from
-
అంబానీ గ్రాండ్ వెడ్డింగ్ : అక్క అలా, చెల్లి ఇలా, కపూర్ సిస్టర్స్ సందడే సందడి
-
ఓట్ ఫ్రమ్ హోం
సాక్షి, నరసరావుపేట: చేతికర్ర సాయంతో ఓ దివ్యాంగుడు.. ఆటోలో ఓ ముసలవ్వ.. ఇలా అనేక మంది ఎన్నికల కేంద్రాలకు వచ్చి ఓటు వేసేందుకు పడే తిప్పలు గతంలో కనిపించేవి. కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి వారి కష్టాలకు చెక్ పెట్టింది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40%కి మించి వైకల్యం ఉన్న వారు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ విధానాన్ని సీఈసీ ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు ఏపీలోనూ అమలుకు చర్యలు చేపట్టింది. పోస్టల్ బ్యాలెట్ తరహాలోనే.. ఇంటి నుంచి ఓటు వేయడానికి కూడా ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 80 ఏళ్ల పైబడి వయసు ఉన్నవారు, దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఐదు రోజుల ముందే 12డీ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వీటిని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు పరిశీలిస్తాయి. అర్హులైన వారికే ‘ఓట్ ఫ్రమ్ హోం’కు అవకాశం కల్పిస్తాయి. బూత్ లెవల్ అధికారి కూడా ఇంటి నుంచే ఓటు వేయడానికి అర్హులైన వారిని సంప్రదించి.. వారి ఆసక్తికి అనుగుణంగా దరఖాస్తు చేయిస్తారు. పోలింగ్ బూత్ తరహా ఏర్పాట్లు ఇంటి నుంచే ఓటు వేసే కార్యక్రమానికి కూడా సాధారణంగా పోలింగ్ కేంద్రంలో మాదిరిగానే జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తారు. ఓటు ఎవరికి వేశారో బయటకు రాదు. పోలింగ్ సిబ్బందితో పాటు ఆయా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు కూడా వారి వెంట ఉంటారు. ఇంటి నుంచి ఓటు వేయటానికి ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంత మందికి ఓటు హక్కు కల్పించారనే వివరాలను అన్ని రాజకీయ పార్టీలతో పాటు పోటీలో ఉన్న అభ్యర్థులకు కూడా ఎన్నికల సిబ్బంది సమాచారమిస్తారు. వయో వృద్ధులు, దివ్యాంగులు ఈ సదుపాయాన్ని సది్వనియోగం చేసుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు. మంచి అవకాశం... 80 ఏళ్లు నిం.డిన మా లాంటి వారు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేయాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని గుర్తించి ఎన్నికల సంఘం ఇంటి వద్ద నుంచే ఓటు వేయడానికి అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది. దీని వల్ల ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశముంది. – యెన్నం వెంకట నర్సిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్. ఉప్పలపాడు, పల్నాడు జిల్లా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేక కొంతమంది తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. దీనిని సరిచేసేందుకు ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ విధానం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయవంతమైంది. మన రాష్ట్రంలో అమలు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విధానాన్ని అర్హులైన వారు వినియోగించుకునేలా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. – ఎల్ శివశంకర్, పల్నాడు జిల్లా కలెక్టర్ -
మహారాష్ట్ర నుంచి లోక్‌సభకు కేసీఆర్?
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. బీఆర్ఎస్ను జాతీయ స్థాయిలో బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. కాగా మహారాష్ట్రలోని నాందేడ్ లేదా ఔరంగాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న కేసీఆర్ గతంలో తెలంగాణలోని మూడు వేర్వేరు లోక్‌సభ నియోజక వర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004, 2006, 2008లో కరీంనగర్ నుంచి. 2009లో మహబూబ్‌నగర్ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర అవతరణ నేపథ్యంలో 2014లో మెదక్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన కేసీఆర్, సీఎం పదవిని చేపట్టడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. జాతీయ రాజకీయాల్లో బలం చాటే వ్యూహం జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీల నేతృత్వంలోని కూటములకు సమదూరం పాటిస్తున్న కేసీఆర్ లోక్‌సభలో ఒంటరి పోరుకు సన్నద్ధమవుతున్నారు. మహారాష్ట్రలోని అన్ని లోక్‌సభ స్థానాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలోకి దింపేలా ఆయన వ్యూహ రచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మహారాష్ట్రలో 48 లోక్‌సభ నియోజకవర్గాలు ఉండగా, ఇప్పటికే 27 నియోజకవర్గాల పరిధిలో గ్రామ స్థాయి వరకు తొమ్మిదేసి పార్టీ కమిటీలు ఏర్పాటయ్యాయి. మహారాష్ట్రలోని 15 జిల్లాల పరిధిలో పార్టీ కార్యకలాపాలు వేగం పుంజుకున్నట్లు మహారాష్ట్ర బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా మహారాష్ట్ర నుంచి లోక్‌సభ బరిలోకి దిగడం ద్వారా జాతీయ రాజకీయాల్లో తన బలాన్ని చాటేలా కేసీఆర్ వ్యూహం సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి దక్షిణాది నుంచి తొలి హ్యాట్రిక్ సీఎంగా నిలిచేందుకే కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. -
మెటా కీలక నిర్ణయం వర్క్ ఫర్మ్ హోమ్..!
-
కామారెడ్డి జిల్లా : పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థుల అదృశ్యం
-
‘బొబ్బర’తో బెంబేలు
మధిర: మిరపతోటల్లో ఇటీవల బొబ్బర తెగులు తీవ్రంగా వ్యాపిస్తోంది. జెమినీ వైరస్ ఆశించి పంట ఎదుగుదలను చంపేస్తోంది. ఆకులపై బొబ్బలు ఏర్పడి, పత్రాలన్నీ పసుపు రంగులోకి మారుతున్నాయి. తెల్లదోమ ఆశించడంవల్లే ఈ విధంగా జరుగుతోందని రైతులు వాపోతున్నారు. దీని నివారణ కోసం రైతులు క్రిమి సంహారక మందుల పిచికారీకి ఇప్పటికే ఎకరానికి రూ.20వేలకు పైగా ఖర్చుపెట్టారు. దీనికి తోడు మిరపతోటకు వివిధ రకాల చీడపీడలు, దోమ ఆశిస్తుండడంతో మిరపతోటల ఎదుగుదల లోపిస్తోంది. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ ఈ బొబ్బరరోగం నివారణకు పురుగుమందులను పిచికారీ చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మధిర మండల పరిధిలోని నిదానపురం గ్రామంలో మిరప తోటల్లో ఈ తెగుళ్ల పీడ తీవ్రంగా ఉంది. పలు గ్రామాల్లో జెమినీ వైరస్ వ్యాపిస్తోంది. పంట వాడిపోయినట్లు మారిపోతుండడంతో వేలాది రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు దిగాలు చెందుతున్నారు. ఆశలు ఆవిరి.. l ఖరీఫ్‌లో ఎన్నో ఆశలతో మిర్చి పంట వేసిన రైతులు ఇప్పుడు తెగుళ్లతో బెంబేలెత్తుతున్నారు. l బొబ్బర తెగులుతో ఆకులన్నీ రోజుల వ్యవధిలోనే రంగు మారి పాలిపోతుంటే గుండెధైర్యం కోల్పోతున్నారు. l పచ్చగా నిగనిగలాడాల్సిన తోట..