వై.కోట(ఓబులవారిపల్లె): మండలంలోని వై.కోట గ్రామంలో సోమవారం బాజరు నాగభూషణం అనే రైతుపై అడవి పంది దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి కథనం మేరకు.. గ్రామ సమీపంలోని అరటి తోటలో ఆకులు కోసేందుకు వెళ్లగా పెద్ద అడవి పంది ఒక్కసారిగా దాడిచేసింది. ఈ దాడిలో కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రైతుకు స్థానికులు రైల్వేకోడూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఎంపీపీ వెంకటేశ్వరరాజు గాయపడిన రైతును మంగళవారం పరామర్శించారు.