అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి | younger suspicious death in kadiri | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

Published Thu, Nov 3 2016 10:48 PM | Last Updated on Mon, Sep 4 2017 7:05 PM

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

- రైలు పట్టాలపై యువకుడి మృతదేహం
- తన కొడుకు హత్య చేశారంటూ తల్లి ఫిర్యాదు


కదిరి టౌన్‌ : అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతి చెంది రైలు పట్టాలపై శవమై కన్పించాడు. అయితే తన కొడుకును ఎవరో హత్య చేసి ఇక్కడ పడవేశారని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడి తల్లి, రైల్వే పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని కందికుంట వెంకటనారాయణమ్మ కాలనీకి చెందిన వెంకటరమణ (27), లక్ష్మి దంపతులు. వెంకటరమణ భార్య నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందింది. దీంతో స్వప్న అనే మరో యువతితో సహజీవనం సాగించేవాడు. అయితే స్వప్న ఇదివరకే సౌదీకి వెళ్లి నాలుగు నెలల క్రితం ఇక్కడికి వచ్చింది. కాగా స్వప్నకు చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వీరి మధ్య మనస్ఫర్థలు ఏర్పడ్డాయి.

ఇటీవల పాస్‌పోర్టు విషయమై కూడా ఇద్దరూ గొడవలు చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో పోలీసులు రాజీచేసి పంపారు. అయితే అంతలోనే ఏం జరిగిందో.. ఏమో కాని వెంకటరమణ మృతదేహం గురువారం అదే కాలనీ సమీపంలోని రైలు పట్టాలపై పడి ఉంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా రైల్వే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. మృతుడి తల్లి సరోజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వెంకటరమణ మృతికి గొడవలే కారణమా లేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే తల్లి మాత్రం ఇది హత్యేనని పోలీసులకు ఫిర్యాదు చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement