
వైఎస్ఆర్ సీపీ కీలక నేతల భేటీ
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. గుంటూరులోని నల్లపాడు రోడ్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న చోట వారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే అంశంతోపాటు వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితులపట్ల చర్చిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దీక్ష ఐదో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆదివారం ఉదయం ఓసారి 11గంటలు దాటిన ప్రాంతంలో ఓసారి వైద్య పరీక్షలు నిర్వహించారు.