వెల్లువలా ప్రజా మద్దతు.. ఉద్యమం ఉధృతం | more response to ys jagan mohan reddy indefinite fasting | Sakshi
Sakshi News home page

వెల్లువలా ప్రజా మద్దతు.. ఉద్యమం ఉధృతం

Published Sun, Oct 11 2015 9:14 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

more response to ys jagan mohan reddy indefinite fasting

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు వెల్లువలా ప్రజా మద్దతు లభిస్తోంది. వివిధ జిల్లాల నుంచి ఆదివారం భారీ సంఖ్యలో యువత, విద్యార్థిలోకం, సామాన్యులు దీక్షా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. పలు చోట్ల ఆయన దీక్షకు మద్దతుగా ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ కు మద్దతుగా పుత్తూరులో వైఎస్ఆర్ సీపీ నేత ఏనుమలై ఆధ్వర్యంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసన జరుగుతుండగా.. నగరిలో వైఎస్ఆర్ సీపీ నేత కేజే కుమార్ ఆధ్వర్యంలో నిరసన జరుగుతోంది. ఇక విజయపురంలో వైఎస్ జగన్ కు మద్దతుగా జాతీయ రహదారిపై పార్టీ నేత లక్ష్మీ పతిరాజు ఆధ్వర్యంలో ర్యాలీతోపాటు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శ్రీ కాళహస్తిలో ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహిస్తున్నారు.
మరోపక్క, నిండ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైఎస్ జగన్ ఆరోగ్యం బాగుండాలని వారు ప్రార్థించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement