gangula
-
TS Election 2023: ఎన్నికలు వస్తున్నాయ్..! కేసీఆర్ సీఎం అవడం ఖాయం..! : మంత్రి గంగుల
కరీంనగర్: కరీంనగర్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. విదేశాల నుంచి మన దేశానికి వచ్చే పర్యాటకులు కరీంనగర్‌ను ఎంచుకునేలా నగరం మారబోతోందన్నారు. నూతనంగా నిర్మించిన గణేశ్‌నగర్ బైపాస్ రోడ్డును గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్‌పై వీధి దీపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. భావితరాలకు అద్భుతమైన నగరాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల్లోగా ఎల్ఎండీ నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు నీటిని నిలిపి, బోటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్ తనకు ఇష్టమైన ప్రాజెక్టు అని, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందబోతుందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన ఫౌంటెయిన్లలో మొదటిది యోషోలో, రెండోది చైనాలో ఉన్నాయని, మూడోది కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్‌లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తనకు ఎలాంటి స్వార్థం లేదని, నగర అభివృద్ధి, ప్రజల సంతోషమే ముఖ్యమన్నారు. గణేశ్‌నగర్ రోడ్డుకు డ్రైనేజీతో సమస్య ఉండేదని, అయితే దాన్నే మాయం చేయాలన్న ఆలోచనతో రోడ్డు నిర్మించామని తెలిపారు. నగరంలో మరో రూ.130 కోట్లతో అంతర్గత రోడ్లు నిర్మిస్తామన్నారు. కేసీఆర్.. మరోసారి సీఎం.. ఎన్నికలు వస్తున్నాయని, కేసీఆర్ మరోసారి సీఎం అవడం ఖాయమని మంత్రి గంగుల అన్నారు. మేయర్ యాదగిరి సునీల్‌రావు మాట్లాడుతూ.. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న గణేశ్‌నగర్ బైపాస్ రోడ్డును మంత్రి చేతులమీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహిళా వాకర్స్ ఇబ్బంది పడకుండా అంబేడ్కర్ స్టేడియంలో లైట్లు, ప్రత్యేకంగా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామన్నారు. కలెక్టర్ గోపి మాట్లాడుతూ.. కరీంనగర్ ప్రణాళిక ప్రకా రం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. తాను తమిళనాడుతోపాటు తెలంగాణలోని పలు పట్ట ణాలను చూశానన్నారు. కానీ కరీంనగర్ బా గుందని పేర్కొన్నారు. అంతకుముందు మంత్రి, మేయర్లకు కాలనీవాసులు మంగళహారతులతో స్వాగతం పలికి, సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. -
మంత్రి గంగుల, ఎంపీ గాయత్రీ రవికి సీబీఐ నోటీసులు
-
అయ్యన్న లాంటి బఫూన్ ని పట్టించుకోనవసరం లేదు
-
కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప సామాజిక వేత్త
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప సామాజిక వేత్త అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ 106వ జయంతి ఉత్సవాలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర ఉద్యమం, నిజాం వ్యతిరేక పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న గొప్ప వ్యక్తి బాపూజీ అని దత్తాత్రేయ కొనియాడారు. అలాంటి వ్యక్తితో కలసి పనిచేసే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బాపూజీ తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను, గొప్పదనాన్ని భవిష్యత్ తరాలకు తెలిపే రీతిలో అధికారికంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. కార్య క్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం పాల్గొన్నారు. స్పీకర్ నివాళి స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి వేడుక శాసనసభ భవనంలోని ఆడిటోరియం హాల్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ బాపూజీ చిత్ర పటానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ
– పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులా ? - దమ్ముంటే రాజీనామ చేయించి గెలిపించుకోవాలి - ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్సీ గంగుల సవాల్ ఆళ్లగడ్డ : రాజ్యాంగానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చి ప్రజాసా్వమ్యాన్ని ఖూనీ చేశారని ఎమ్మెల్సీ గంగుల ప్రతాప్‌రెడ్డి మండిపడ్డారు.నోరు తెరిస్తే తాను నిప్పునని... నిజాయితీపరుడినని చెప్పుకునే బాబు ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువులా కొనుగోలు చేసి ప్రజా స్వామ్యాని్న పాతరేశారని చెప్పారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ నాడు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన తలసానికి మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్ పై, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారన్నారు. మరి ఇప్పుడు ఆయన ఏపీలో చేసింది అలాంటి తప్పుడు పనే కదా అని ప్రశ్నించారు. బాబు నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. దమ్ముంటే ఇప్పటికైనా జంపు జిలానీలతో రాజీనామ చేయించి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. -
వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపిద్దాం
– గంగుల ప్రభాకర్ రెడ్డి ఆళ్లగడ్డ: పట్టభద్రుల, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిద్దామని ఆ పార్టీ నేత గంగుల ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని గంగుల నివాసంలో శనివారం పార్టీ నియోజవర్గ విస్తృత స్థాయి తొలి సమావేశం నిర్వహించారు. నియోజవర్గంలోని ఆరు మండాలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున పట్టభద్రుల అభర్థిగా పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేవీ సుబ్బారెడ్డి, స్థానిక సంస్థల అభ్యర్థిగా పోటీచేస్తున్న గౌరు వెంకటరెడ్డిలను గెలిపించాలని ప్రతినబూనారు. ఈ సందర్భంగా గంగుల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎక్కువ మంది ఓటింగ్‌లో పాల్గొనేలా చూడాలన్నారు. త్వరలో గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని గద్దెదించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే వరకు అలుపెరగని పోరాటం చేసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గంధం రాఘవరెడ్డి, ఇందూరు ప్రభాకర్‌రెడ్డి, బాబూలాల్, బాచిపల్లెనారాయణ, గుండా మణి తదితరులు పాల్గొన్నారు. -
ఆనందోత్సాహం
- గుంగల ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి - ప్రకటించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైస్ జగన్ మోహన్‌రెడ్డి - పార్టీ కార్యకర్తల్లో జోష్ సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎమ్మెల్యే కోటాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గంగుల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం గురువారం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటాలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ రెండు ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ రెండింటిలో జిల్లా నుంచి ఒకరికి స్థానం దక్కడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం గంగుల ప్రభాకర్‌రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.. నూతనోత్సాహం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తమ నేతకు ఎమ్మెల్సీ పదవి దక్కడంపై ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న రెండు పదవుల్లో ఒకటి జిల్లాకు కేటాయించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఉన్న ప్రేమ తాజా నియామకంతో మరోసారి తేటతెల్లమైందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా నుంచి పెద్దల సభకు గంగుల ప్రభాకర్‌రెడ్డి వెళ్లనున్న నేపథ్యంలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ పార్టీకి మరింత కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. భూమా కుటుంబానికి షాక్ వాస్తవానికి భూమా కుటుంబానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో పాటు పీఏసీ చైర్మెన్ పదవిని కూడా భూమాకు కట్టబెట్టారు. అయితే అధికార ప్రలోభాలకు తలొగ్గి భూమా కుటుంబం పార్టీ మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గం ఇన్చార్జ్ గంగుల ప్రభాకర్‌రెడ్డి వైస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. భూమాకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ ఊసే లేకుండా పోయింది. మరోవైపు గంగుల ప్రభాకర్‌రెడ్డి..పార్టీ మారిన కొద్ది రోజులకే ఎమ్మెల్సీ పదవి చేపట్టనుండటం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో తమ నేతకు ఏమాత్రం గౌరవం లభించడం లేదని భూమా వర్గీయులు వాపోతున్నారు. మరో వైపు గంగుల కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి రావడంతో గంగుల వర్గీయులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న తేడాను తాజాగా ఈ నియామకం మరోసారి స్పష్టం చేస్తుందని వ్యక్తమవుతోంది. -
అబద్ధానికి ప్రతిరూపం చంద్రబాబు
– ఆళ్లగడ్డ లో వైఎస్సార్సీపీకి పూర్వ వైభవం తెస్తాం-గంగుల – జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరేందుకు 200 వాహనాల్లో తరలి వెళ్లిన గంగుల వర్గం ఆళ్లగడ్డ: ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధానికి ప్రతిరూపమని, ఆయన నోటివెంట ఒక్క నిజం కూడా బయటకు రాదని టీడీపీ నియోజవర్గ ఇన్చార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బుధవారం తన అనుచరులతో హైదరాబాద్‌కు ఆళ్లగడ్డ నుంచి బయలు దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు అన్ని వర్గాల వారిని మోసం చేశారన్నారు. నమ్ముకున్న నాయకులను నిట్టనిలువున ముంచే స్వభావం బాబుది అని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఆయన మోసాలను భరించానన్నారు. అయితే, కార్యకర్తలకు అన్యాయం చేయలేకే పార్టీ వీడుతున్నామన్నారు. వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు అధికార పక్షాన్ని వదిలి ధైర్యంగా ప్రతిపక్ష పార్టీలో చేరుతున్నామన్నారు. వైఎస్జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను ఎండగట్టి నియోజవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. 200 వాహనాలతో బయలుదేరిన గంగుల ఆళ్లగడ్డ నుంచి గుంగుల ప్రభాకర్‌రెడ్డి కార్యకర్తలతో కలిసి సుమారు 200 వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. గంగులబిజేంద్రారెడ్డి, గంగుల సుభాస్‌రెడ్డి, చాగలమర్రి మండలం నాయకులు వీరభధ్రుడు, బాబులాల్, నారపురెడ్డి, ఉయ్యలవాడ మండలం నాయకులు గజ్జల కృష్ణారెడ్డి, అరికట్ల శివరామకృష్ణరెడ్డి, నారాయణమ్మ, నరసింహుడు, దొర్నిపాడు మండల నాయకులు నాగేశ్వరరావు, బాలవెంకటరెడ్డి, శేఖర్, వెంట్రామిరెడ్డి, రుద్రవరం మండల నాయకులు తిమ్మయ్య, బాచిపల్లె నారాయణ, నర్సిరెడ్డి, రాఘవరెడ్డి, తిరుపతిరెడ్డి, శిరివెళ్ల మండల నాయకులు నాగన్న, కృష్ణారెడ్డి, ఓబులకొండారెడ్డి, చిన్నగుర్రెడ్డి, ఆళ్లగడ్డ మండల నాయకులు బండిచంద్రుడు, శివనాగిరెడ్డి, జాఫర్రెడ్డి, వెంకటసుబ్బయ్య, నాసారివెంకటేశ్వర్లు తోపాటు 35 మంది ఎంపీటీసీలు, ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు, ఇద్దరు కౌన్సిలర్లు గంగుల వెంట వెళ్లారు. -
టీడీపీ కోటకు బీటలు
నేడు వైఎస్ఆర్సీపీలో చేరనున్న గంగుల - పార్టీ ముఖ్య నేతలతో సమావేశంలో నిర్ణయం - ఆళ్లగడ్డలో అధికార పార్టీకి ఎదురుదెబ్బ - వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజమని కార్యకర్తల మండిపాటు ఆళ్లగడ్డ: టీడీపీ ద్వంద్వ వైఖరితో కేడర్‌లో అసంతృప్తి జ్వాల రగులుతోంది. ఒక్కొక్కరుగా పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతుండటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆళ్లగడ్డలో రాజకీయంగా బలమైన గంగుల కుటుంబం టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా గత మంగళవారం రుద్రవరం, చాగలమర్రి, శిరివెళ్ల మండలాలు.. బుధవారం ఉయ్యాలవాడ, దొర్నిపాడు మండలాలు.. గురువారం ఆళ్లగడ్డ నగర పంచాయతీ, రూరల్ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో గుంగుల కుటుంబ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. తాజాగా మంగళవారం