samara deksha
-
’ఇది ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయం’
-
'పోలీసుల తీరు బాధాకరం'
-
బలవంతంగా పోలీసులు దీక్షను భగ్నం చేశారు
-
దీక్ష భగ్నం ఎలా జరిగిందంటే..
-
దీక్ష భగ్నం ఎలా జరిగిందంటే..
హైదరాబాద్: ముందస్తు వ్యూహం ప్రకారమే పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏడు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. నిద్రహారాలు మానుకొని యావత్ ఆంధ్రప్రజానీకం భావి ప్రయోజనాలకోసం ఆయన అకుంఠిత పట్టుదలతో దీక్ష కొనసాగించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ముఖ్యంగా శరీరంలో కీటోన్స్ సోమవారం ప్లస్ 3 ఉండగా.. మంగళవారం తెల్లవారు జాము సమయానికి ప్లస్ 4కు చేరుకుని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అంతకుముందు ఆయన దీక్షపై ఏ విధమైన స్పందన తెలియజేయని ప్రభుత్వం ముందస్తు వ్యూహంలో భాగంగానే అందరు నిద్రిస్తున్న సమయంలో పోలీసులను దీక్షా స్థలి వద్దకు పంపించారు. ఆ సమయంలో దీక్షా ప్రాంగాణంతోపాటు చుట్టుపక్కల అంతా నిద్రలోనే ఉన్నారు. అక్కడికి చేరుకుంటుండగానే కెమెరాల కేబుల్స్‌ను కట్ చేయడంతో పాటు లైట్స్ కూడా ఆర్సేసినట్లు తెలిసింది. ఆ వెంటనే వైఎస్ జగన్ వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి విషమించినందున దీక్ష వెంటనే విరమించాలని కోరారు. కానీ అందుకు నిరాకరించిన వైఎస్ జగన్ తాను దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. దీంతో బలవంతంగా పోలీసులు దీక్షను భగ్నం చేశారు. అక్కడి నుంచి ఓ స్ట్రెచర్‌పై తీసుకెళ్లి 108 అంబులెన్స్‌లో ఎక్కించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జికి దిగి అక్కడి వారిని చెల్లా చెదురు చూశారు. అంబులెన్స్‌కు ఎవరూ అడ్డు రాకుండా ముందు కొంతమంది పోలీసులు లాఠీలతో పరుగెత్తుతుండగా వేగంగా అంబులెన్స్‌ను గుంటూరు జీజేహెచ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నేరుగా ఐసీయూలోకి తీసుకెళ్లి ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తనకు ఫ్లూయిడ్స్ వద్దని, దీక్షను కొనసాగిస్తానని తీవ్రంగా వైద్యులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆరోగ్యం విషమించిందని, ఇలాగే కొనసాగితే ఊహించని ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ బలవంతంగా వైఎస్ జగన్‌కు ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి, సోదరి వైస్ షర్మిల ఆస్పత్రికి వచ్చి ఆయనతో ఉన్నారు. మరోపక్క, పోలీసుల తీరుపట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'పోలీసుల తీరు బాధాకరం'
గుంటూరు: అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రభుత్వాస్పత్రికి తరలించే సందర్భంలో పోలీసుల తీరు చాలా బాధాకరమని చెప్పారు. కనీస మర్యాద పాటించలేదని, ఒక ప్రధాన ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా ఓ సాధారణ స్ట్రెచర్ మీద ఆయనను అంబులెన్స్‌లోకి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. దీక్ష చేస్తున్న ప్రస్తుతం ఆయన ఇంకా ఫ్లూయిడ్స్ తీసుకోలేదని, ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తారని చెవిరెడ్డి చెప్పారు. ప్రభుత్వం అండ చూసుకొని పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార అహంబావంతో వ్యవహరించి అందరు నిద్రిస్తున్న సమయంలో పోలీసులను పంపించారని, నిద్రలో ఉన్న వైఎస్ జగన్‌ను బలవంతంగా నిద్రలేపి తీసుకెళ్లారని చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కేబుల్ టీవీల, కెమెరాల వైర్లను కూడా కట్ చేశారని చెప్పారు. -
బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే యత్నం
గుంటూరు: ప్రత్యేక హోదా కోసం తన దీక్షను కొనసాగిస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీక్షా స్థలి వద్ద నుంచి బలవంతంగా గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు.. అక్కడి ప్రభుత్వ వైద్యులచే వైఎస్ జగన్ కు ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేయగా అందుకు ఆయన నిరాకరించారు. తాను దీక్ష కొనసాగిస్తానని పోలీసులకు స్పష్టం చేశారు. అయినా, ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఆయనకు రక్తం, బీపీ, షుగర్, కీటోన్స్ వంటి ఐదురకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఫ్లూయిడ్స్ ఎక్కించాలని వారు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
విషమం.. ఆందోళనకరం
► బాగా నీరసించిపోయిన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ► శరీరంలో ప్రమాదకరస్థాయిలో కీటోన్స్ ► దీక్ష కొనసాగితే కోమాలోకే.. ► వైద్యుల హెచ్చరిక ► హుటాహుటిన దీక్షాశిబిరం వద్దకు విజయమ్మ, భారతి ► కన్నీటిపర్యంతమవుతున్న అభిమానులు ► పార్టీలకు అతీతంగా నేతల సంఘీభావం ► శిబిరం వద్ద ఆత్మాహుతికి ప్రయత్నించిన ఓ యువకుడు ► జగన్‌ను పరామర్శించిన సోదరి షర్మిల సాక్షి ప్రత్యేక ప్రతినిధి, గుంటూరు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏడురోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం బాగా విషమించింది. బాగా నీరసించిపోయారు. సోమవారం మూడుసార్లు పరీక్షలు నిర్వహించిన వైద్యులు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు. దీక్షను ఆపి తక్షణం ఆహారం తీసుకోకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని వైద్యులు సోమవారం రాత్రి జగన్‌కు వివరించారు. అయితే తన ప్రాణాల కన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడమే ముఖ్యమంటూ దీక్షను కొనసాగించడానికే జగన్ నిర్ణయించుకున్నారు. ఆహారం తీసుకోవాలంటూ తాము చేసిన సూచనలను జగన్ తోసిపుచ్చారని వైద్యులు తెలిపారు. జగన్ రక్తపరీక్షల్లో చక్కెర నిల్వలు బాగా పడిపోయి 61 ఎంజీకి చేరుకున్నాయని, ‘కీటోన్ బాడీస్ స్థాయి 3 ప్లస్’గా ఉందని వెల్లడైంది కనుక మూత్రపిండాల పనితీరుపైనా, మెదడు పనితీరుపైనా తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్యులు పేర్కొన్నారు. శరీరంలో ‘పొటాషియం’ నిల్వలు అసాధారణ స్థాయికి చేరుకుంటాయని, అపుడు పరిస్థితి ఇంకా విషమిస్తుందని, కోమాలోకి కూడా వెళ్లిపోయే ప్రమాదం తలెత్తుతుందని వైద్యులు హెచ్చరించారు. దీక్షను ఇంకా మిగతా 6వ పేజీలో ఠ కొనసాగించడమంటే అది సాహసమే అవుతుందని వారు చెబుతున్నారు. సోమవారం ఉదయం 7.30లకు జరిపిన పరీక్షల్లో జగన్ 72.7 కిలోల బరువున్నారు. బీపీ 130/ 90, పల్స్ 80గా ఉన్నాయి. షుగర్ ల్యాబ్‌లో పరీక్షిస్తే 61 ఎంజీగా, స్ట్రిప్‌పై 84 ఎంజీగా ఉంది. తేడా ఉండటం వల్ల వైద్యాధికారులు షుగర్ రిపోర్టు ప్రకటించకుండా నిలిపివేశారు. మద్యాహ్నం 1.30కి జరిపిన పరీక్షల్లో బీపీ 130/80, పల్స్ 80 ఉండగా బరువు 72.7 కిలోలు ఉన్నారు. రాత్రి 9.00 గంటలకు పరీక్షల్లో బీపీ 130/ 80, పల్స్ 77 ఉండగా బరువు 72.4 కిలోలున్నారు. బాగా నీరసించి పోవడంతో సోమవారం కొద్ది సేపు మాత్రమే జగన్ కూర్చోగలిగారు. కళ్లు బాగా వేడెక్కుతూ ఉండటంతో కళ్లపై చల్లని బట్టను కప్పుకుని పూర్తిగా పడుకుండి పోయారు. ఉద్విగ్న భరిత వాతావరణం జగన్ దీక్షా వేదిక వద్ద సోమవారం ఉదయం నుంచీ ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంది. ఆయన ఆరోగ్యం గంట, గంటకూ ప్రమాదస్థాయికి చేరుకుంటోందని టీవీల ద్వారా తెలుసుకున్న ప్రజలు, అభిమానులు వెల్లువలాగా తరలి వచ్చారు. గుంటూరు పరిసరాల్లో నుంచి భారీగా తరలి వచ్చిన జనం వేదికకు దగ్గరగా వెళ్లి చూడడానికి ప్రయత్నించడం, చూడలేనివారు నిరాశ పడడం కనిపించింది. జగన్ ఆరోగ్య పరిస్థితిపై వారందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. జగన్ స్థితిని వేదిక వద్ద ఏర్పాటు చేసిన తెరలపై చూసి మహిళలు కన్నీటి పర్యంతం అయ్యారు. జగన్ దీక్షను నిర్లక్ష్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై శాపనార్థాలు పెడుతూ మహిళలు పెద్దపెట్టున రోదించడం కనిపించింది. యువకులైతే ఆగ్రహావేశాలతో ఊగి పోతూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, సీనియర్లు చంద్రబాబు వైఖరిని, కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబడుతూ ప్రసంగించారు. మరోమారు జగన్ వద్దకు విజయమ్మ, భారతి తనయుని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని తెలిసి ఆందోళన చెందిన జగన్ మాతృమూర్తి , పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆయన సతీమణి వైఎస్ భారతి హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చారు. దీక్షా శిబిరానికి చేరుకున్నారు. (ఆదివారమే ఇక్కడకు వచ్చి వెళ్లిన భారతి ఆందోళనతో మళ్లీ సోమవారం భర్త వద్దకు చేరుకున్నారు) నీరసంగా, మాట్లాడలేకుండా ఉన్న తనయుని చూసి ఆవేదన చెందిన విజయమ్మ ఆయనకు సపర్యలు చేస్తూ పక్కనే ఉండి పోయారు. భర్త యోగక్షేమాల సమాచారం గురించి వైద్యులతో వాకబు చేస్తూ భారతి కూడా వేదికపై జగన్ పక్కనే కింద కూర్చుండిపోయారు. జగన్ పరిస్థితి, విజయమ్మ, భారతి విషణ్ణ వదనాలను గమనించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరింత ఉద్వేగానికి లోనయ్యారు. కాగా వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా సోమవారం సాయంత్రానికి దీక్షాశిబిరాన్ని సందర్శించారు. జగన్‌ను పరామర్శించి కొద్దిసేపు ఉండి వెళ్లారు. రగిలిన రాష్ర్టం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రులు కామినేని, ప్రత్తిపాటి అవమానకరమైన రీతిలో వ్యాఖ్యలు చేయడంపై సోమవారం రాష్ర్టవ్యాప్తంగా నిరసనలు మిన్నుముట్టాయి. ఒకవైపు జగన్ నిరాహార దీక్షకు సంఘీభావంగా రిలేనిరాహార దీక్షలు చేస్తున్న పార్టీ నాయకులు,కార్యకర్తలు సోమవారం మంత్రుల వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యులు పనిచేయని పరికరాలతో వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆ నివేదికల ఆధారంగా జగన్‌పై విమర్శలకు పూనుకోవడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. జగన్ ఆరోగ్యం కోసం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. రాత్రి రాష్ర్టవ్యాప్తంగా పలు చోట్ల కొవ్వొత్తుల ప్రదర్శనలు జరిగాయి. ఆత్మాహుతి యత్నాలు.. బాధ్యతగలిగిన ప్రతిపక్ష నాయకుడి హోదాలో రాాష్ర్ట శ్రేయస్సుకోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నా ఆయన ఆరోగ్యం గురించి గానీ, ఆయన చేస్తున్న డిమాండ్ గురించి గానీ కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఆరోగ్యం క్షీణిస్తుండడంపై ఆందోళన చెందుతూ, రాష్ర్ట ప్రభుత్వ నిర్లక్ష వైఖరిని నిరసిస్తూ రాష్ర్టంలో పలువురు ఆత్మాహుతికి యత్నించడం కలకలం రేపింది. మొత్తం ఐదు చోట్ల ఆత్మాహుతి యత్నాలు జరిగినట్లు వార్తలందడం చూస్తుంటే రాష్ర్ట ప్రజలు ప్రత్యేక హోదా గురించి, ప్రతిపక్ష నేత ఆరోగ్యం గురించి ఎంతగా ఆందోళన చెందుతున్నారో అర్ధం చేసుకోవచ్చునని పరిశీలకులంటున్నారు. దీక్షా శిబిరానికి వచ్చిన ఓ యువకుడు జగన్ పరిస్థితి చూసి చలించిపోయి పెట్రోలు పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నించడంతో నాయకులు,కార్యకర్తలు అడ్డుకుని రక్షించారు. ఆ యువకుడిని గుంటూరునగరానికి చెందిన దగ్గుమల్లి పూర్ణ వెంకటసాయిగా గుర్తించారు. గుంటూరుజిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ సైదా, ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన మునగాల కృష్ణారెడ్డి, తిరుపతి ఎస్వీయూలో మాసుమయ్య అనే విద్యార్థి పెట్రోలు పోసుకుని ఆత్మాహుతికి ప్రయత్నిస్తే పక్కనున్నవారు అప్రమత్తమై కాపాడారు. వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరులో రాస్తారోకోలో పాల్గొన్న తురకపల్లి కేశమ్మ అలియాస్ రంగమ్మ విష గుళికలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంగమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. సీపీఐ సంఘీభావం జగన్ ప్రత్యేక హోదా దీక్షకు సోమవారం సీపీఐ నేతలు సంఘీభావం ప్రకటించారు. సీపీఐ రాష్ర్ట సంయుక్త కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ దీక్షా శిబిరాన్ని సందర్శించి జగన్‌కు తాము సంపూర్ణ సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. వారు వచ్చినపుడు కూడా జగన్ లేవలేని స్థితిలో ఉన్నారు. జగన్ దీక్షపై ఏపీ ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తూండటాన్ని సీపీఐ నేతలు తప్పు పట్టారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దీక్ష విరమణకు కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22 వ తేదీన రాష్ట్రానికి వస్తున్నందున అంతకు ముందే ప్రత్యేక హోదాపై ఒక విస్పష్టమై ప్రకటన చేయాలని కోరారు. ఉదయం 7.30లకు.. (సోమవారం) బరువు 72.9 కిలోలు బీపీ 130/90 పల్స్ 80 మధ్యాహ్నం 1.30కి బరువు 72.7 కిలోలు బీపీ 130/80 పల్స్ 80 రాత్రి 9.00కి బరువు 72.4 కిలోలు బీపీ 130/80 పల్స్ 77 షుగర్... ల్యాబ్‌లో పరీక్షిస్తే 61 ఎంజీగా, స్ట్రిప్‌పై 84 ఎంజీగా ఉంది. తేడా ఉండటం వల్ల వైద్యాధికారులు షుగర్ రిపోర్టు ప్రకటించకుండా నిలిపివేశారు. -
వైఎస్ జగన్‌కు షర్మిల పరామర్శ
గుంటూరు: వైఎస్ షర్మిల గుంటూరు చేరుకున్నారు. వెంటనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్ష నేటికి ఆరు రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను పరామర్శించేందుకు వచ్చారు. అంతకు ముందే వైఎస్ జగన్‌ను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఈ రోజు హైదరాబాద్ నుంచి గుంటూరుకు బయల్దేరి వైఎస్ జగన్‌ను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన సోదరి వైఎస్ షర్మిల గుంటూరుకు బయల్దేరారు. సోమవారం మధ్యాహ్నం షర్మిల బెంగళూరు నుంచి గుంటూరుకు పయనమయ్యారు. -
'కాలచక్రం తిరిగొస్తుంది.. పాతాళంలోకి వెళతారు'
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన కుటుంబం దొంగపనులు చేయలేదని అంబటి రాంబాబు అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను దొంగ దీక్ష అని చంద్రబాబు మంత్రులు మాట్లాడటం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష ఆరో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ దొంగలెక్కలు, మోసపూరిత హామీలు మీవే అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. చిత్తశుద్దితో దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ పై ఆరోపణలు మానుకోవాలని లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇష్టమొచ్చినట్లు వాఖ్యానిస్తున్నారని, అసలు రక్త నమునాలు ఎప్పుడు తీసుకుంటున్నారో పరీక్షలు ఎప్పుడు చేస్తున్నారో మీకు తెలుసా అని ప్రశ్నించారు. గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరికరాలు లేక ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో టెస్టులు చేస్తున్నారంటే ప్రభుత్వం ఎంత పనికిరాని పరిపాలన చేస్తుందో అర్థం కావడం లేదా అని నిలదీశారు. ఆరు రోజులుగా నిద్రాహారాలు మానుకొని వైఎస్ జగన్ దీక్ష చేస్తుంటే కనిపించడం లేదా అన్నారు. మెచ్చుకోకపోయినా పర్వాలేదుకానీ ఆరోపణలు మాత్రం చేయొద్దని అన్నారు. మంత్రులు, చంద్రబాబునాయుడు అధికార తిమ్మిరితో అహంబావంతో వ్యవహరిస్తున్నారని, కాలం తిరిగొచ్చి వారిని అధపాతాళంలోకి నెట్టి వేసే రోజు తొందర్లోనే వస్తుందని మండిపడ్డారు. ప్యాకేజీలు గురించి అసలు ఎందుకు మాట్లాడుతున్నారని, దాని గురించి మాట్లాడకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, ప్రత్యేక హోదాపై మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కుట్ర చేసి రాష్ట్రాన్ని విడదీసి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని, అందుకు టీడీపీ కూడా మద్దతు పలికిందని ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా ఎందుకని ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
'మందిని ముంచినవారు మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని లక్ష్మీ పార్వతి అన్నారు. నైతిక హక్కులేని వారంతా వైఎస్ జగన్ ఆరోగ్యంపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రి గంటా శ్రీనివాసరావుల గురించి ఎవరికీ తెలియని విషయం లేదని, ప్రత్తిపాటి పుల్లారావు మందిని ముంచినవారేనని, తక్కువ ధరలకే రైతుల భూములు ఆక్రమించుకున్నారని, వారి పత్తి పంట సొమ్ములు తన ఖాతాలోకి వేసుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసపూరిత హామీలతో అధికారంలోకి వస్తే రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం చిన్నవాడైనా వైఎస్ జగన్ అనేక దీక్షలు, ధర్నాలతో ముందుకు వెళుతున్నారని చెప్పారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ లాగా ఎవరూ శ్రమించలేదని పేర్కొన్నారు. ఆయనను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. గాంధీ అనుసరించిన మార్గాన్ని వైఎస్ జగన్ఎంచుకున్నారని, నిరవధిక దీక్ష అంటే అమరణ నిరాహార దీక్షేనని, అలాంటి దీక్షను అవమాన పరుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని విస్మరిస్తారా.. అందుకేనా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది అని ప్రశ్నించారు. నీతి ఆయోగ్ పేరిట ప్రత్యేక హోదా అడ్డుకుంటున్నారని, నాడు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని సభలో అడిగిన వెంకయ్యనాయుడికి ఇప్పుడు ఆ విషయం ఎందుకు అర్థం కావడంలేదో అని అన్నారు. కేవలం 4,200 కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిందని, కాని తెలంగాణ 5,145కోట్లు కేంద్రం నుంచి సాధించుకుందని చెప్పారు. -
'మందిని ముంచినవారు మాట్లాడుతున్నారు'
-
'జాతీయ మీడియా నిర్లక్ష్యం చేస్తోంది'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడమేనని, నిరుద్యోగాన్ని పారద్రోలడమేనని సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో నాడు కేంద్రంలోని అధికార పార్టీ, ప్రతిపక్ష బీజేపీ హామీ ఇచ్చాయని గుర్తు చేశారు. మరోపక్క, ప్రత్యేక హోదా కోసం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహారా దీక్షను జాతీయ మీడియా నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. సాధారణంగా జాతీయ మీడియా పట్టించుకున్నప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి సమస్య తెలుస్తుందని, అలాంటిది ఆ మీడియా ఎందుకు ఈ విషయాన్ని పక్కకు పెట్టాయో అర్థం కావడం లేదని చెప్పారు. స్థానిక మీడియా బాగానే ప్రచారం చేస్తుందని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని, కొంత ఆందోళన కరంగా ఉందని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పారు. ఈ దీక్ష వైఎస్ జగన్ కోసం చేస్తున్నది కాదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికోసమే దీక్ష చేస్తున్నారనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. -
'జాతీయ మీడియా నిర్లక్ష్యం చేస్తోంది'
-
'బాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి'
చిత్తూరు: చంద్రబాబునాయుడికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లో పడ్డాయని వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తన మీడియా ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షకు మద్దతుగా భూమన ఆధ్వర్యంలో ఆదివారం చిత్తూరు ఆర్డీవో కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన వాటికి భయపడే వ్యక్తి వైఎస్ జగన్ కాదని అన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకోసం పోరాడుతున్న ఏకైక నేత ఒక్క వైఎస్ జగనే అని చెప్పారు. -
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అరెస్టు
ప్రకాశం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ప్రభుత్వం తన అధికార బలంతో ఝులం ప్రదర్శిస్తోంది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలుస్తున్న వారిని పోలీసులతో అణిచివేయాలని చూస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జగన్ దీక్షకు మద్దతుగా వంటావార్పు, బైక్ ర్యాలీ చేపట్టినందుకు ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంతమాగులూరు మండలం, పుట్టావారిపాలెం వద్ద ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్షకు మద్దతుగా రాష్ట్ర నలు మూలల మద్దతు లభిస్తోంది. దీక్షకు మద్దతు తెలుపుతున్నవారిని పోలీసులు పలుకారణాలపేరిట అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. -
'వైఎస్ జగన్ ప్రాణాలు లెక్కచేయడం లేదు'
