Gramadarsini
-
మేమేసిన రోడ్లపై నడవొద్దు
మీరు మా పార్టీ వారు కాదు..మీరు మాకు ఓట్లు వేయలేదు..మీకు సమాధానం చెప్పాల్సినఅవసరం నాకు లేదు..అసలు నేను వేయించిన రోడ్లపై నడవొద్దు..మీకు దిక్కున్నచోట చెప్పుకోండి. ఇది సమస్యల పరిష్కారం కోరుతూ తన వద్దకు వచ్చిన రైతులపై కొండపి శాసన సభ్యుడు స్వామి చేసిన వ్యాఖ్యానాలివి. పొన్నలూరు మండలం పెదవెంకన్నపాలెంలో శుక్రవారం జరిగిన గ్రామదర్శిని–గ్రామ వికాసం కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం, పెద వెంకన్నపాలెం(పొన్నలూరు): గ్రామదర్శిని–గ్రామ వికాసం కార్యక్రమంలో పాల్గొనేందుకు కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి శుక్రవారం మండలంలోని పెదవెంకన్నపాలెం వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన నల్లూరి రమేష్‌తో పాటు పలువురు రైతులు తమకు రుణమాఫీ డబ్బులు బ్యాంకు ఖాతాలకు జమ కాలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీనికి ఆయన ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు పార్టీ కార్యక్రమమని, తాను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అసలు మా పార్టీ వారు కాదంటూ అని పరుష పదజాలంతో వాడు, వీడు అంటూ దూషించారు. మీకు దిక్కున్న వారికి చెప్పుకోండన్నారు. పైగా మీరు మాకు ఓటు కూడా వేయలేదని ఎదురు ప్రశ్నించారు. దీనిపై రైతులు మాట్లాడుతూ మీరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి అయి ఉండి సమస్యలను పరిష్కరించమని మీ దృష్టికి తీసుకుని వస్తే ఈ విధంగా మాపై ఆగ్రహం వ్యక్తం చేయడమేమనిటని నిలదీశారు. తరువాత ఈ సంఘటనను చిత్రీకరిస్తున్న వారిపై, ప్రశ్నించిన వారిపై పోలీసులను ఎమ్మెల్యే ఉసిగొల్పి వారి నోరు నొక్కే ప్రయత్నం చేశారు. సమస్యలను పరిష్కరించాలని అడిగిన గ్రామస్తులకు పార్టీలను అంటగడుతూ మీరు నాకు ఓటు వేయలేదు. నేను వేసిన రోడ్ల పై మీరు నడవద్దంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో అధికార పార్టీ నాయకులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. నీవేమైనా సొంత డబ్బులతో రోడ్లేశావా ప్రజల సొమ్ముతో వేసిన రోడ్ల పై నడవద్దని ఎలా చెప్తావని ప్రజలు ఎమ్మెల్యే పై తమ ఆగ్రహం వెళ్లగక్కారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వీరకుమారి, మాజీ ఎంపీపీ కొండ్రగుంట శ్రీనివాసరావు, కర్ణా కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇలా వచ్చి..అలా వెళ్లిన గంటా..
సాక్షి, విశాఖపట్నం : గ్రామంలో జరిగిన అభివృద్ధిని పరిశీలించడం.. ఇంకా చేయాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించడం.. గ్రామసీ మల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఏం చేస్తుం దో చెప్పుకోవడం..ఇదీ గ్రామదర్శిని కార్యక్రమ ఉద్దేశ్యం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పాయకరావుపేట నియోజకవర్గం ఎస్. రాయవరం మండలం గుడివాడలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమం ఇందుకు భిన్నంగా సాగింది. పల్లెల నుంచి అంతర్జాతీయ రాజకీయాల వరకు ఊకదంపుడు ఉపన్యాసాలతో సాగడంతో జనం అసహనం వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీతో సహా మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం సీఎం కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. దీంతో సీఎం పర్యటన ఫ్లాప్ షోగా మిగిలింది. వినతుల స్వీకరణకు దూరం తొలుత గుడివాడ శివారు కొత్తపోలవరం ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ క్లాస్రూమ్, అంగన్వాడీ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం ఇంకా పూర్తి కాని రూ.16 కోట్లతో చేపట్టిన అడ్డురోడ్డు –రేవు పోలవరం రోడ్డును ప్రారంభించారు. గుడివాడ ఎస్సీ కాలనీలో ముచ్చటగా మూడిళ్లకు వెళ్లి గ్రామదర్శిని మమ అనిపించారు. సీఎం తమ ఇళ్లకు వస్తారని ఆశగా ఎస్సీ కాలనీ వాసులు ఎదురు చూసినా వారి ఆశలను నీరుగారుస్తూ నేరుగా రచ్చబండ వేదిక వద్దకు వెళ్లారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజలతో కొద్దిసేపు ముచ్చటించారు. మీ సమస్యలు తెలుసుకునేందుకే వచ్చానన్న చంద్రబాబు కనీసం సమీప ప్రాంత ప్రజల వినతులు తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదు. ధ్యాహ్నం 2.45గంటలకు బహిరంగ సభ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఒకరిద్దరు లబ్దిదారులతో మాట్లాడించిన చంద్రబాబు ఆ తర్వాత తనదైన ఉపన్యాస ధోరణిలో ప్రసంగించారు. దీంతో కొద్దిసేపటికే దాదాపు గ్యాలరీలన్నీ ఖాళీ అయిపోయాయి. సర్పంచ్‌లకు అవమానం గ్రామదర్శిని కార్యక్రమం తీరుకు సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర నిరసన వ్యక్తమైంది. రచ్చబండ గుడివాడలోనూ, బహిరంగ సభ ఉప్పలం గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది. గుడివాడ సర్పంచ్‌ను మినహా ఉప్పలం సర్పంచ్‌తో సహా పరిసర గ్రామాల సర్పంచ్‌లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంతో వారంతా మండిపడ్డారు. ఉప్పలం సర్పంచ్ వీర్ల రవిశంకర్ పార్టీ అధినేతపైనే నిప్పులు చెరిగారు. ‘నా గ్రామ పరిధిలో సభ పెట్టుకుని నన్నుమాట మాత్రంగానైనా పిలవలేదు.. నాతో పాటు నా గ్రామ ప్రజలందరినీ అవమాన పర్చాడు..’ అంటూ ఒంటికాలిపై లేచారు. ఇలా వచ్చి..అలా వెళ్లిన గంటా కొత్త పోలవరం ఎలిమెంట్రీ స్కూల్లో డిజిటల్ క్లాస్రూమ్ ప్రారంభ కార్యక్రమానికి విద్యాశాఖామంత్రిగా మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆలస్యంగా వచ్చిన గంటా నేరుగా రచ్చబండ వేదికపైకి వెళ్లి కొద్దిసేపు సీఎంకు కన్పించి వెళ్లిపోయారు. మరో వైపు పాడేరు, అరకు ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్, ఎంపీ అవంతి శ్రీనివాస్, జడ్పీ చైర్మన్ లాలంభవానీ తదితరులు ఈ కార్యక్రమానికి రాకపోవడం చర్చనీయాంశమయింది. బాబు వల్లే అగ్రిగోల్డ్ డబ్బులు రాలేదు చంద్రబాబు అడ్డుపడడం వల్ల అగ్రిగోల్డ్ డబ్బులు రూ.50 వేలు తనకు రాలేదని నక్కపల్లి మండలం చినతీనార్ల గ్రామానికి చెందిన చినఅప్పయమ్మ వాపోయింది. ప్రభుత్వం డబ్బులు తమకు వద్దు.. తమ డబ్బులు ఇప్పించండని మొర పెట్టుకుంది. -
కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుంది: కేఈ
వెల్దుర్తి (కర్నూలు): రాష్ట్రాన్ని అడ్డగోలు విభజన చేసిన కాంగ్రెస్‌కు పట్టిన గతే విభజన హామీలు మరిచిన బీజేపీకీ పడుతుందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఎల్. నగరం గ్రామంలో ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేవాదాయ శాఖ పరిధిలో ఎస్జేఎఫ్ కింద ఆలయాల పునరుద్ధరణకు నిధులిస్తున్నామన్నారు. అనంతరం గ్రామంలో నిర్మించిన ఎన్టీఆర్ ఇళ్లను ప్రారంభించారు. అంతకుముందు రత్నపల్లె గ్రామం మీదుగా వస్తుండగా ఆ గ్రామస్తులు తమకు లంచాలతో పింఛన్లు మంజూరు చేస్తున్నారని, మరుగుదొడ్ల బిల్లుల రాలేదని పలువురు గ్రామస్తులు.. డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, టీడీపీ నాయకులు ఎల్ఈ జ్ఞానేశ్వర్‌గౌడ్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రిని నిలదీసిన ప్రజలు
సాక్షి, కలసపాడు : గ్రామదర్శిని పేరుతో వైఎస్సార్ కడప కలసపాడులో టీడీపీ చేపట్టిన ప్రచారంలో ప్రజల నుంచి ఆందోళన వచ్చింది.మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతున్న సమయంలో ప్రజలు సమస్యలు లేవనెత్తారు.మండంలో భూ సమస్యలు పేరుకుపోయాయని వాటిని పరిష్కరించేందుకు తహసీల్దార్ చర్యలు తీసుకోవడంలేదని మంత్రికి తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే ఆన్లైన్ చేయడం లేదని, ఒకరి భూమిని మరొకరి పేరుతో ఆన్‌లైన్‌చేసి దానిని సవరించేందుకు వేల రూపాయలు గుంజుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ రేషన్‌కార్డులు అర్హులకు అందిస్తున్నామని చెప్పగా మహిళలు లేచి ఎక్కడ ఇస్తున్నారని మంత్రి ఆదిని ప్రశ్నించారు. వెంటనే మంత్రి తహసిల్దార్‌ను పిలిచి సమాధానం చెప్పమని ఆదేశించారు. మీరు చేసే తప్పులకు మేం ప్రజలతో మాటలు పడాలా అంటూ తహసీల్దార్ రాజేంద్రపై ఆగ్రహంవ్యక్తంచేశారు.ఈ సందర్భంగా మంత్రి ఆది మాట్లాడుతూ వారం రోజుల్లో ఆన్లైన్ సమస్యలు పరిష్కరిం చకపోతే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అంతకుముందు చెత్త నుంచి సంపద చేసే కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ∙కలసపాడులో ప్రవహిస్తున్న తెలుగు గంగ ఎడమ ప్రధాన కాలువకు మాజీ మంత్రి బిజవేములు వీరారెడ్డి పేరును పెట్టారు. దీనిపై విమర్శలు Ðð వెళ్లువెత్తాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి తెలుగుగంగ కాలువ త్వవించి గంగనీరు విడుదల చేస్తే ఆయన పేరు పెట్టకపోవడంపై పలువరు విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మార్కెటు యార్డు చైర్మెన్ రంతు, టీడీపీ నాయకులు రెడ్డెం వెంకటసుబ్బారెడ్డి తదిరులు పాల్గొన్నారు. -
అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్న చంద్రబాబు
-
గ్రామదర్శినితో సమస్యలు వెలుగులోకి
ఆదిలాబాద్ రూరల్ : గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామదర్శిని కార్యక్రమంలో పలురకాల సమస్యలు అధికారుల దృష్టికి వచ్చారుు. శుక్రవారం మండలంలోని తంతోలి గ్రామంలో గ్రామ దర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, వైస్ ఎంపీపీ గంగారెడ్డిలు ముఖ్యఅతిథిగా హజరయ్యారు. తంతోలి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గదులు శిథిలావస్థకు చేరుకున్నాయాని, అలాగే అంగన్వాడీ భవనం శిథిలావస్థలో ఉన్నదని గ్రామస్తులు ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం సొసైటీగూడ గ్రామంలోని పాఠశాలలో రెగ్యులర్ టీచర్‌కు బదులుగా వారి కుటుంబ సభ్యులు విధులకు మాజరవుతున్నట్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, వైస్ ఎంపీపీ గంగారెడ్డిలు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోని, వాటిని పరిష్కరించడమే గ్రామ దర్శిని ముఖ్య ఉద్దేశ్యామన్నారు. వీరి వెంట మండల ప్రత్యేకాధికారి రాజేందర్, ఎంపీడీవో రవిందర్, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఛత్రుదాస్, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ మాడా నాన, ఎంఈవో జయశీల, ఐకేపీ ఏపీఎం స్వామి, ఏపీవో శామ్యూల్, యంసీవో నరేందర్, గ్రామస్తులు స్వామి, మల్లేష్, వెంకటి, తదితరులు ఉన్నారు. నార్నూర్: సమస్యల పరిష్కారమే గ్రామదర్శిని ముఖ్య ఉద్దేశ్యమని శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రాంకిషన్ నాయక్ అన్నారు. తహసీల్దార్ ముంజం సోము, జడ్పీటీసీ రూపావతిజ్ఞానోబా పుస్కర్, సర్పంచ్ బానోత్ గజానంద్‌నాయక్, ఏంఈవో జాదవ్ మధుకర్, పీఆర్ ఏఈ లింగన్న, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉమాదేవి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ శ్రీనివాస్, హెచ్‌ఈవో రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. జైనథ్ : ఉపాద్యాయులు అత్యంత బాధ్యతతో పనిచేయాలని డీఈవో లింగయ్య అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని బహాదూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ దర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. ఆయన అంగన్వాడీ కేంద్రం, రేషన్ డీలర్ షాపులను తనిఖీ చేసారు. అంగన్వాడీ కార్యకర్త చిన్నారుల హాజరు శాతంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని ఎంఈవో రాజశంకర్‌ను ఆదేశించారు. సర్పంచ్ వెంకటమ్మ, ఎంఈవో రాజశంకర్, ఏవో వివేక్, ఐసీడీఎస్ సూపర్వైజర్ ఝాన్సీ, ఏపీఎం శుద్దోదన్, ఏపీఓ గంగాధర్, కార్యదర్శి మల్లేష్, వీఆర్వో అనసూయ, గ్రామస్తులు పాల్గొన్నారు. బేల : మండలంలోని బాది గ్రామంలో శుక్రవారం గ్రామదర్శిని కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారి రాథోడ్ రామరావు, స్థానిక మండల అధికారులతో కలిసి నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, స్థాని క సమస్యలు తదితర వాటిపై ఆరా తీశారు. అంగన్వాడీ కేంద్రాన్ని, స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. రాథోడ్ రామారావు మాట్లాడుతూ లోటుపాట్లు, అభివృద్ధి పనుల వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నా రు. ఆదిలాబాద్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడీ ఏ పుల్లయ్య, ఎంపీడీవో నేరల్‌వార్ మహేందర్ కుమార్, ఎంఈవో కోల నర్సింలు, పశు వైద్యాధికారి కాంబ్లే సిద్ధార్థ, అధికారులు, ఏఈలు, సిబ్బంది, గ్రామ పంచాయతీ పాల్గొన్నారు. -
జవాబుదారీతోనే సత్ఫలితాలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: స్మితాసబర్వాల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే పాలన యంత్రాంగాన్ని గాడిలో పెట్టారు. సమీక్షలు, క్షేత్ర స్థాయి పర్యటనలతో అధికారులు, సిబ్బందికి బుల్లెట్ వేగంతో దిశానిర్దేశం చేస్తున్నారు. విద్య, ఆరోగ్యం తన ప్రాధాన్యతలని చెప్తున్నా, అన్ని విభాగాల పనితీరుపై సమ స్థాయిలో దృష్టి సారించారు. ప్రజావాణిని ప్రక్షాళన చేయడంతో పాటు ‘మార్పు’, ‘సన్నిహిత’ వంటి కార్యక్రమాలతో ప్రజలు, అధికార యంత్రాంగాన్ని పాలనలో భాగస్వాములను చేస్తున్నారు. సమయపాలన, సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ చొరవతో పనిచేయాలని నిక్కచ్చిగా చెప్తున్నారు. సుమారు రెండు నెలల్లోనే జిల్లా పాలన యంత్రాంగంపై తనదైన ముద్ర వేసిన కలెక్టర్‌తో ‘సాక్షి ప్రతినిధి’ ముఖాముఖి. సాక్షి: ‘గ్రీవెన్స’లో పరిష్కారం కాకుంటేనే మీ వద్దకు రావాలనడం ఎంతవరకు సమంజసం? కలెక్టర్: ‘గ్రీవెన్స సెల్’లో వచ్చే సమస్యల పరిష్కారానికి ఇంతకంటే మెరుగైన మార్గం లేదని భావిస్తున్నా. నేరుగా కలెక్టర్‌ను కలిస్తేనే సమస్యలు పరిష్కారమవుతుందనేది తప్పుడు అభిప్రాయం. వ్యక్తి కేంద్రంగా నడిచే వ్యవస్థ ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండదు. అన్ని ప్రభుత్వ విభాగాలు కలిసి కట్టుగా, జవాబుదారీతనంతో పనిచేయాలి. బృందంగా పనిచేయలేక పోతే ఫలితాలు సాధించలేం. ప్రజావాణిలో వచ్చిన విజ్ఞాపన 30 రోజుల్లో పరిష్కారం కాలేదంటే అధికారి ఫెయిల్యూర్‌గానే భావించాల్సి ఉంటుంది. అప్పుడు నేను కలెక్టర్‌గా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరు, ముగ్గురిని మినహాయిస్తే అందరూ విజ్ఞాపనల పరిష్కారం మీద దృష్టి పెడుతున్నారు. నాతో పాటు జాయింట్ కలెక్టర్, అదనపు జేసీ కూడా ఠమొదటిపేజీ తరువాయి ఎప్పటికప్పుడు ప్రజావాణి విజ్ఞప్తుల పరిష్కారంపై సమీక్ష చేస్తున్నాం. మండల స్థాయిలోనూ ఎంపీడీఓ, తహశీల్దార్ తదితరులు ఒకేచోట నుంచి విజ్ఞాపనలు తీసుకుంటున్నారు. ప్రజలు మండల స్థాయిలోనే ‘గ్రీవెన్స సెల్’కి వెళ్లాల్సిందిగా సూచిస్తున్నాం. మండల స్థాయిలో పరిష్కారం కానిపక్షంలోనే కలెక్టరేట్‌కు రావాలన్నది నా ఉద్దేశం. సాక్షి: ‘గ్రామదర్శిని’ మొక్కుబడిగా జరుగుతుందనే ఫిర్యాదులున్నాయి? కలెక్టర్: క్షేత్ర స్థాయిలో నెలకొన్న అనేక సమస్యలు గ్రామదర్శిని ద్వారా మా దృష్టికి వస్తున్నాయి. గ్రామాలకు వెళ్తున్న బృందాల నుంచి నివేదికలు తీసుకుని విశ్లేషిస్తున్నాం. దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలు, నిధుల విడుదలతో ముడిపడిన అంశాలకు తక్షణ పరిష్కారం వస్తుందని చెప్పలేం. గ్రామదర్శినిలో లేవనెత్తిన సమస్యలను సంబంధిత విభాగాలకు పంపిస్తున్నాం. ప్రజలు లేవనెత్తిన సమస్యలు పరిష్కారమయ్యాయా లేదా అనే అంశంపై ప్రతీ వారం సమీక్ష జరుపుతున్నాం. సాక్షి: ‘మార్పు’పై క్షేత్రస్థాయిలో ఇంకా అవగాహన ఏర్పడినట్లు లేదు? కలెక్టర్: మొదటిసారిగా స్వయం సహాయక సంఘాలను భాగస్వాములను చేస్తూ ‘మార్పు’ను చేపడుతున్నాం. ప్రస్తుతం అవగాహన కలిగించే దిశలో అనేక శిక్షణ కార్యక్రమాలు చేపట్టాం. అధికారుల స్థాయిలో సమావేశాలు ముగిశాయి. నెలాఖరుకు గ్రామస్థాయిలో అవగాహన సమావేశాలు ముగిసేలా షెడ్యూలు రూపొందించాం. జనవరి, పిబ్రవరి వరకు ‘మార్పు’ ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. గర్భిణుల నమోదు, ప్రసూతికి ఎక్కడకు వెళ్తున్నారు. టీకాలు, చిన్నారుల పెరుగుదల, అభివృద్ధి తదితర అంశాలపై మహిళలకు విస్తృతస్థాయిలో అవగాహన కల్పించాలన్నదే ఉద్దేశం. ప్రజలు, ప్రభుత్వ విభాగాల సమన్వయంతోనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. సాక్షి: ‘సన్నిహిత’పై మీ అంచనాలేమిటీ? కలెక్టర్: ప్రాథమికంగా సంక్షేమ హాస్టళ్ల పనితీరు మెరుగుపరిచేందుకే ‘సన్నిహిత’ అమలు చేస్తున్నాం. కొత్తగా నిధులు, నిర్మాణాలు చేపట్టడం ఈ కార్యక్రమం ఉద్దేశం కాదు. విద్యాపరంగా, సౌకర్యాలపరంగా హాస్టళ్లను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యం. వార్డెన్లు స్థానికంగా ఉంటున్నారా; మెనూ సక్రమంగా అమలవుతోందా, ప్రత్యేక తరగతులు జరుగుతున్నాయా, విద్యార్థుల హాజరు శాతం, ఫలితాల సాధన ఎలా ఉందనే కోణంలో సన్నిహిత అధికారులు చొరవ చూపుతారు. సాంఘిక సంక్షేమ శాఖ జేడీ సన్నిహిత కార్యక్రమం సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. హాస్టళ్లలో పారిశుద్ధ్యం, విద్యార్థుల ఆరోగ్యం, చదువుల్లో రాణింపు వంటి అంశాలు మెరుగవుతాయని ఆశిస్తున్నా. పరిశ్రమల నుంచి వచ్చే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ ద్వారా సౌకర్యాలను మెరుగుపరుస్తాం. సాక్షి: పరిశ్రమల నుంచే సీఎస్ఆర్ నిధిసక్రమంగా వసూలు కావడం లేదు కదా? కలెక్టర్: గడిచిన రెండు, మూడేళ్లుగా సీఎస్ఆర్ నిధి సక్రమంగా వసూలు కావడం లేదు. ప్రస్తుత డిమాండు ప్రకారం కోట్లాది రూపాయలు పరిశ్రమల నుంచి రావాల్సి వుంది. కొన్ని పరిశ్రమలు సొంతంగా ఖర్చు చేసి సీఎస్ఆర్ కింద చూపుతున్నారు. ఇకపై కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ అనుమతి మేరకు పరిశ్రమలు సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేయాలి. మార్గదర్శకాలు కూడా సిద్ధం చేశాం. సాక్షి: ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు, అర్బన్డేపై దృష్టి పెట్టారు. కానీ నిధుల కొరత ఉందని సర్పంచ్‌లు చెప్తున్నారు? కలెక్టర్: గ్రామ పారిశుధ్య నిధుల కోసం ప్రత్యేక అకౌంట్ ఉందనే విషయం చాలామందికి తెలియదు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ నుంచి చిన్న పంచాయతీలకు పది వేల రూపాయలు ఇస్తున్నాం. మేజర్ పంచాయతీలకు అంతకంటే ఎక్కువే వస్తుంది. నిధుల కొరత ఎక్కడా లేదు. కూలీ చెల్లింపు, బ్లీచింగ్ కొనుగోలు వంటివి వీటితో చేయొచ్చు. నిధులు