
సమయం కావాలి...
- పెళ్లయిన వెంటనే బిడ్డలు వద్దు అనుకుంటున్న మహిళలు
- బిడ్డ బిడ్డకూ మధ్య కూడా గ్యాప్ కోరుకుంటున్నారు
- దాని కోసం ఓరల్ పిల్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు
- ‘కు.ని’ ఆపరేషన్ అంటే మగాళ్లకు భయం
- సర్కారు తాజా గణాంకాల్లో వెల్లడి
సాక్షి, అమరావతి: అత్యాధునిక వైద్య పద్ధతులు.. ఆధునిక జీవన విధానంతో పెళ్లరుున మహిళల ఆలోచనల్లోనూ మార్పువస్తోంది. గర్భధారణ విషయంలో అది కొట్టొచ్చినట్లు కనబడుతోంది. పాత పద్ధతులను కాదని.. తాత్కాలిక పద్ధతులకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు వైద్య ఆరోగ్యశాఖ తాజా గణాంకాల్లో స్పష్టమైంది. గతంలో పెళ్లరుున మూడేళ్లలో ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడం, ఆ వెంటనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేరుుంచుకోవడం అనేది సర్వసాధారణం. ఇప్పుడు ఆ విధానానికి మహిళలు స్వస్తి పలికారు. పెళ్లరుున వెంటనే బిడ్డలను కోరుకోవడంలేదని, కొంత సమయాన్ని కోరుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని గణాంకాల్లో తేలింది. అంతేకాదు బిడ్డకూ బిడ్డకూ మధ్య సమయాన్ని కోరుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ఒక బిడ్డ పుట్టాక రెండో బిడ్డకు కనీసం నాలుగేళ్లు సమయం కావాలని కోరుకునే వారి సంఖ్య 50 శాతం పైనే ఉన్నట్టు తేలింది.
పిల్స్ వాడకం ఎక్కువగా ఉంది
పెళ్లరుున జంటలు వెంటనే సంతానం కలగకుండా ఉండటానికి, లేదంటే బిడ్డకూ బిడ్డకూ మధ్య సమయాన్ని కోరుకునే వారు ఎక్కువగా ఓరల్ పిల్స్ (మాత్రలను) ఆశ్రరుుస్తున్నారు. పెళ్లరుున జంటల్లో ఏటా సగటున 1.50 లక్షల మంది ఆ మాత్రలు వాడుతున్నట్టు తేలింది. ఇక సగటున లక్షా నలభై వేల మంది ఏటా నిరోధ్‌ను వాడుతున్నట్టు ఆరోగ్యశాఖ గణాంకాల్లో స్పష్టమైంది.
అమ్మో ఆపరేషనా..
కుటుంబ నియంత్రణ (కు.ని) ఆపరేషన్లంటే మగాళ్లు తెగ భయపడిపోతున్నారు. అత్యాధునిక వైద్య పద్ధతుల్లో, ఎలాంటి ఇబ్బంది లేకుండా నిముషాల వ్యవధిలోనే శస్త్రచికిత్స చేస్తున్నా సరే మగాళ్లు ముందుకు రావడం లేదు. కు.ని విషయంలో మహిళలతో పోల్చుకుంటే మగాళ్లు 0.7 శాతం కూడా లేరు. దీనికి కారణం చాలామంది మగాళ్లలో భయం ఉండటమే. పైగా చాలామంది మగాళ్లకు వ్యాసెక్టమీ ఆపరేషన్‌పై సరైన అవగాహన లేకపోవడంతో ఆడాళ్లనే ఆపరేషన్ చేరుుంచుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.