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం పట్ల పార్టీ సీనియర్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కీలక నేతల భేటీ నిర్వహించిన అనంతరం పార్టీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్ పట్టుదలతో ఉన్నారని చెప్పారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జగన్ దీక్ష చేస్తున్నారని చెప్పారు. దీక్షకు భారీ ఎత్తున మద్దతు లభిస్తోందని, అశేష ప్రజానీకం మద్దతు తెలుపుతోందని వివరించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా మాత్రమే సంజీవని ఆయన అన్నారు. 22న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక హోదాపై స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. జగన్ దీక్షపై చంద్రబాబు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే జాలి వేస్తుందని అన్నారు. చంద్రబాబులా మోసం చేసే మాటలు జగన్ కు తెలియవదని అన్నారు. అలీబాబా నలభై దొంగల్లా పంచభూతాలను టీడీపీ దోచుకుంటుందని ఆరోపించారు. టీడీపీ నేతల తీరును ప్రజలంతా గమనిస్తున్నారని, పోలవరంపై బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్.. బాబు భాగస్వామా కాదా అని ప్రశ్నించారు. వ్యాపార భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకే రాజధాని భూముల తాకట్టు పెట్టారని చెప్పారు. -
'వైఎస్ జగన్ ప్రాణాలు లెక్కచేయడం లేదు'
-
రెండు కేజీలు తగ్గిన వైఎస్ జగన్
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ నాగభూషణ్ రెడ్డి ఆదివారం 11 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్‌కు పరీక్ష చేశారు. రక్త నమూనాను సేకరించారు. దీని ప్రకారం ప్రస్తుతం వైఎస్ జగన్ శరీరంలో చక్కెర స్థాయి 83కు, నాడీ 67కు పడిపోయింది. ఇక అంతకుముందు ఆయన 75 కేజీలకు పైగా ఉండగా ప్రస్తుతం ఆయన బరువు 73.4 కేజీలకు తగ్గింది. మొత్తం రెండు కేజీల బరువు వైఎస్ జగన్ తగ్గినట్లు వైద్యులు తెలిపారు. ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవడంతో గంటగంటకు ఆయన శరీరంలోని బీపీ, షుగర్, పల్స్ స్థాయిల్లో మార్పు వస్తుందని వైద్యులు తెలిపారు. -
వైఎస్ఆర్ సీపీ కీలక నేతల భేటీ
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. గుంటూరులోని నల్లపాడు రోడ్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న చోట వారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే అంశంతోపాటు వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితులపట్ల చర్చిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్ష ఐదో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆదివారం ఉదయం ఓసారి 11గంటలు దాటిన ప్రాంతంలో ఓసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. -
'బాబు దుష్ట పన్నాగానికి దిగారు'
-
'బాబు దుష్ట పన్నాగానికి దిగారు'
గుంటూరు: ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘోర వైఫల్యం చెందారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. రాష్ట్రం దుర్భిక్షంలో ఉంటేనే తన దుష్టపన్నాగాలు అమలవుతాయని చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జ్యోతుల మాట్లాడుతూ రైతుల దుస్థితిని ఆయుధంగా వాడుకుని, వారికి భ్రమలు కల్పించి చంద్రబాబునాయుడు మోసం చేశారని చెప్పారు. యువతను కూడా ఉద్యోగాలిస్తామని.. నిరుద్యోగ ఉదృతి భృతి ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా పక్కకు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ గురించి చంద్రబాబునాయుడు మాట్లాడుతున్నారని, అది తెచ్చి ఎవరికి పెడతారని ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో కూడా చంద్రబాబునాయుడు ఘోర తప్పిదాలకు పాల్పడ్డారని, తనకు ఎక్కడ లంఛాలు రావో అని పోలవరం పక్కకు పెట్టేశారని, దానిని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తానని అంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం లేకుంటే పోలవరం పూర్తి కాదనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. పోలవరం కాలువ వైఎస్ తవ్విస్తే దానిని ప్రారంభించి తానేదో గొప్పలు సాధించినట్లుగా చంద్రబాబు చెప్పుకుంటున్నాడని ఆయన చేసిందేమీ లేదని ఆరోపించారు. వైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తుందని, అయినా దీక్ష కొనసాగించి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. ఓటుకు నోటు కేసుల కుంభకోణంలో ఇరుక్కుని చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కేంద్రం వద్ద తాకట్టు పెట్టారని చెప్పారు. -
'బాబూ.. ఎందుకు ఈ నాటకాలు'
గుంటూరు: పది సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభలో వాదించిన మీకు చట్టంలో ఆ హామీ పెట్టారా లేదా అని చూసుకునే బాధ్యత లేదా అని బీజేపీ నేత వెంకయ్యనాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఒక వేళ చట్టంలో పెట్టకపోయినా.. నాటి వాదనల ప్రకారం ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదా అని నిలదీశారు. నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరహార దీక్షకు మొత్తం రాష్ట్రం నుంచి మద్దతు లభిస్తోందని చెప్పారు. ప్రజల మద్దతుతోనే ప్రత్యేక హోదా ఆయన సాధిస్తారని చెప్పారు. ప్రజలంతా జగన్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం మాత్రం చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా, కబోది ముందు నాట్యం చేసినట్లుగా ఉందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాపై ఆరోపణలు చేస్తోందని, లక్ష కోట్లు పంపించామని చెప్తుందని అన్నారు. ఒక వేళ నిజంగానే లక్ష కోట్లు ఇస్తే ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతోపాటు వాటి వ్యయాల గురించి తెలియజేయాలని డిమాండ్ చేశారు. హుద్ హుద్ తుఫానుకు కేంద్రం సాయం అందిస్తే ఆ లెక్కలు ఇప్పటి వరకు చెప్పలేదని బీజేపీ నేత పురందేశ్వరి అంటున్నారని, ఆ వివరాలు కూడా తెలియజేయాలని కోరారు. ఈ లెక్కలు గట్టిగా కేంద్రం అడుగుతుందనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను కోరడం లేదా అని నిలదీశారు. ఇలా, బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం విషమిస్తుంది
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు. వైఎస్ జగన్ దీక్ష ఐదో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం వైఎస్ జగన్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మరోసారి 11 గంటల సమయంలో పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైఎస్ జగన్ కేజిన్నర బరువు తగ్గి బాగా నీరసించిపోయారన్నారు. షుగర్ లెవల్స్ మరింత పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీక్ష కొనసాగిస్తే ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉందని చెప్పారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తున్న నేపథ్యంలో ఇక నుంచి ప్రతి నాలుగు గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు వైద్యులు తెలిపారు. -
'ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారు'
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష కొనసాగుతుందని పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కేబినెట్ నిన్న సమావేశం అయ్యి కూడా ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న దీక్షపై చర్చ చేయకపోవడం, ఎలాంటి ప్రకటన స్పందన లేకపోవడం దారుణం అన్నారు. ఇష్టమొచ్చినట్లుగా చంద్రబాబునాయుడు, ఆయన మంత్రులు ప్రవర్తిస్తున్నారని, మాట్లాడుతున్నారని ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందని, ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. మరోపక్క, పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందని అన్నారు. ఢిల్లీలో దీక్ష చేయాలని వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు మంత్రులు అపహాస్యం చేస్తున్నారని, వీరికి తగిన సమాధానం ప్రజలు చెప్పే రోజు దగ్గరిలోనే ఉందన్నారు. గతంలో కుటుంబకార్యక్రమంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన చంద్రబాబు ఈ సారి శంఖుస్థాపన కూడా అలాగే చేస్తున్నారని మండిపడ్డారు. ఓ పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్ జగన్ దీక్ష చేస్తుంటే ప్రభుత్వం తమకేమి పట్టనట్లు ఉంటుందని, దీనికి వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. -
'పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్‌కు మద్దతు ఇవ్వాలి'
హైదరాబాద్: ప్రత్యేక హోదా విషయంలో పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని హైదరాబాద్‌లోని వివిధ ఐఏఎస్ స్టడీ సర్కిల్స్‌లో సివిల్స్ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అన్నారు. ఇప్పటి వరకు వైఎస్ జగన్ ఏం చేసినా విజయం సాధించారని, ప్రత్యేక హోదా విషయంలో కూడా విజయం సాధిస్తారన్న నమ్మకం తమకు ఉందని, అలా జరగాలని కూడా తాము కోరుకుంటున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా విద్యార్థిలోకానికి, యువతకు, సామాన్యకు చాలా అవసరం అని వారు చెప్పారు. కేంద్రం ప్రత్యేక హోదా తప్పకుండా ఇవ్వాలని, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనదని అన్నారు. రాజధాని విషయం నుంచి ప్రతి విషయంలో ఆంధ్రప్రదేశ్ సంస్థాపరంగా, వ్యవస్థాపరంగా చాలా నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని, ఇది ఒక్క ప్రత్యేక హోదాతోనే సాధ్యమని చెప్పారు. నాడు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వంతోపాటు, బీజేపీ కూడా హామీ ఇచ్చి మరిచాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ సమస్య తీరాలన్నా, రైతుల సమస్యలు పోవాలన్నా, తీవ్ర అంతరం ఉన్న రెవిన్యూలోటు పూడ్చాలన్నా ప్రత్యేక హోదా అవసరం అని పేర్కొన్నారు. కేంద్రం కొన్ని కొన్ని కారణాలు చూపెడుతూ ప్రత్యేక హోదా ఇవ్వబోమని చెప్తోందని, కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు అన్ని రంగాల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడం మూలంగా ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయిందని, కష్టాల్లో కూరుకుపోయిందని చెప్పారు. -
'వైఎస్ జగన్ విజయం సాధించారు'
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకత, అవసరం, దానివల్ల వచ్చే ప్రయోజనాలను ప్రజలకు వివరించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించారని విద్యార్థులు, మహిళలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మద్దతుదారులు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష ఐదో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దీక్ష ప్రాంగణానికి చేరుకుంటున్న వారంతా మీడియాతో మాట్లాడింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ చేస్తున్న దీక్షపై చర్చ జరుగుతోందని, ప్రతి ఇంట్లో ఆయన నిరాహార దీక్ష గురించే మాట్లాడుకుంటున్నారని వారు పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ అవగాహన వచ్చిందని, ఇది ఓ రకంగా వైఎస్ జగన్ సాధించిన విజయమని వారు చెప్పారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి నుంచి దీక్షకు మద్దతు లభిస్తోందని, ప్రతి ఒక్కరూ దీక్షా ప్రాంగాణానికి బయలుదేరి వస్తున్నారని, ఈ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. అబద్ధాల యూనివర్సిటీలో పీహెచ్డీ చేసిన చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారని, దాని వల్ల బాబు కుటుంబమే బాగుపడుతుంది తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమి లేదని చెప్పారు. వైఎస్ జగన్‌కు ఏదైనా జరిగితే సహించేది లేదని, మంత్రులను తిరగనివ్వబోమని, క్యాంపు ఆఫీసులను, వారి పార్టీ కార్యాలయాలను ముట్టడించి తీరుతామని చెప్పారు. విద్యార్థులను కలుపుకొని ముందుకు వెళతామని, విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలవలేదనే విషయం తెలుసుకోవాలని వారు హెచ్చరించారు? -
ప్రత్యేక ప్యాకేజీ లోకేశ్ జేబు నింపడానికా..!
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాలకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నారని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. నాగార్జున యాదవ్ అనే విద్యార్థి మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భావి విద్యార్థి తరం, యువతరం, సమస్త ఆంధ్ర ప్రజానీకం బాగుండాలని ఉద్దేశంతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఇప్పటికే ఆయనకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, కీటోన్స్ పాజిటివ్‌గా వచ్చే అవకాశం ఉందని, కిడ్నీలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, పల్స్ పోడిపోతున్నాయని సమాచారం వస్తుందని, ఆయనకు ఏమైనా అయితే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రత్యేక హోదా గురించి ప్రశ్నిస్తుంటే ప్రత్యేక ప్యాకేజీ గురించి బాబు మాట్లాడుతున్నారని, అది ఎందుకు ? లోకేశ్ జేబు నింపడానికా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర పోవడం సరికాదని చెప్పారు. ఇప్పటికే దీక్ష ఐదో రోజుకు చేరుకుందని, ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోందని, అయినా ప్రభుత్వం నిమ్మకుండా ఉండటం వెనుక దురుద్దేశం ఏమిటని నిలదీశారు. రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. వైఎస్ జగన్‌ను ఏమైనా చేయాలనుకుంటున్నారా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని వేదికనుంచి ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం స్పందించకుంటే విద్యార్థిలోకం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. -
వెల్లువలా ప్రజా మద్దతు.. ఉద్యమం ఉధృతం
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు వెల్లువలా ప్రజా మద్దతు లభిస్తోంది. వివిధ జిల్లాల నుంచి ఆదివారం భారీ సంఖ్యలో యువత, విద్యార్థిలోకం, సామాన్యులు దీక్షా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. పలు చోట్ల ఆయన దీక్షకు మద్దతుగా ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ కు మద్దతుగా పుత్తూరులో వైఎస్ఆర్ సీపీ నేత ఏనుమలై ఆధ్వర్యంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసన జరుగుతుండగా.. నగరిలో వైఎస్ఆర్ సీపీ నేత కేజే కుమార్ ఆధ్వర్యంలో నిరసన జరుగుతోంది. ఇక విజయపురంలో వైఎస్ జగన్ కు మద్దతుగా జాతీయ రహదారిపై పార్టీ నేత లక్ష్మీ పతిరాజు ఆధ్వర్యంలో ర్యాలీతోపాటు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్రీ కాళహస్తిలో ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహిస్తున్నారు. మరోపక్క, నిండ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ జగన్ ఆరోగ్యం బాగుండాలని వారు ప్రార్థించారు. -
కాసేపట్లో వైఎస్ఆర్ సీపీ కీలక నేతల భేటీ
గుంటూరు: ప్రత్యేక హోదా విషయంలో మరింత వేగంతో ముందుకు పోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఆదివారం ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన దీక్షా స్థలివద్దే పార్టీ నేతలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే అంశంతోపాటువైఎస్ జగన్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపైనే చర్చించనున్నారు. మరోపక్క, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయన దీక్ష ఐదో రోజుకు చేరుకుంది. ఆదివారం ఉదయం వైద్యులు వైఎస్ జగన్‌కు వైద్య పరీక్షలు చేశారు. వైఎస్ జగన్ బరువు తగ్గి బాగా నీరసించిపోయారు. షుగర్ లెవల్స్ పడిపోయాయి. వైఎస్ జగన్ ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బీపీ 110/70, పల్స్ రేట్ 66 ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఈ రోజు మధ్యాహ్నం వైఎస్ జగన్‌కు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక దీక్షకు రోజురోజుకు మద్దతు ఎక్కువవుతోంది. విద్యార్థులు, యువకులు, రైతుల సమర దీక్షకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. -
సమరదీక్షకు సన్నద్ధం
♦ మంగళగిరి వై జంక్షన్ వద్ద దీక్షాస్థలిలో భూమిపూజ ♦ వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శివిజయసాయిరెడ్డి పర్యవేక్షణ ♦ జిల్లా నేతల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ♦ నియోజకవర్గ నేతల విసృ్తత సమావేశాలు ♦ పోస్టర్లు విడుదల చేస్తున్న నాయకులు సాక్షి ప్రతినిధి, గుంటూరు : మంగళగిరి వై జంక్షన్ వద్ద ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చేనెల 3, 4 తేదీల్లో చేపట్టనున్న సమరదీక్షను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి శనివారం సాయంత్రం సమరదీక్ష చేపట్టనున్న స్థలంలో భూమిపూజ చేశారు. మంగళగిరి వై జంక్షన్ వద్ద దీక్షాస్థలిలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యనేతలంతా హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసగించిన విషయాన్ని పూర్తిస్థాయిలో ప్రజలకు వివరించాలని నేతలు ప్రతినబూనారు. ముమ్మరంగా ఏర్పాట్లు.. సమరదీక్షను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఐదు ప్రధాన అంశాల్లో బాబు ప్రజల్ని మోసగించిన విధానాన్ని వివరిస్తున్నారు. రాజధాని పేరుతో బాబు నిర్వహిస్తున్న రియల్ వ్యాపార చిదంబర రహస్యాన్ని పేర్కొంటున్నారు. పార్టీనేతలు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో స్వచ్ఛందంగా దీక్షకు తరలివచ్చే ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకునేపనిలో నేతలు నిమగ్నమయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతుండగా.. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ సూచనల మేరకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు చెందిన ప్రతినిధులు, సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర నేతలు ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సరిహద్దునే ఉన్న కృష్ణాజిల్లా నేతలు ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతల్లో భాగస్వాములవుతున్నారు. భూమిపూజ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కన్వీనరు తలశిల రఘురామ్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్, ఎస్సీసెల్ కన్వీనర్లు పూనూరు గౌతంరెడ్డి, మేరుగ నాగార్జున ,రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, తాడికొండ ఇన్చార్జి కత్తెర సురేష్‌కుమార్, ఎంపీపీ పచ్చల రత్నకుమారి, యూత్, ఎస్సీ, ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్లు కావటి మనోహర్ నాయుడు, బండారు సాయిబాబు, మొగిలి మధు, ఎంపీటీసీలు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నే శేషారావు, కౌన్సిలర్ బుర్రముక్క వేణగోపాలరెడ్డి, జిల్లా కార్యదర్శి మాచర్ల సుధాకర్, నాయకులు మున్నంగి గోపిరెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డి, చిల్లపల్లి మోహన్‌రావు, మునగాల మల్లేశ్వరావు, పచ్చల శ్యాంబాబు, మల్లవరపు సుధారాణి, కొల్లి ఇందిరాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
సమర దీక్షను జయప్రదం చేయండి
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల: సీఎం చంద్రబాబు చేసిన మోసాలను ఎండగట్టేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరి వద్ద చేస్తున్న సమర దీక్షను జయప్రదం చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి జిల్లాలోని పార్టీ శ్రేణులకు నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం స్థానిక వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. టీడీపీ నాయకులు పోస్టర్ల ద్వారా ప్రతి గ్రామంలో రైతులు రుణాలు చెల్లించవద్దు.. చంద్రబాబు అధికారంలోకి వస్తే మాఫీ చేస్తారని ప్రచారం చేసుకున్నారన్నారు. ఎన్నికలలో రైతులతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక సవాలక్ష ఆంక్షలతో అరకొర మాత్రమే మాఫీ చేసి రైతులను దారుణంగా మోసం చేశారన్నారు. మాఫీ అయిన మొత్తం రైతులకు కనీసం వడ్డీకి సరిపోలేదన్నారు. కానీ దేశం నేతలు రుణమాఫీ చేశామని చంకలు గుద్దుకుంటున్నారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు రుణం అంతా మాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చాక రూ.10వేలు అన్నారన్నారు. ఇప్పుడేమో అది కూడా మూడు విడతల్లో ఇస్తానని.. మొదటి విడత రూ.3వేలు జమ చేస్తామంటున్నారని ధ్వజమెత్తారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల ముందు ఊదరగొట్టిన దేశం నేతలు కొత్త ఉద్యోగం సంగతేమో కానీ ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారని ఆవేదన చెందారు. ఇలా హామీలన్నీ తంగలో తొక్కారని.. బాబు చేసిన మోసాలను ఎండగట్టి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వైఎస్ జగన్ దీక్ష చేస్తున్నారన్నారు. అనంతరం ప్రజలు సమస్యలు వివరించగా.. పరిష్కారానికి అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్‌రెడ్డి, అగడూరు ఎంపీటీసీ శంకర్‌రెడ్డి, తుమ్మలపల్లె రమణారెడ్డి, సైదాపురం సురేష్, ఆర్.తుమ్మలపల్లె ఎంపీటీసీ విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విజయమ్మ దీక్షకు కడపలో మద్దతు