వైఎస్ జగన్కు షర్మిల పరామర్శ | ys sharmila reached guntur | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్కు షర్మిల పరామర్శ

Published Mon, Oct 12 2015 11:03 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ys sharmila reached guntur

గుంటూరు: వైఎస్ షర్మిల గుంటూరు చేరుకున్నారు. వెంటనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దీక్ష నేటికి ఆరు రోజులు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయనను పరామర్శించేందుకు వచ్చారు.

అంతకు ముందే వైఎస్ జగన్ను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు ఈ రోజు హైదరాబాద్ నుంచి గుంటూరుకు బయల్దేరి వైఎస్ జగన్ను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆయన సోదరి వైఎస్ షర్మిల గుంటూరుకు బయల్దేరారు. సోమవారం మధ్యాహ్నం షర్మిల బెంగళూరు నుంచి గుంటూరుకు పయనమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement