వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపిద్దాం | work for ysrcp candidates victory | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపిద్దాం

Published Sat, Mar 4 2017 11:30 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపిద్దాం - Sakshi

వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపిద్దాం

– గంగుల ప్రభాకర్‌ రెడ్డి
ఆళ్లగడ్డ: పట్టభద్రుల, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిద్దామని ఆ పార్టీ నేత గంగుల ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని గంగుల నివాసంలో శనివారం పార్టీ నియోజవర్గ విస్తృత స్థాయి తొలి సమావేశం నిర్వహించారు. నియోజవర్గంలోని ఆరు మండాలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున పట్టభద్రుల అభర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేవీ సుబ్బారెడ్డి, స్థానిక సంస్థల అభ్యర్థిగా పోటీచేస్తున్న గౌరు వెంకటరెడ్డిలను గెలిపించాలని ప్రతినబూనారు.
 
ఈ సందర్భంగా గంగుల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొనేలా చూడాలన్నారు. త్వరలో గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని గద్దెదించి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే వరకు అలుపెరగని పోరాటం చేసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు గంధం రాఘవరెడ్డి, ఇందూరు ప్రభాకర్‌రెడ్డి, బాబూలాల్, బాచిపల్లెనారాయణ, గుండా మణి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement