మైలవరం జలాశయం ఉత్తర కాలువకు నీరు విడుదల
మైలవరం: మైలవరం జలాశయం ఉత్తర కాలువకు శుక్రవారం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎండుతున్న పంటలను కాపాడేందుకు నీటిని విడుదల చేస్తున్నామని, రైతులు పైరుకు తగ్గట్టుగా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రైతులు ఫసల్ బీమా యోజనను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం జలాశయంలో 0.947 టీఎంసీల నీరుందని, అధికారుల ఆదేశాల మేరకు 7 రోజుల పాటు ఉత్తర కాలువకు నీరు విడుదల చేస్తామని ఏఈ గౌతమ్‌రెడ్డి తెలిపారు. రోజుకు 200 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో ఈఈ సుధాకర్, డీఈ రామాంజులు, టీబీహెచ్‌ఎల్‌సీ చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.