పాలిపోతోంది. l ఈ తెగుళ్ల నివారణకు ఇంకా పురుగులమందు పిచికారీ భారం పడే అవకాశాలు ఉన్నాయి. l బొబ్బర తెగుâýæ్ల పంటలను వ్యవసాయాధికారులు పరిశీలించాలని రైతులు కోరుతున్నారు. l బోర్లు, బావులను అద్దెకు తీసుకొని, జనరేటర్లు, డీజిలింజన్ల ద్వారా మొన్నటిదాకా తడులు కట్టారు. l ఇప్పుడు తెగుâýæ్లతో పంట చేతికందకుంటే.. నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి.. ఖరీఫ్‌లో ఎకరం భూమిని కౌలుకు తీసుకొని మిర్చిపంట వేశా. బొబ్బర రోగం వచ్చి ఆకులన్నీ ముడుచుకుపోతున్నాయి. పసుపు రంగులోకి మారుతున్నాయి. కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వమే రుణాలు మంజూరు చేయాలి. ఈ సారి పెట్టుబడి ఎకరానికి రూ.2లక్షలకుపైగా అవుతుందేమోనని భయపడుతున్నాం. ప్రైవేట్ వ్యాపారులు దోచుకుంటున్నారు. –తిప్పారెడ్డి శ్రీనివాసరెడ్డి, మిరప రైతు, నిదానపురం -

‘సాగర్’ నీరు విడుదల
ఖమ్మం అర్బ¯ŒS: వర్షాలు.. వరదల నేపథ్యంలో సాగర్ ప్రధాన కాల్వకు ఎన్నెస్పీ అధికారులు ఆదివారం నీరు విడుదల చేశారు. వివిధ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎన్నెస్పీ దిగువ ప్రాంతాలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన కాల్వ 40 కిలోమీటర్ వద్ద నల్లగొండ జిల్లా దేవులపల్లి ప్రాజెక్టు నిండింది. ఆ వరదను కూడా పాలేరు చెరువులోకి పంపుతున్నారు. అటు సాగర్ నుంచి కూడా నీరు వస్తోంది. మొత్తం 4,800 క్యూసెక్కుల నీరు పాలేరు ప్రధాన కాల్వకు విడుదల చేస్తున్నారు. పది రోజుల క్రితం వరకు వెలవెలబోయిన ప్రధాన కాల్వ నేడు నీటితో కళకâýæలాడుతోంది. ప్రధాన కాల్వతో పాటు దాని పరిధిలోని బ్రాంచి, మేజర్ కాల్వలకు కూడా అవసరమైన మేరకు నీరు విడుదల చేస్తున్నామని ఎన్నెస్పీ అధికారి ఒకరు తెలిపారు. ఆయకట్టు పరిధిలోని చెరువులను పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నింపుతామన్నారు. సాధ్యమైనంత వరకు 2, 3 డివిజన్లకు నీరు పంపుతున్నామన్నారు. ఓవైపు వర్షాల జోరు.. మరోవైపు సాగర్ నీటితో చెరువులు జలకâýæ సంతరించుకోనున్నాయి. ఈ నీటి విడుదలతో నాట్లు వేసి నీటి కోసం ఎదురుచూస్తున్న ఆయకట్టు రైతులకు ఊరట లభించనుంది. వైరా రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నింపుతామన్నారు. ఇక సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మార్కెట్‌ను గుర్రాలపాడుకే తరలించాలి
-
వణికిస్తున్న జ్వరాలు
పాల్వంచ ఆస్పత్రిలో 28మందికి చికిత్స పాల్వంచ రూరల్: విషజ్వరాలతో బాధ పడుతూ పాల్వంచ ఏరియా ఆస్పత్రికి వస్తున్న పీడితుల సంఖ్య పెరుగుతోంది. గురువారం దాదాపు 30మంది వరకు జ్వరంతో బాధ పడుతూ రాగా..23మంది టైఫాయిడ్, మరొకరు మలేరియా జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యపరీక్షల్లో తేలింది. ఇందిరానగర్ కాలనీలోని కస్తూర్బాగాంధీ విద్యాలయం విద్యార్థినులు జ్వరంతో బాధపడుతున్నారు. పదో తరగతి బాలికలు డి.సంధ్య, బి.బేబి, వెన్నెల తదితరులు తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురికాగా బాధ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన 5వ తరగతి విద్యార్థి జె.కార్తీక్‌ను ఇక్కడ చేర్పించారు. సమీప గ్రామస్తులు, ఇటు విద్యార్థులు హాస్పిటల్‌కు రావడంతో బెడ్లు సరిపోలేదు. కొన్ని పడకలపై ఇద్దరి చొప్పున పడుకోబెట్టి వైద్యచికిత్స నిర్వహించారు. రక్త పరీక్షలు చేయించుకునేందుకు రోగులు బారులు తీరారు. ఇంకా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా పలువురు జ్వరపీడితులు చేరి.. చికిత్స పొందుతున్నారు.