
విశాఖ ఘన విజయం
కడప నగరంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల అండర్–19 ఎలైట్ గ్రూపు మ్యాచ్‌లలో విశాఖ జట్టు అనంతపురంపై ఘన విజయం సాధించింది. కేఎస్‌ఆర్‌ఎం క్రీడామైదానంలో 84 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన అనంతపురం రెండో ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేసింది.
కడప స్పోర్ట్స్:
కడప నగరంలో నిర్వహిస్తున్న అంతర్ జిల్లాల అండర్–19 ఎలైట్ గ్రూపు మ్యాచ్‌లలో విశాఖ జట్టు అనంతపురంపై ఘన విజయం సాధించింది. కేఎస్‌ఆర్‌ఎం క్రీడామైదానంలో 84 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన అనంతపురం జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 67.2 ఓవర్లలో 147 పరుగులు చేసింది. జట్టులోని యోగానంద 27, గిరినాథరెడిడ 24 పరుగులు చేశారు. విశాఖ బౌలర్లు కల్యాణ్‌బాబు 4, ప్రశాంత్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన విశాఖ జట్టు 27.3 ఓవర్లలో 107 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. జట్టులోని ప్రియమషిష్ 39 పరుగులు, వంశీకృష్ణ 32 పరుగులు చేశారు. దీంతో విశాఖ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా అనంతపురం జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు చేయగా, విశాఖ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేసిన విషయం విధితమే. దీంతో విశాఖ జట్టుకు 6 పాయింట్లు లభించాయి.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో కడపజట్టు..
కేఓఆర్‌ఎం క్రీడామైదానంలో కడప జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేయగా సోమవారం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన గుంటూరు జట్టు 61.4 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులోని కె.మహీప్‌కుమార్ 124 పరుగులో సెంచరీ సాధించాడు. ఈయనకు జతగా నోవా 63 పరుగులు చేశాడు. కడప బౌలర్లు వంశీకృష్ణ 3, హరిశంకర్‌రెడ్డి 3, ధృవకుమార్‌రెడ్డి 3 వికెట్లు తీశారు. దీంతో 11 పరుగుల స్వల్ప ఆధిక్యం కడపజట్టుకు లభించింది. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు రెండోరోజు ఆటముగిసే సమయానికి 36 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేశారు. జట్టులోని ధృవకుమార్‌రెడ్డి 74 పరుగులు, నూర్‌బాషా 28 పరుగులు చేశారు. దీంతో రెండోరోజు ఆటముగిసింది.