హ్యాపీ బర్త్‌డే మేడమ్.. | ys vijayamma birthday celebrations | Sakshi
Sakshi News home page

హ్యాపీ బర్త్‌డే మేడమ్..

Published Wed, Apr 19 2017 11:38 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

హ్యాపీ బర్త్‌డే మేడమ్.. - Sakshi

హ్యాపీ బర్త్‌డే మేడమ్..

అనంతపురం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ 61వ జన్మదిన వేడుకలను బుధవారం నగరంలోని ఆ పార్టీ  జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి కేక్‌ కట్‌ చేశారు. నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు కేక్‌ తినిపించుకున్నారు. ఈ సందర్భంగా శంకరనారాయణ మాట్లాడుతూ మహానేత దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన ప్రతి మంచి పనిలోనూ ఆయన సతీమణి విజయమ్మ భాగస్వామిగా ఉన్నారని గుర్తు చేశారు. అలాగే ఆమె తనయుడు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే ప్రతి పనికీ ఆమె దీవెనలు ఉన్నాయన్నారు. గురునాథరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ సతీమణిగా విజయమ్మ అనేక సేవలందించారన్నారు.

వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కష్టకాలంలో నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటూ భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. ఆమె ఆయురారోగ్యాలతో మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, జిల్లా అధికార ప్రతినిధి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శులు  వెంకటరామిరెడ్డి, రామచంద్రారెడ్డి, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కొర్రపాడు హుసేన్‌పీరా, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, కార్పొరేటర్లు బోయ సరోజమ్మ, బోయ గిరిజమ్మ, మహిళా విభాగం నాయకురాళ్లు ప్రమీల, కృష్ణవేణి, శోభ, షమీమ్, అజరాభి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement