ఓటుతోనే ప్రజాస్వామ్యంలో మార్పు | District Collector Krishna Bhaskar Said That There Will Be Several Changes In The Vote In Democracy. | Sakshi
Sakshi News home page

ఓటుతోనే ప్రజాస్వామ్యంలో మార్పు

Published Tue, Dec 4 2018 12:22 PM | Last Updated on Tue, Dec 4 2018 12:26 PM

District Collector Krishna Bhaskar Said That There Will Be Several Changes In The Vote In Democracy. - Sakshi

ప్రతిజ్ఞ చేస్తున్న యువత 

సిద్దిపేటజోన్‌: ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటుతోనే అనేక మార్పులు వస్తాయని జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అన్నారు. సోమవారం రాత్రి సిద్దిపేట ఓపెన్‌ ఎయిర్‌ ఆడిటోరియంలో ఓటరు చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సదస్సులో ఓటర్ల చైతన్యం కోసం మెడికల్‌ కళాశాల విద్యార్థినీవిద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శణలతో పాటుగా, సుమన్, సుజన్‌బృందాలు చేపట్టిన ‘దేశమా.. నా దేశమా  భారతదేశమా..’ నృత్యంతో అలరించి చూపరులను ఆకట్టుకున్నారు.

అనంతరం విద్యార్థులతో కలెక్టర్‌ ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. డిసెంబర్‌ 7న జరగబోయే ఎన్నికల రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తప్పక ఓటును వినియోగించుకోవాలని సూచించారు.

అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌ చేతుల మీదుగా మెమొంటోలను అందించి అభినందించారు. కార్యక్రమంలో ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ గాధ్వీ, వ్యయ పరిశీలకులు లోకేష్‌కుమార్, జేసీ పద్మాకర్, జిల్లా అధికారులు  పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement