31 నుంచి ఓటరు నమోదు | voter registration from 31st | Sakshi
Sakshi News home page

31 నుంచి ఓటరు నమోదు

Published Sat, Oct 15 2016 12:24 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM

voter registration from 31st

2017, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు అవకాశం
- అన్ని విద్యా సంస్థల్లో ఫారం-6 దరఖాస్తులు
- డిసెంబర్‌ 15 వరకు కొనసాగింపు
- ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తుల స్వీకరణ
- జనవరి 14న తుది ఓటర్ల జాబితా ప్రకటన
 
కర్నూలు(అగ్రికల్చర్‌): 2017 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ తెలిపారు. శుక్రవారం కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో నిర్వహించిన సమావేశంలో ఈ నెల 31వ తేదీ నుంచి జరిగే ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమ విధివిధానాలను వివరించారు. ఇంజినీరింగ్‌, మెడికల్, వృత్తివిద్యా సంస్థల్లో 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని విద్యా సంస్థల్లో ఫారమ్‌-6 దరఖాస్తులను అందుబాటులో ఉంచాలన్నారు. డిసెంబర్‌ 15 వరకు అర్హులైన వారందరూ ఓటర్లుగా నమోదు అయ్యేందుకు దరఖాస్తులను తహశీల్దార్‌ కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఫారమ్‌–6 దరఖాస్తులను పంపవచ్చన్నారు. వచ్చిన దరఖాస్తులన్నింటిపై విచారణ జరిపి తుది ఓటర్ల జాబితాను జవనరి 14వ తేదీన ప్రకటించాలని ఆదేశించారు. ఈ నెల 31న ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని పోలింగు కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ నెల 31 నుంచి డిసెంబర్‌ 15వ తేదీ వరకు ఉన్న ఆదివారాలను ప్రత్యేక ఓటరు నమోదు దినాలుగా ఎన్నికల కమిషన్‌ ప్రకటించిందని, ఆయా రోజుల్లో అన్ని పోలింగు కేంద్రాలను తెరచి ఉంచి ఫారమ్‌–6, 7 దరఖాస్తులను అందుబాటులో ఉంచడంతో పాటు దరఖాస్తులను స్వీకరించాలని కోరారు. సమావేశంలో జేసీ-2 రామస్వామి, డీఆర్వో గంగాధర్‌గౌడ్, అన్ని నియోజకవర్గాల ఈఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement