తణుకు టౌన్ : స్మార్ట్ పల్స్ సర్వేలో రాష్ట్రం మొత్తంలో జిల్లా ప్రథమస్థానంలో నిలుస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు చెప్పారు. మంగళవారం తణుకు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసాధికారిత సర్వే సమీక్ష సమావేశంలో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకూ 85 శాతం పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ నెలాఖరు నాటికి సర్వేను పూర్తి చేస్తున్నట్టు లె లిపారు. సర్వే సిబ్బంది దర్శించిన గృహాల నుంచి ఇంటి నివాసితుల బయోమెట్రిక్ వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. కుటుంబంలో అందుబాటులో ఉన్న వారి వివరాలు సేకరించి, అనంతరం అందుబాటులో లేని వారి వివరాలను కూడా సేకరిస్తామన్నారు. జిలాల్లో మొత్తం 40 లక్షల జనాభా నుంచి 26 లక్షల నుంచి బయోమెట్రిక్ వివరాలు తీసుకున్నట్టు తెలిపారు. జిల్లాలో 2 లక్షల రేషన్ కార్డులకు గ్యాస్ కనెక్షన్‌లు అందించాల్సిందిగా గుర్తించినట్టు చెప్పారు. వాటిలో రేషన్ షాపుల ద్వారా కిరోసిన్ తీసుకునే వారిని బట్టి షాపుల నుంచి వారికి దరఖాస్తులను అందజేసినట్టు తెలిపారు.