ఇళ్ల మధ్య మద్యం దుకాణం సరికాదు
నల్లమాడ : నివాస గృహాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మహిళలు తేల్చి చెప్పారు. శుక్రవారం స్థానిక గంగా సినిమా థియేటర్ కూడలిలో మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక మహిళలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి, ఆందోళన చేపట్టారు. సీపీఐ, సీపీఎం మండల కార్యదర్శులు చంద్ర, గోవిందు వారికి మద్దతు పలికారు. మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఎదురయ్యే సమస్యలను తహసీల్దార్ ఏఎస్ హమీద్ బాషాకు మహిళలు విన్నవించారు. వారి సమస్యను నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు తహసీల్దార్ ఏఎస్ హమీద్ బాషా హామీ ఇచ్చారు. పుట్టపర్తి ఎక్సైజ్ సీఐ భీమలింగ, స్థానిక ఎస్‌ఐ కె.గోపీ, ఆర్‌ఐలు శ్రీధర్, నాగరాజు, ఆర్‌డీటీ ఏటీఎల్ రామాంజనేయులు, సీపీఎం మండల కార్యదర్శి గోవిందు, మహిళలు సమావేశంలో పాల్గొన్నారు.