ప్రధాన కాల్వలో ప్రవహిస్తున్న సాగర్ నీరు
ఖమ్మం అర్బ¯ŒS: వర్షాలు.. వరదల నేపథ్యంలో సాగర్ ప్రధాన కాల్వకు ఎన్నెస్పీ అధికారులు ఆదివారం నీరు విడుదల చేశారు. వివిధ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎన్నెస్పీ దిగువ ప్రాంతాలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన కాల్వ 40 కిలోమీటర్ వద్ద నల్లగొండ జిల్లా దేవులపల్లి ప్రాజెక్టు నిండింది. ఆ వరదను కూడా పాలేరు చెరువులోకి పంపుతున్నారు. అటు సాగర్ నుంచి కూడా నీరు వస్తోంది. మొత్తం 4,800 క్యూసెక్కుల నీరు పాలేరు ప్రధాన కాల్వకు విడుదల చేస్తున్నారు. పది రోజుల క్రితం వరకు వెలవెలబోయిన ప్రధాన కాల్వ నేడు నీటితో కళకâýæలాడుతోంది. ప్రధాన కాల్వతో పాటు దాని పరిధిలోని బ్రాంచి, మేజర్ కాల్వలకు కూడా అవసరమైన మేరకు నీరు విడుదల చేస్తున్నామని ఎన్నెస్పీ అధికారి ఒకరు తెలిపారు. ఆయకట్టు పరిధిలోని చెరువులను పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నింపుతామన్నారు. సాధ్యమైనంత వరకు 2, 3 డివిజన్లకు నీరు పంపుతున్నామన్నారు. ఓవైపు వర్షాల జోరు.. మరోవైపు సాగర్ నీటితో చెరువులు జలకâýæ సంతరించుకోనున్నాయి. ఈ నీటి విడుదలతో నాట్లు వేసి నీటి కోసం ఎదురుచూస్తున్న ఆయకట్టు రైతులకు ఊరట లభించనుంది. వైరా రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నింపుతామన్నారు. ఇక సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.