వాడో శాడిస్ట్...
కడప: తమ ఇంట్లో అద్దెకు దిగిన మహిళపై కన్నేశాడు యాజమాని కొడుకు. మాట మాట కలిపి ప్రేమలోకి దించాడు. మాయమాటలతో నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు. తనతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తూ కోరిక తీర్చుకునేవాడు. అక్కడితో ఆగకుండా శరీరాన్ని బ్లేడ్లతో కట్ చేసి శాడిజాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. అతగాడి శాడిజం శిఖరస్థాయికి చేరడంతో బాధితురాలు తన ఆవేదన బయటపెట్టింది.
వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఈ ఉదంతం వెలుగు చూసింది. పవన్ కుమార్ అనే యువకుడు కిరాతకానికి పాల్పడినట్టు బాధితురాలు ఆరోపించింది. ప్రేమ ముసుగులో తనకు శారీరకంగా దగ్గరయి, ఈ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె వాపోయింది. అతనో శాడిస్టని, తన శరీరాన్ని బ్లేడ్లతోకోసి శాడిజాన్ని ప్రదర్శిస్తూ పైశాచిక ఆనందం పొందేవాడని తెలిపింది. పవన్ బారి నుంచి తనను కాపాడాలని బాధితురాలు పోలీసులను వేడుకుంది.
నిందితుడు పవన్ కుమార్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ నవీన్ గులాటి తెలిపారు. అతడిపై మరికొన్ని ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు.