మృతులకు వైఎస్ వివేకా నివాళి
మృతులకు వైఎస్ వివేకా నివాళి
Published Tue, Jan 3 2017 1:38 AM | Last Updated on Sat, Jul 7 2018 2:37 PM
అనంతపురం : అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అంబటి నారాయణరెడ్డి, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్ సీపీ నేత యెడుగూరి రామ్మోహన్రెడ్డి, ఆయన భార్య మాజీ కార్పొరేటర్ మాధవి, కూతురు అనూష, గుండెపోటుతో మృతి చెందిన క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు జైపాల్‌కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సోమవారం నివాళి అర్పించారు. అంబటి నారాయణరెడ్డి, యెడుగూరి రామ్మోహ¯ŒSరెడ్డి, ఆయన భార్య, కూతురి వైకుంఠ సమారాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన వివేకానందరెడ్డి ముందుగా హౌసింగ్‌బోర్డులోని జైపాల్ ఇంటికి వెళ్లారు. జైపాల్ భార్య రాణితో మాట్లాడుతూ మీ కుటుంబాన్ని పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తనమాటగా చెప్పి పంపారన్నారు. అక్కడి నుంచి అంబటి నారాయణరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సాయినగర్‌లోని యెడుగూరి రామ్మోహన్డ్డ్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. రామ్మోహన్రెడ్డి, మాధవి, అనూష చిత్రపటాల వద్ద నివాళి అర్పించారు. వారి గుర్తుగా ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి, ఎస్కేయూ మాజీ వీసీ రామకృష్ణారెడ్డి, కర్ణాటక రిటైర్డ్ ఉన్నతాధికారి ఎం.వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, చవ్వా రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం.మోహన్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వివేకానందరెడ్డికి ఎస్కేయూ ముఖద్వారం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
Advertisement
Advertisement