women fires
-
ఇళ్ల మధ్య మద్యం దుకాణం సరికాదు
నల్లమాడ : నివాస గృహాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మహిళలు తేల్చి చెప్పారు. శుక్రవారం స్థానిక గంగా సినిమా థియేటర్ కూడలిలో మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానిక మహిళలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి, ఆందోళన చేపట్టారు. సీపీఐ, సీపీఎం మండల కార్యదర్శులు చంద్ర, గోవిందు వారికి మద్దతు పలికారు. మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఎదురయ్యే సమస్యలను తహసీల్దార్ ఏఎస్ హమీద్ బాషాకు మహిళలు విన్నవించారు. వారి సమస్యను నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు తహసీల్దార్ ఏఎస్ హమీద్ బాషా హామీ ఇచ్చారు. పుట్టపర్తి ఎక్సైజ్ సీఐ భీమలింగ, స్థానిక ఎస్ఐ కె.గోపీ, ఆర్ఐలు శ్రీధర్, నాగరాజు, ఆర్డీటీ ఏటీఎల్ రామాంజనేయులు, సీపీఎం మండల కార్యదర్శి గోవిందు, మహిళలు సమావేశంలో పాల్గొన్నారు. -
మద్యం దుకాణాలపై మహిళ కన్నెర్ర
అనంతపురం సెంట్రల్ : జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంపై మహిళలు కన్నెర్ర చేశారు. జిల్లా కేంద్రంలోని నడిమివంక సమీపంలోని రెండు మద్యం దుకాణాలపై దాడి చేశారు. సీసీ కెమెరాలు, సామగ్రిని ధ్వంసం చేశారు. గత కొద్దిరోజులుగా నడిమివంకలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను తొలగించాలని మహిళా సంఘాలు, వైఎస్సార్సీపీ, సీపీఎం, ముస్లిం మైనార్టీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సదరు మద్యం దుకాణాలు ఓ మంత్రి అనుచురుడిది కావడంతో వాటిని తొలగించేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. బుధవారం ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ముట్టడించారు. తొలుత జనశక్తినగర్ నుంచి ర్యాలీగా వచ్చారు. అనంతరం మద్యం దుకాణాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అయితే ఆందోళన చేస్తున్నా మద్యం దుకాణాల్లో వ్యాపారాలు సాగుతుండడంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మద్యం షాపులకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, వాటర్ప్యాకెట్లు నిల్వ ఉంచిన డ్రమ్ములు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మణి, జిల్లా కార్యదర్శి సుహాసిని మాట్లాడుతూ.. ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనురుగా పరిగణిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జనావాసాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి మహిళలు నివసించే పరిస్థితి లేకుండా చేస్తున్నారన్నారు. మహిళల ఆందోళనలకు వైఎస్సార్సీపీ జిల్లా అధికారప్రతినిధి చింతకుంట మదు, సంఘం అధ్యక్షులు వీరనారప్ప, ఉపాధ్యక్షులు బాషా తదితరులు మద్దతు పలికారు. అదేవిధంగా గుత్తి పట్టణంలోని అనంతపురం రోడ్డులో ఒకేచోట ఐదు మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మహిళలు రాస్తారోకో చేశారు. శాంతియుతంగా సాగుతున్న నిరసనకారులపై మద్యం దుకాణం నిర్వాహకులు శ్రీనివాసులు, వలి, నారాయణస్వామిలు తమ అనుచరులతో కలిసి పోలీసుల సమక్షంలోనే రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ నాయకుడు జానప్పతోపాటు పలువురు మహిళలు గాయపడ్డారు. అనంతరం ఆందోళనకారులు పోలీసులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
భగ్గుమంటున్న మహిళాలోకం
– జనావాసాల్లో మద్యం షాపుల ఏర్పాటుపై ఆగ్రహం – జిల్లా వ్యాప్తంగా నిరసనలు అనంతపురం సెంట్రల్ : జనావాసాల మధ్య మద్యం షాపుల ఏర్పాటు చేస్తుండటంపై మహిళాలోకం భగ్గుమంటోంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలు కొనసాగుతున్నాయి. అనంతపురంలో గుత్తిరోడ్డులో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించకపోతే ధ్వంసం చేస్తామంటూ మహిళల సీపీఐ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి చింతకుంట మధు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని కలిసి నివాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న మద్యుం దుకాణాలను తొలగించాలని ఫిర్యాదు చేశారు. గుత్తిలో మద్యంషాపుపై మహిళలు దాడికి యత్నించారు. గోడలను ధ్వంసం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో మహిళలకు ఇబందులు కలిగించేలా ప్రభుత్వం మద్యం షాపులను ఏర్పాటు చేస్తోందని అనంత మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. తనకల్లు, రాయదుర్గం, ఉరవకొండలో మద్యం షాపుల ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉరవకొండలో రంగావీధి ప్రజలు చేపట్టిన ఆందోళనలకు వైఎస్సార్సీపీ నేతలు మద్దతు తెలిపారు. -
ఆడోళ్లను మోసం చేసి బాగుపడ్డోళ్లు లేరు
సీఎంపై ధ్వజమెత్తిన మహిళలు రైతు భరోసా యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలకు ముందు రుణాలను మాఫీ చేస్తామని నమ్మబలికి అధికారం చేపట్టిన చంద్రబాబు ఆడోళ్లను మోసం చేశారని డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. తమను మోసం చేసి బాగుపడ్డోళ్లు లేరని శాపనార్థాలు పెట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఉద్దేహాళ్‌లో శనివారం సాయంత్రం ప్రతిపక్ష నేత జగన్ డ్వాక్రా మహిళలు, రైతులు, నిరుద్యోగులతో ముఖాముఖి జరిపి వారి వేదనలను తెలుసుకున్నారు.అవి ఇలా... పది పైసలు సాయం రాలే... ‘‘సారూ...నా పేరు గుణావతి. డ్వాక్రా గ్రూపు ద్వారా రూ.10 వేలు రుణం తీసుకుంటి. చంద్రబాబు చెప్పినాడని అప్పు కట్టకపోతి. ఇప్పుడేమో వడ్డీలకు వడ్డీలు కలిపి కట్టమంటిరి. ఈ పొద్దు ఆ పొద్దు నోటీసుల పంపుతుంట్రి. రూ.3 పైనే వడ్డీ అయినాది. నా తాన చిల్లిగవ్వ లేదు. అప్పు కట్టే పరిస్థితి లేకపోయె. పది పైసల సాయం కూడా రాలే. ఎట్టా బతకాలో అర్థం కావడం లేదు.’’ - గుణావతి (70 ఏళ్లు), హరే సముద్రం రుణమాఫీ గురించి బాబునే అడగమంటిరి ‘‘ఎంతో ఆశ పడి ఓటేస్తే నిలువునా ముంచేసినాడు. పాస్‌బుక్‌తో పనుండి బ్యాంకుకు వెళితే అప్పులన్నీ కట్టాకే రావాలంటున్నారు. రుణమాఫీ గురించి అడిగితే... హైదరాబాదెళ్లి చంద్రబాబునే అడగమంటిరి.’’ - లోకేష్, కళహొళ చంద్రబాబుది నిండా మోసం... ‘‘చంద్రబాబుది నిండా మోసమయ్యా. అప్పులు తీరక మా గ్రామం గొల్లు మంటుంది. బాబు నిజంగానే సముద్రంలో ముంచేసినాడు.’’ - పార్వతమ్మ (60 సంవత్సరాలు),కురివెళ్లి