బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే యత్నం | ys jagan mohan reddy in guntur hospital | Sakshi
Sakshi News home page

బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే యత్నం

Published Tue, Oct 13 2015 4:52 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే యత్నం - Sakshi

బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే యత్నం

గుంటూరు: ప్రత్యేక హోదా కోసం తన దీక్షను కొనసాగిస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీక్షా స్థలి వద్ద నుంచి బలవంతంగా గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు.. అక్కడి ప్రభుత్వ వైద్యులచే వైఎస్ జగన్ కు  ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేయగా అందుకు ఆయన నిరాకరించారు.

తాను దీక్ష కొనసాగిస్తానని పోలీసులకు స్పష్టం చేశారు. అయినా, ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఆయనకు రక్తం, బీపీ, షుగర్, కీటోన్స్ వంటి ఐదురకాల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఫ్లూయిడ్స్ ఎక్కించాలని వారు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement