కాంగ్రెస్‌కు పట్టిన గతే  బీజేపీకి పడుతుంది: కేఈ | KE Krishnamurthy Comments On BJP Kurnool | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు పట్టిన గతే  బీజేపీకి పడుతుంది: కేఈ

Published Mon, Jul 30 2018 7:32 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

KE Krishnamurthy Comments On BJP Kurnool - Sakshi

మాట్లాడుతున్న కేఈ కృష్ణమూర్తి

వెల్దుర్తి (కర్నూలు): రాష్ట్రాన్ని అడ్డగోలు విభజన చేసిన కాంగ్రెస్‌కు పట్టిన గతే విభజన హామీలు మరిచిన బీజేపీకీ పడుతుందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఎల్‌. నగరం గ్రామంలో ఆర్‌డీఓ హుస్సేన్‌ సాహెబ్‌ అధ్యక్షతన నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేవాదాయ శాఖ పరిధిలో ఎస్‌జేఎఫ్‌ కింద ఆలయాల పునరుద్ధరణకు నిధులిస్తున్నామన్నారు. అనంతరం గ్రామంలో నిర్మించిన ఎన్టీఆర్‌ ఇళ్లను ప్రారంభించారు.

అంతకుముందు రత్నపల్లె గ్రామం మీదుగా వస్తుండగా ఆ గ్రామస్తులు తమకు లంచాలతో పింఛన్లు మంజూరు చేస్తున్నారని, మరుగుదొడ్ల బిల్లుల రాలేదని పలువురు గ్రామస్తులు.. డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, టీడీపీ నాయకులు ఎల్‌ఈ జ్ఞానేశ్వర్‌గౌడ్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement