రెండు కేజీలు తగ్గిన వైఎస్ జగన్
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ నాగభూషణ్ రెడ్డి ఆదివారం 11 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్కు పరీక్ష చేశారు. రక్త నమూనాను సేకరించారు.
దీని ప్రకారం ప్రస్తుతం వైఎస్ జగన్ శరీరంలో చక్కెర స్థాయి 83కు, నాడీ 67కు పడిపోయింది. ఇక అంతకుముందు ఆయన 75 కేజీలకు పైగా ఉండగా ప్రస్తుతం ఆయన బరువు 73.4 కేజీలకు తగ్గింది. మొత్తం రెండు కేజీల బరువు వైఎస్ జగన్ తగ్గినట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవడంతో గంటగంటకు ఆయన శరీరంలోని బీపీ, షుగర్, పల్స్ స్థాయిల్లో మార్పు వస్తుందని వైద్యులు తెలిపారు.