హిందూపురం అర్బన్ : పట్టణంలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లికి చెందిన గోవిందప్ప (24) రైలుకింద పడి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల తెలిపిన మేరకు బెంగళూరులోని ఫ్యాక్టరీలో పని చేస్తున్న గోవిందప్ప ఉదయం గ్రామం నుంచి బెంగళూరుకు వెళ్తున్నానని చెప్పి బయలుదేరి హిందూపురం వచ్చాడు.
అయితే బెంగళూరు వెళ్లకుండా రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మతుడి తండ్రి అశ్వర్థప్ప అక్కడికి చేరుకుని కుమారుడి శవం చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య
Published Wed, Sep 14 2016 11:35 PM | Last Updated on Wed, Aug 1 2018 2:10 PM
Advertisement
Advertisement