
ఆయనవన్నీ శాడిస్టు విధానాలే
చంద్రబాబు పాటించేవన్నీ శాడిస్టు విధానాలేనని, అసలిది ప్రజాస్వామ్యమా.. రాక్షస పాలనా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. రైతుల కోరిక మేరకే.. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారని, అయినా ప్రతిపక్షం అంటే మీకెందుకు అంత భయమని ఆయన ప్రశ్నించారు.
ఈ ప్రభుత్వం కూలిపోవాలని రైతులు కోరుకుంటే తప్పేంటని అంబటి రాంబాబు అడిగారు. రైతుల హక్కులను హరిస్తే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని, అసలు పోలీసులకు.. ల్యాండ్ పూలింగ్కు సంబంధం ఏంటని ఆయన నిలదీశారు. ప్రభుత్వ పనితీరు భేషంటూ లోకేష్ ఓ సర్వే చేయించారని.. ఇదే సర్వే తుళ్లూరులో చేయిస్తే ప్రభుత్వానికి ఒక్క మార్కు కూడా రాదని ఆయన స్పష్టం చేశారు.