స్థానిక మహాలక్ష్మి కల్యాణ మండపంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల నాయకులు మాట్లాడుతూ విలువలు, విశ్వసనీయత లేని తెలుగుదేశం పార్టీలో ఉండలేమని.. తామంతా మీ వెంటే ఉంటామని ముక్తకంఠంతో చెప్పారు. ఎన్ని కష్టనష్టాలైనా ఎదుర్కొంటామని.. ముందుండి నడిపిస్తే టీడీపీకి తగిన బుద్ధి చెబుతామన్నారు. అడుగడుగునా అవమానాలే.. నియోజకవర్గంలో రెండు విడతల ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. అలాంటి సమయంలో గంగుల ప్రభాకర్‌రెడ్డి పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకున్నారు. ఆ తర్వాత నెల రోజుల్లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 35 ఎంపీటీసీ, మూడు జెడ్పీటీసీ స్థానాలతో పాటు మూడు మండలాల్లో ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోగలిగారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమిపాలైనా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు. అయితే పార్టీలోకి వలస నేతల రాకతో గంగుల కుటుంబాన్ని చంద్రబాబు దూరం పెట్టడం మొదలైంది. ఆయన వర్గానికి ఎలాంటి పనులు దక్కకుండా మరో వర్గం అడ్డుకోవడం.. కనీసం ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ప్రొటోకాల్ లేకపోవడం ఆ కుటుంబాన్ని బాధించింది. భూమా వర్గానికి చెందిన ఓడిపోయిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తుండటాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా మూడు నెలల నుంచి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం గంగులను మనస్థాపానికి గురిచేసింది. వలస నేతలకే బాబు మద్దతు గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు నాని ఎన్నికలు ముగిసినప్పటి నుంచి నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీకి, కార్యకర్తలకు అండగా నిలుస్తూ వచ్చారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులొచ్చినా తామున్నామంటూ భరోసానిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఫిరాయించిన నేతలకు అధిక ప్రాధాన్యతనిస్తూ మార్కెట్‌యార్డు చైర్మన్ పదవి, ఎన్టీఆర్ గృహాలు, పింఛన్లకు లబ్ధిదారుల ఎంపికలో ఆ వర్గానికే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం గంగుల కుటుంబాన్ని ఆలోచనలో పడేసింది. మార్కెట్ యార్డు చైర్మన్‌గా గంగుల వర్గానికి చెందిన రాఘవరెడ్డి పేరు ఖరారయిందని.. రేపోమాపో ప్రకటన వస్తుందన్న తరుణంలో భూమా వర్గానికి చెందిన బి.వి.రామిరెడ్డి పేరును ప్రకటించడం గంగుల కుటుంబం పార్టీ వీడేందుకు కారణమైంది. ఏదేమైనా రాజకీయాల్లో తల పండిన గంగుల కుటుంబం వైఎస్ఆర్సీపీలో చేరనుండటంతో ఆళ్లగడ్డ నియోజకవర్గంతో పాటు నంద్యాల పార్లమెంట్‌లోనూ ఆ ప్రభావం కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. -
టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు
చాగలమర్రి: రాయలసీమను దగా చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని మాజీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నేత గంగుల ప్రతాప్‌రెడ్డి మండి పడ్డారు. శుక్రవారం ఆయన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని చాగలమర్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమలో వర్షాల్లేక ప్రజలు అల్లాడుతుంటే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉంటే తప్ప దిగువకు నీరు విడుదల చేయరాదనే నిబంధనను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారను. వచ్చే అరకొర నీటిని కూడా స్వార్థంతో కోస్తాకు తరలించడం సీమ ప్రజలను మోసగించడమేనన్నారు. పాలకుల మాటకు తలొగ్గి నీళ్లు విడుదల చేస్తూ ఇంజనీరింగ్ అధికారులు కూడా తప్పు చేస్తున్నారని.. వీరిపై న్యాయస్థానానికి వెళ్లే హక్కు సీమ ప్రజలకు ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సిద్దేశ్వరం అలుగుతోనే సీమకు మేలు చేకూరుతుందన్నారు. ఇందుకోసం రాజకీయాలకు అతీతంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.