sadist
-
చీమల మందు తాగించి, బ్లేడ్‌తో కోసి..
రాజమహేంద్రవరం క్రైం: పోలీసుల దర్యాప్తులో శాడిస్టు తల్లి శారద రాక్షస కృత్యాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. సినిమాల్లోని సైకో పాత్రలను మించిన ఆమె క్రూరత్వాన్ని చూసి పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా తూర్పు మండలం డీఎస్పీ యు. నాగరాజు బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. రాజానగరం మండలం దివాన్ చెరువుకు చెందిన మచ్చా శారద తన కుమార్తె మహాలక్ష్మిపై బ్లేడ్‌తో దాడి చేసి హత్య చేసేందుకు యత్నించింది. శారద, శివ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె మహాలక్ష్మి కాగా, చిన్న కుమార్తె నాగేశ్వరి. శారద తనకు తానుగా బ్లేడ్‌తో గాయపరుచుకుని భర్త కొడుతున్నాడంటూ తల్లిదండ్రులకు చెప్పి అతడిపై పోలీసు కేసు పెట్టి విడాకులు తీసుకుంది. దివాన్ చెరువులోని ఒక హాటల్లో పనిచేస్తూ వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిద్దరూ తరచూ గొడవలు పడేవారు. ఆ కోపాన్ని శారద తన పిల్లలపై చూపేదని ఇరుగుపొరుగు వారు పేర్కొంటున్నారు. సోమవారం రాత్రి శారద హోటల్లో పని ముగించుకొని ఇంటికి వచ్చి పిల్లలతో కలిసి భోజనం చేసింది. అల్లరి చేస్తున్న మహాలక్ష్మిని తిట్టి మందలించింది. మహాలక్ష్మి ఇంటి బయట వాకిట్లోని నీళ్ళ డ్రమ్ముని కాళ్ళతో తన్ని నీళ్ళు ఒలకబోసింది. దీంతో శారద కోపంతో ఆ బాలికను కొట్టగా రాత్రి 10 గంటల ప్రాంతంలో బాలిక తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. శారద బాలిక వెనుకే తల్లి ఇంటికి వెళ్లి కుమార్తెను జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ తాను అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకు వచ్చింది. తన మాట వినడం లేదంటూ చీమల మందు నీటిలో కలిపి, ఆ నీటిని బలవంతంగా తాగించింది. కుమార్తె సృహ కోల్పోయాక ఆమెను హత్య చేయాలనేది శారద ఉద్దేశం. రాత్రి 12 గంటల సమయంలో కుమార్తెను భుజంపై వేసుకొని దివాన్ చెరువు అంబికా లేఅవుట్లోని పాత బ్రాందీ షాపు దగ్గరలోని శ్మశానం వద్దకు చేరుకుంది. అక్కడి తుప్పల్లోకి తీసుకు వెళ్ళి తువ్వాలును ముక్కలుగా చేసి కుమార్తె కాళ్లు, చేతులు కట్టి బ్లేడుతో బాలిక వంటిపై గాయపరచసాగింది. సృహలోకి వచ్చిన బాలిక ‘అమ్మా కోయవద్దు’ అంటూ కేకలు వేస్తూ బతిమిలాడింది. అయినా కనికరించకుండా గుడ్డలు నోట్లో కుక్కి ముఖంపైన, తలపైన, కాళ్లపైన, బాలిక మర్మావయవాలపైనా ఇస్టానుసారం కోసింది. సృహ కోల్పోయి పడిపోగానే మృతి చెంది ఉం టుం దని భావించి ఎవరికీ తెలియకుండా అర్ధ రా త్రి ఒం టి గంట సమయంలో శారద ఇంటికి చేరుకొంది. శరీరమంతా గాయాలతో అమ్మమ్మ ఇంటికి తెల్లవారుజామున బాలిక మహాలక్ష్మికి సృహ వచ్చింది . ఆమె అమ్మమ్మ ఇంటికి వెళ్ళి తాతయ్యకు జరిగిన విషయం చెప్పింది. అమ్మ వద్దకు తీసుకువెళ్ళవద్దని తాతయ్యను ప్రాధేయపడింది. దీంతో తాతయ్య ఆమె శరీరంపై గాయాలను డెట్టాల్‌తో శుభ్రం చేశాడు. కాగా తెల్లవారు జాము ఐదు గంటలకు శారద తన తండ్రి ఇంటికి వెళ్లి కుమార్తె కనిపించడం లేదంటూ చెప్పింది. దెబ్బలతో రాత్రి ఇంటికి వచ్చిందని, నిద్రపోతున్న లక్ష్మిని చూపించాడు. దీంతో నిందితురాలు శారద జరిగిన విషయం తండ్రికి చెప్పకుండా దాచింది. ఏమీ తెలియనట్టు నటిస్తూ తన తండ్రితో కలిసి కుమార్తెకు వైద్యం చేయించేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పటల్‌కు తీసుకు వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం సృహలోకి వచ్చిన బాలిక తల్లి తనపై చేసిన అఘాయిత్యం గురించి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మొదటి నుంచీ శాడిజమే మచ్చా శారద మొదటి నుంచీ శాడిజంతో ప్రవర్తించేందని పోలీసుల దర్యాప్తులో తేలింది. తల్లిదండ్రులతో గొడవ పడడం, తండ్రి చెవి కొరికేయడం, చెల్లి, తమ్ముడితో గొడవలు పడి, వారిని కొట్టేది. భర్త శివ కొట్టకపోయినప్పటికీ బ్లేడ్‌తో చేతుల మీద కొసుకొని వచ్చి తల్లికి భర్త కొట్టాడని చెప్పడంలో అది నిజమని నమ్మిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో భర్త శివపై ఫిర్యాదు చేసి అతని నుంచి విడాకులు తీసుకున్నారు. అనంతరం మరో ఇద్దరితో శారద వివాహేతర సంబంధం సాగించింది. భయంతో బాలిక బూచాడి కథ తాను కొట్టినట్టు ఎవరికైనా చెబితే చచ్చిపోతానని శారద తన కుమార్తె మహాలక్ష్మిని భయపెట్టింది. దీంతో ముసుగు వేసుకొని బూచాడు వచ్చి తనను గాయపరిచాడని ఆ బాలిక తొలుత పోలీసులకు చెప్పింది. అనంతరం అర్భన్ జిల్లా ఎస్పీ రాజకుమారి దర్యాప్తు చేపట్టి బాలిక నుంచి అసలు విషయం రాబట్టారు. బాలికకు వైద్యులు 103 కుట్లు వేశారు. విలేకరుల సమావేశంలో బొమ్మురు సీఐ మోహన్ రెడ్డి, ఎస్సై నాగబాబు, తదితరులు పాల్గొన్నారు. నిందితురాలు శారదను ఏడో ఏజేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. -
ఆ చాటింగ్స్‌ను యువతి తండ్రికి..
సాక్షి,సిటీబ్యూరో: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన యువతితో పాటు ఆమె తండ్రిని బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టాడో శాడిస్ట్. అతడి తీరు శృతిమించడంతో బాధితురాలు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. సోమవారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే..సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థినికి కొన్నాళ్ల క్రితం ఫేస్బుక్లో ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు చాటింగ్ చేసుకున్నారు. చనువు పెరగటంతో సదరు యువతి వ్యక్తిగత విషయాలనూ చాట్ చేయడం మొదలెట్టింది. అయితే పరీక్షలు సమీపిస్తున్నాయనే ఉద్దేశంతో ఆమె చాటింగ్‌కు దూరంగా ఉంది. దీంతో ఆమెను సోషల్‌మీడియా ద్వారా సంప్రదించిన ఆ యువకుడు తనతో చాటింగ్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. గతంలో చాటింగ్ ద్వారా చర్చించుకున్న వ్యక్తిగత విషయాలను మీ తండ్రికి పంపిస్తానంటూ బెదిరించేవాడు. తనకు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో తాను చదువుకోవాలని, అందుకే ప్రస్తుతం చాటింగ్ చేయలేనంటూ ఆమె వేడుకున్నా అతగాడు వినకుండా ఆ చాటింగ్స్‌ను యువతి తండ్రికి పంపాడు. అంతటితో ఆగకుండా తన ఇంట్లో ఎవరూ లేరని, మీ కుమార్తెను నాకు భోజనం పెట్టేందుకు పంపించాలంటూ యువతి తండ్రినే కోరడం మొదలెట్టాడు. చాటింగ్ హిస్టరీని సోషల్‌మీడియాలో పెట్టి మీతో పాటు మీ కుమార్తెను బజారుకు ఈడుస్తానంటూ బెదిరిస్తున్నాడు. ఇతడి వేధింపులు తారా స్థాయికి చేరడంతో బాధితురాలు సోమవారం సీసీఎస్ పోలీసులను ఆశ్రయించింది. బ్లాక్‌మెయిలింగ్ కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
‘చంద్రబాబు శాడిస్టు నయా ఫ్యాక్షనిస్టు’
-
‘చంద్రబాబు శాడిస్టు..నయా ఫ్యాక్షనిస్టు’
మడకశిర: రాష్ట్రంలో రౌడీరాజ్యం నడుస్తోందని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. రౌడీయిజం చేయడంలో టీడీపీ నాయకులు ఆరితేరారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి నయా ఫ్యాక్షనిస్టుగా మారారని దుయ్యబట్టారు. మంగళవారం అనంతపురం జిల్లా మడకశిరలో రఘువీరా మీడియాతో మాట్లాడారు. అధికారులపై దాడి చేస్తున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోకుండా రాజీలు చేయడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని గ్రహమని, ఇంత శాడిస్ట్ ముఖ్యమంత్రిని తానెప్పుడూ చూడలేదన్నారు. సాగునీటి పథకాల పేరుతో అధికార పార్టీ నాయకులు రూ.వేలాది కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారం పోయిన తర్వాత వారంతా జైలులో ఉండక తప్పదని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు ప్రజాసంక్షేమాన్ని విస్మరించాయని మండిపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నందున.. మూగజీవాలను కాపాడుకునేందుకు వెంటనే గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే తహసీల్దార్ కార్యాలయాల ఎదుట మూగజీవాలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అలాగే వడదెబ్బ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా, మావోయిస్టుల దాడిలో 25 మంది జవాన్లు చనిపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. -
ఆ శాడిస్ట్ ఓ మెడికో!
తన ఇంటి టెర్రస్ పై నిలబడి, కుక్కను పిట్టగోడపై నిలబెట్టి, నవ్వుతూ వీడియోకి పోజివ్వడమే కాదు.. దాన్ని మేడపైనుంచి విసిరేసి దారుణంగా ప్రవర్తించిన సదరువ్యక్తి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలోని కుక్కను టెర్రస్ పై నుంచి దూరంగా విసిరేసిన వీడియో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుణ్ని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే సదరు శాడిస్ట్ ఓ వైద్యవిద్యార్థి! కుక్కను కిందపడేసిన శాడిస్టును చెన్నైకి చెందిన మెడికో గౌతమ్ గా చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇతను చెన్నై శివారు తండాలంలోని మధా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోన్నట్లు పోలీసులు తెలిపారు. వీడియో ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన తమకు గౌతమ్ స్నేహితుడొకరు ఇచ్చిన సమాచారం కీలకంగా మారిందని పేర్కొన్నారు. బిల్డింగ్ పై నుంచి కుక్కను కిందికి తోసేసిన వీడియో వైరల్ కావడంతో అందులో ఉన్న గౌతమ్ ను అతని క్లాస్ మేట్ గుర్తుపట్టి పోలీసులకు ఉప్పందించడంతో శాడిస్ట్ జాడ తెలిసినట్లయింది. గౌతమ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీడియో చిత్రీకరించిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. చేస్తున్నది రాక్షస క్రీడ అయినా ఎంతో ఆనందంగా నవ్వుతూ గౌతమ్ కెమెరాకు పోజిచ్చిన తీరు అందర్నీ విస్మయపరుస్తోంది. ఆ మూగ జంతువు ప్రాణ భయంతో అరుస్తూ నేలపై పడటాన్ని సైతం స్టో మోషన్ లో వీడియో తీసి ప్రకృతికి విరుద్ధంగా అతడు ప్రవర్తించిన తీరు... చూపరులను అందోళన పరుస్తోంది. ఓ మూగ ప్రాణం పట్ల అతడు చూపించిన కర్కశత్వానికి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలోని శాడిస్టు ఎవరో తెలుసుకొని, తగిన శిక్ష విధించాలని ఫేస్ బుక్ వినియోగదారులతోపాటు జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. మనుషుల మనోభావాలు, ప్రవర్తన.. ఒక్కోరివీ ఒక్కోలా ఉంటాయి. అయితే అవి ఇతరులకు ఎలాంటి హాని తలపించనివైతే నష్టంలేదు. వారి ప్రవర్తన తేడాగా ఉన్నపుడు మాత్రం సమాజానికి, ఇతరులకు ఎంతో నష్టాన్ని చేస్తుంది. అటువంటి వారిపట్ల మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. మెడికో గౌతమ్ అదే కోవకు చెందిన వ్యక్తి అని కాదనగలమా! -
వాడో శాడిస్ట్...
కడప: తమ ఇంట్లో అద్దెకు దిగిన మహిళపై కన్నేశాడు యాజమాని కొడుకు. మాట మాట కలిపి ప్రేమలోకి దించాడు. మాయమాటలతో నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు. తనతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తూ కోరిక తీర్చుకునేవాడు. అక్కడితో ఆగకుండా శరీరాన్ని బ్లేడ్లతో కట్ చేసి శాడిజాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. అతగాడి శాడిజం శిఖరస్థాయికి చేరడంతో బాధితురాలు తన ఆవేదన బయటపెట్టింది. వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఈ ఉదంతం వెలుగు చూసింది. పవన్ కుమార్ అనే యువకుడు కిరాతకానికి పాల్పడినట్టు బాధితురాలు ఆరోపించింది. ప్రేమ ముసుగులో తనకు శారీరకంగా దగ్గరయి, ఈ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె వాపోయింది. అతనో శాడిస్టని, తన శరీరాన్ని బ్లేడ్లతోకోసి శాడిజాన్ని ప్రదర్శిస్తూ పైశాచిక ఆనందం పొందేవాడని తెలిపింది. పవన్ బారి నుంచి తనను కాపాడాలని బాధితురాలు పోలీసులను వేడుకుంది. నిందితుడు పవన్ కుమార్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ నవీన్ గులాటి తెలిపారు. అతడిపై మరికొన్ని ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు. -
ఆయనవన్నీ శాడిస్టు విధానాలే
చంద్రబాబు పాటించేవన్నీ శాడిస్టు విధానాలేనని, అసలిది ప్రజాస్వామ్యమా.. రాక్షస పాలనా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. రైతుల కోరిక మేరకే.. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారని, అయినా ప్రతిపక్షం అంటే మీకెందుకు అంత భయమని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం కూలిపోవాలని రైతులు కోరుకుంటే తప్పేంటని అంబటి రాంబాబు అడిగారు. రైతుల హక్కులను హరిస్తే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని, అసలు పోలీసులకు.. ల్యాండ్ పూలింగ్‌కు సంబంధం ఏంటని ఆయన నిలదీశారు. ప్రభుత్వ పనితీరు భేషంటూ లోకేష్ ఓ సర్వే చేయించారని.. ఇదే సర్వే తుళ్లూరులో చేయిస్తే ప్రభుత్వానికి ఒక్క మార్కు కూడా రాదని ఆయన స్పష్టం చేశారు.