గ్రామదర్శినితో సమస్యలు వెలుగులోకి
ఆదిలాబాద్ రూరల్ : గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామదర్శిని కార్యక్రమంలో పలురకాల సమస్యలు అధికారుల దృష్టికి వచ్చారుు. శుక్రవారం మండలంలోని తంతోలి గ్రామంలో గ్రామ దర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, వైస్ ఎంపీపీ గంగారెడ్డిలు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. తంతోలి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గదులు శిథిలావస్థకు చేరుకున్నాయాని, అలాగే అంగన్‌వాడీ భవనం శిథిలావస్థలో ఉన్నదని గ్రామస్తులు ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం సొసైటీగూడ గ్రామంలోని పాఠశాలలో రెగ్యులర్ టీచర్‌కు బదులుగా వారి కుటుంబ సభ్యులు విధులకు మాజరవుతున్నట్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, వైస్ ఎంపీపీ గంగారెడ్డిలు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోని, వాటిని పరిష్కరించడమే గ్రామ దర్శిని ముఖ్య ఉద్దేశ్యామన్నారు. వీరి వెంట మండల ప్రత్యేకాధికారి రాజేందర్, ఎంపీడీవో రవిందర్, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఛత్రుదాస్, ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్ మాడా నాన, ఎంఈవో జయశీల, ఐకేపీ ఏపీఎం స్వామి, ఏపీవో శామ్యూల్, యంసీవో నరేందర్, గ్రామస్తులు స్వామి, మల్లేష్, వెంకటి, తదితరులు ఉన్నారు.
నార్నూర్: సమస్యల పరిష్కారమే గ్రామదర్శిని ముఖ్య ఉద్దేశ్యమని శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రాంకిషన్ నాయక్ అన్నారు. తహసీల్దార్ ముంజం సోము, జడ్పీటీసీ రూపావతిజ్ఞానోబా పుస్కర్, సర్పంచ్ బానోత్ గజానంద్‌నాయక్, ఏంఈవో జాదవ్ మధుకర్, పీఆర్ ఏఈ లింగన్న, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఉమాదేవి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ శ్రీనివాస్, హెచ్‌ఈవో రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.
జైనథ్ : ఉపాద్యాయులు అత్యంత బాధ్యతతో పనిచేయాలని డీఈవో లింగయ్య అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని బహాదూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ దర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. ఆయన అంగన్‌వాడీ కేంద్రం, రేషన్ డీలర్ షాపులను తనిఖీ చేసారు. అంగన్‌వాడీ కార్యకర్త చిన్నారుల హాజరు శాతంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని ఎంఈవో రాజశంకర్‌ను ఆదేశించారు. సర్పంచ్ వెంకటమ్మ, ఎంఈవో రాజశంకర్, ఏవో వివేక్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ ఝాన్సీ, ఏపీఎం శుద్దోదన్, ఏపీఓ గంగాధర్, కార్యదర్శి మల్లేష్, వీఆర్వో అనసూయ, గ్రామస్తులు పాల్గొన్నారు.
బేల : మండలంలోని బాది గ్రామంలో శుక్రవారం గ్రామదర్శిని కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారి రాథోడ్ రామరావు, స్థానిక మండల అధికారులతో కలిసి నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, స్థాని క సమస్యలు తదితర వాటిపై ఆరా తీశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని, స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. రాథోడ్ రామారావు మాట్లాడుతూ లోటుపాట్లు, అభివృద్ధి పనుల వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నా రు. ఆదిలాబాద్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీ ఏ పుల్లయ్య, ఎంపీడీవో నేరల్‌వార్ మహేందర్ కుమార్, ఎంఈవో కోల నర్సింలు, పశు వైద్యాధికారి కాంబ్లే సిద్ధార్థ, అధికారులు, ఏఈలు, సిబ్బంది, గ్రామ పంచాయతీ పాల్గొన్నారు.