వినియోగించాల్సిన తీరుపై జిల్లా పంచాయతీ అధికారి ద్వారా అప్రమత్తం చేయడం జరిగింది. వున్న నిధులు సక్రమంగా వినియోగిస్తే మరిన్ని నిధులు కూడా ఇస్తాం. సాక్షి: సబ్సెంటర్లలో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులున్నాయి? కలెక్టర్: సబ్ సెంటర్లో వైద్య సిబ్బందిలో ఎవరో ఒకరు అందుబాటులో ఉండాల్సిందే. సబ్ సెంటర్లతో పోలిస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లేందుకు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. ఏఎన్ఎంల కొరత వుంది. పీహెచ్‌సీల్లో ప్రసవాలపై దృష్టి సారించాం. 45 మంది స్టాఫ్ నర్సులను ఇటీవలే నియమించాం. వచ్చే రెండు మూడు నెలల్లో ఫలితాలు కనిపిస్తాయి. సాక్షి: ఆస్పత్రులు, హాస్టళ్లలో ‘స్కైప్’ పర్యవేక్షణ ఎందాక వచ్చింది? కలెక్టర్: ఇంటర్నెట్ సమస్య వున్న ఆస్పత్రులు మినహాయిస్తే 51 పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో స్కైప్ విధానంలో పర్యవేక్షణ జరుగుతోంది. 255 సంక్షేమ హాస్టళ్లు ఉన్నా 30 నుంచి 40 బా లికల హాస్టళ్లలో స్కైప్ ప్రవేశపెట్టాలనుకుంటున్నాం. అయితే కంప్యూటర్ల కొరత వల్ల ఆలస్యమవుతోంది. కంప్యూటర్లు కొనుగోలు బాధ్యత జాయింట్ కలెక్టర్ శరత్ చూస్తున్నారు. సాక్షి: ఇంజినీరింగ్ విభాగాల పనితీరుపై అంతగా సమీక్ష లేదెందుకు? కలెక్టర్: నేను రాకమునుపు జిల్లాలో ఆదర్శ పాఠశాలల నిర్మాణం, జడ్పీ, మండల పరిషత్ ద్వారా చేపట్టిన పనులు పెండింగులో ఉన్నాయి. ఎందుకు అమలు కాలేదనే అంశంపై లోతైన సమీక్ష చేశాం. 2010-11 నుంచి మంజూరైన పనులు కూడా నేటికీ పూర్తి కాలేదు. ఇందుకు సంబంధించిన లెక్కలు ఉన్నాయి. గడిచిన ఐదేళ్లలో 25వేలకు పైగా పనులు చేపడితే, జిల్లా, మండల పరిషత్ పరిధిలో ఇంకా మూడు వేలకు పైగా పనులు ప్రారంభమే కాలేదు. డిసెంబర్ ఆఖరుకల్లా 2010-11 నుంచి 2012-13 మధ్యకాలంలో చేపట్టిన పనులు పూర్తి చేయాలి. 2013-14 పనుల పూర్తికి ఏప్రిల్ నెలాఖరు గడువు విధించాం. గడువులోగా మోడల్ స్కూళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సిందిగా ఆదేశించాం. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ తదితర విభాగాల్లో వివిధ పథకాల కింద చేపట్టిన పనుల పురోగతిపైనా సమీక్ష జరుగుతోంది. వారు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. సాక్షి: అధికారుల హాజరును మెరుగు పరిచేం దుకు ఏమేరకు చర్యలు తీసుకుంటున్నారు? కలెక్టర్: జిల్లాస్థాయి అధికారుల పనితీరు ఎంత ముఖ్యమో మండలస్థాయిలో అంతే ప్రాధాన్యత ఉంటుంది. అధికారులు పనిచేసే చోట ఎవరు ఉంటున్నారో లేదో అనే అంశాలను పరిశీలిస్తున్నాం. మండల స్థాయి అధికారులకు సంబంధించి ఇప్పటికే సమాచారం సేకరించాం. జిల్లా అధికారి స్థానికంగా లేనపుడు కింద స్థాయిలో పని ఎలా జరుగుతుంది. ముఖ్యమైన ప్రభుత్వ శాఖల అధికారులు స్థానికంగా ఉండాలన్నదే నా భావన. ఈ మేరకు అధికారులకు అడ్వైజరీ మెమోలు కూడా జారీ చేశాం. అధికారుల పనితీరుకు సంబంధించి వివిధ మార్గాల్లో సమాచారం సేకరించాం. పనిచేసే అధికారులకు ఎప్పుడూ నా ప్రోత్సాహం ఉంటుంది. కొందరు అధికారులను పనిగట్టుకుని పంపిస్తున్నాననే ప్రచారంలో వాస్తవం లేదు.