జల్లుల స్నానం.. మేం చేయం! | We don`t bath in sprinkled water | Sakshi
Sakshi News home page

జల్లుల స్నానం.. మేం చేయం!

Published Fri, Aug 12 2016 7:41 PM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM

జల్లుల స్నానం.. మేం చేయం! - Sakshi

జల్లుల స్నానం.. మేం చేయం!

* దూరం నుంచి వచ్చింది చల్లుకోవడానికా..?
మోర్తోట ఘాట్‌లో పోలీసులతో భక్తుల వాగ్వాదం
ఘాట్‌ పక్కన ఉన్న నీళ్లలో స్నానం చేస్తామని మహిళల పట్టు
 
రేపల్లె : పుష్కర స్నానాలు చేయడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. మోర్తోటలోని ముక్తేశ్వరస్వామి ఆలయ సమీపంలోని పుష్కర ఘాట్‌లో నీటి జాడలేక పోవడంతో నీటిని నెత్తిమీద జల్లుకుని మమ అని వెనుదిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు భక్తులు అలాగే సరిపెట్టుకున్నారు. కొందరు మహిళలు మాత్రం తాము ఇంత దూరం నుంచి వచ్చింది నెత్తి మీద నీళ్లు చల్లుకుపోవడానికా... అంటూ ఘాట్‌ పక్కనే ఉన్న నీటిలో స్నానం చేసేందుకు వెళ్లబోగా పోలీసులు అడ్డుకుని వారిని నెట్టివేశారు. ఈ సందర్భంగా పోలీసులకు భక్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 
 
కంగుతిన్న ఎమ్మెల్యే అనగాని..
మోర్తోట పుష్కర ఘాట్‌లో మహిళలకు, పోలీసులకు జరుగుతున్న వివాదాన్ని స్థానిక టీడీపీ నాయకులు ఫోన్‌లో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యేను భక్తులు ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో కంగుతిన్న ఎమ్మెల్యే ఆగమేఘాలపై ఘాట్‌ పక్కన స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేయించడంతో మహిళలు శాంతించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement