ఓటరు నమోదుకు రెండు రోజులే అవకాశం
Published Tue, Dec 13 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 PM
కర్నూలు(అగ్రికల్చర్): ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఓటరు నమోదు కార్యక్రమం ఈ నెల 14తో ముగియనుంది. ఓటర్లుగా నమోదు అయ్యేందుకు కేవలం 2 రోజులు మాత్రమే రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంది. జనవరి1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు కావచ్చని జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటర్లుగా నమోదు అయ్యేందుకు ఫారం–6 ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Advertisement
Advertisement