
నూతన దంపతులకు వైఎస్ జగన్ ఆశీర్వాదం
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విశాఖ విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు ఘన స్వాగతం పలికారు. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఐఎన్టీయూసీ నేత మంత్రి రాజశేఖర్ కుమార్తె దంపతులను ఆశీర్వదించారు.
సిరిపురం వీఐపీ రోడ్‌లో ఉన్న రాజశేఖర్ నివాసానికి చేరుకున్న వైఎస్ జగన్‌కు....ఆయన కుటుంబసభ్యులు,అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం నూతన వధువరులు మౌనిక, శివ కళ్యాణ్‌ను ఆశీర్వదించారు. వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కొత్త దంపతులు...వైఎస్ జగన్ తమను ఆశీర్వదించేందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.