Brahmamgari Matham
-
కొలిక్కిరాని బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి నియామక వివాదం
-
కొలిక్కిరాని బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి నియామక వివాదం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి నియామక వివాదం కొలిక్కిరావటం లేదు. పీఠాధిపత్యం కోసం రెండు కుటుంబాల మధ్య పోటీ కొనసాగుతోంది. గతవారం ఇరువర్గాలతో మఠాధిపతుల బృందం చర్చలు జరిపింది. ధర్మబద్ధంగా అన్ని అర్హతలు ఉన్న వారినే ఎంపిక చేస్తామని ప్రకటించింది. మఠాధిపతుల బృందం ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రికి నివేదిక ఇచ్చింది. వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో నేడు, రేపు మరోసారి చర్చలు జరపనుంది. -
‘కాలజ్ఞాని’ కుటుంబంలో కలహాలు
బ్రహ్మంగారి మఠం: వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఆధిపత్య పోరు నెలకొంది. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఇటీవల కరోనాతో శివైక్యం చెందిన విషయం తెలిసిందే. ఆయన పెద్ద భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చంద్రావతి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు మైనర్లు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య పోటీ నెలకొంది. అయితే గోవిందస్వామి మేజర్ అయ్యేంతవరకు తాను ప్రస్తుతం మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ పోటీలోకి వచ్చారు. దీంతో సమస్య మరింత జటిలం అయ్యింది. ఈ నేపథ్యంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకుగాను రాష్ట్రంలోని వివిధ మఠాల నుంచి 7గురు పీఠాధిపతులు బుధవారం బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. వీరిలో శ్రీశైవక్షేత్ర పీఠాధిపతి భవానీ శంకరానంద స్వామి, బనగానపల్లె రవ్వలకొండ పీఠాధిపతి జ్ఞానేశ్వర్ స్వామి, రుద్ర పీఠాధిపతి అతిదేనందేశ్వర స్వామి, రంగనాథ స్వామి, మారుతి మహానంద స్వామి, ఆత్మానంద భారతీ స్వామి, శివ స్వామి ఉన్నారు. వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి శివైక్యం చెందిన అనంతరం స్వామి పెద్ద భార్య కుమారులు, రెండో భార్య కుమారుల మధ్య నెలకొన్న మఠాధిపత్య పోరును పరిష్కరించేందుకు తాము ఇక్కడికి వచ్చినట్లు పీఠాధిపతులు తెలిపారు. మఠంలో రెండు రోజుల పాటు ఉండి ఈ మఠం సిద్ధాంతాలు పూర్తిగా తెలుసుకున్న తరువాత మఠాధిపతి నియామకం గురించి చర్చిస్తామని చెప్పారు. వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి రెండో భార్యకు రాసిచ్చిన వీలునామాలో ఏముందనే విషయాన్ని కూడా తాము పరిశీలించి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే మఠాధిపతులు, లేక పీఠాధిపతుల ఎంపికలో దేవదాయ శాఖ పాత్ర ఎంతవరకు ఉంటుందనేది పరిశీలిస్తామన్నారు. నూతన మఠాధిపతి నియామకం శాస్త్రీయ పద్ధతిలో జరుగుతుందని గుంటూరు జిల్లా శ్రీశైవక్షేత్ర పీఠాధిపతి భవానీ శంకరానంద స్వామి తెలిపారు. -
బ్రహ్మంగారి ఉత్సవాలు రద్దు
సాక్షి, బ్రహ్మంగారిమఠం (కడప): ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని బ్రహ్మంగారి మఠంలో నేటి నుంచి జరగాల్సిన ఆరాధన ఉత్సవాలు రద్దు చేస్తున్నట్లు ఆలయాధికారులు ప్రకటించారు. సాధారణంగా అయితే బ్రహ్మంగారిమఠం మండలంలో ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఉత్సవాలు నిర్ణయించారు. ఇందులో మే 2న బ్రహ్మంగారు సజీవ సమాధి నిష్ట వహించిన రోజు కాగా 3న రథోత్సవం నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఏర్పడ్డ విషమ పరిస్థితుల దృష్ట్యా వీటిని రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. కావున, భక్తులెవరూ ఉత్సవాలకు రావద్దని మఠం పీఠాధిపతి శ్రీ వసంతి వెంకటేశ్వరస్వామి, ఆలయ మేనేజర్ ఈశ్వరాచారి కోరారు. (కరోనా పాజిటివ్ వ్యక్తులకు రోబోతో సేవలు) -
వాడో శాడిస్ట్...
కడప: తమ ఇంట్లో అద్దెకు దిగిన మహిళపై కన్నేశాడు యాజమాని కొడుకు. మాట మాట కలిపి ప్రేమలోకి దించాడు. మాయమాటలతో నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు. తనతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తూ కోరిక తీర్చుకునేవాడు. అక్కడితో ఆగకుండా శరీరాన్ని బ్లేడ్లతో కట్ చేసి శాడిజాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. అతగాడి శాడిజం శిఖరస్థాయికి చేరడంతో బాధితురాలు తన ఆవేదన బయటపెట్టింది. వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఈ ఉదంతం వెలుగు చూసింది. పవన్ కుమార్ అనే యువకుడు కిరాతకానికి పాల్పడినట్టు బాధితురాలు ఆరోపించింది. ప్రేమ ముసుగులో తనకు శారీరకంగా దగ్గరయి, ఈ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె వాపోయింది. అతనో శాడిస్టని, తన శరీరాన్ని బ్లేడ్లతోకోసి శాడిజాన్ని ప్రదర్శిస్తూ పైశాచిక ఆనందం పొందేవాడని తెలిపింది. పవన్ బారి నుంచి తనను కాపాడాలని బాధితురాలు పోలీసులను వేడుకుంది. నిందితుడు పవన్ కుమార్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ నవీన్ గులాటి తెలిపారు. అతడిపై మరికొన్ని ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు.