్కాలనే ఉద్దేశంతోనే మంత్రి ఈటెల రాజేందర్ పేరు చేర్చలేదని ఆరోపించారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన నగరపాలక సంస్థ కమిషనర్‌పై చర్య తీసుకోవాలని టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కట్ల సతీశ్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు అక్బర్‌హుస్సేన్, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సిద్దం వేణు, తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతినాయక్ 42వ డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, యువజన నాయకులు డిమాండ్ చేశారు. ఈటెల యువసేన జిల్లా అధ్యక్షుడు మంద సుధీర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో కమిషనర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. తెలంగాణ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచకొండ సత్యనారాయణరావు ఆధ్వర్యంలో బీసీ కులాల ఐక్యవేదిక పక్షాన శిలాఫలకం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆందోళనలో బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ శ్రీధర్‌రాజు, కాల్వ నర్సయ్యయాదవ్, కడారి అయిలయ్య, మియాపురం రవీంద్రచారి, పిట్టల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యామ లక్ష్మీరాజం, జిల్లా కార్యదర్శులు ఆర్పీ రాజు, మూల జయపాల్ పాల్గొన్నారు. కమిషనర్ దిష్టిబొమ్మ దహనం మంకమ్మతోట : నగరంలోని శనివారం మార్కెట్ యార్డులో ప్రారంభించిన అభివృద్ధి పనుల శంకుస్థాపన శిలాఫలకంపై మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్ పేర్లు రాయలేదని నిరసన వ్యక్తం చేస్తూ ఈటెల యువసేన, బీసీ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో నగరపాలకసంస్థ కమిషనర్ శ్రీకేశ్‌లట్కర్ దిష్టిబొమ్మను మంగళవారం దహనంచేశారు. ఈ సందర్భంగా యువసేన జిల్లా అధ్యక్షుడు మంద సుధీర్, బీసీ సంఘం నగర అధ్యక్షుడు రమేశ్ మాట్లాడుతూ మంత్రుల ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడాన్ని ఖండించారు. ప్రభుత్వపరంగా కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు టి.విష్ణువర్ధన్, విజయ్, రావణవేని రాము, రాజేశ్, సంతోష్, కార్తీక్ పాల్గొన్నారు.