మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ స్థానంలో కూర్చుని మాట్లాడుతున్న నాగరాజు(తెలుపు రంగు చొక్కా ధరించిన వ్యక్తి)
గూడూరు: అధికారం ఉందనో.. అడిగేవారు లేరనో తెలీదు గానీ సాక్షాత్ ఎంపీపీ స్థానంలో కూర్చున్న ఆ వ్యక్తి అధికారులందరి సాక్షిగా ప్రోటోకాల్ ఉల్లంఘించి మండల సర్వసభ్య సమావేశం జరిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీపీ పిట్టి రావమ్మకు బదులుగా, ఆమె తనయుడు నాగరాజు కూర్చుని సమావేశాన్ని నిర్వహిస్తుంటే అందుకు అధికారులే సాక్షులుగా మిగిలారు.
అలాగే ఇదేమిటబ్బా అని అన్ని శాఖల అధికారులు ముక్కున వేలేసుకున్నారు. అంతేకాకుండా రుణాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను అధికారుల వద్ద నుంచి తెప్పించుకుని, తాము నిర్ణయించిన పేర్లే అందులో ఉన్నాయా..లేక మార్చారా అని ఆరా తీశారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం మెరుగుపై సమావేశంలో చర్చ జరగగా, ఎంపీపీ స్థానంలో కూర్చున్న నాగరాజు పారిశుద్ధ్ద్యం మెరుగుకు అందరూ కృషి చేయాలని, అందుకు తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment